రావణ భక్తులే కాంగ్రెస్ కు ఓటేస్తారు- రామ భక్తులు కాదు! యోగి ఆదిత్యనాథ్‌

రాజస్తాన్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ "రామ భక్తులు బీజేపీకి ఓటేస్తారు. రావణ అనుచరులు మాత్రమే కాంగ్రెస్‌ కి ఓటేస్తారు" అంటూ  సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజస్తాన్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యోగి,  రామాయణాన్ని మరోసారి జనసామాన్యానికి గుర్తుకు తెచ్చారు. అంతే కాదు "హనుమాన్‌ గిరిజనుడు. అడవు ల్లోనే తిరిగారు. రాముని కోరిక మేరకు హనుమంతుడు నలుదిక్కులను ఏకం చేసి ఈ అఖండ భారత దేశాన్ని నిర్మించేందుకు కృషి చేశారు. ఇప్పుడు మేము కూడా ఈ ఆశయాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాము" అంటూ యోగి వ్యాఖ్యానించారు.

 అంతేకాక రాముడిని పూజించే వారంతా బీజేపీకి ఓటేస్తారని, రావణాసురుని అనుచరులు మాత్రమే కాంగ్రెస్‌కు ఓటేస్తారని యోగి ఆదిత్యనాథ్‌ ఆరోపించారు. రాజస్తాన్‌ లో ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ ద్విముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఓ వైపు యోగి ఆదిత్యనాథ్‌ హిందువులను, దళిత ఓటర్లను ఆకర్షించే పనిలో ఉండగా, మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి తనవల్లే సాధ్యమంటూ ప్రచారం చేసుకుంటున్నారు

కాగా హనుమంతున్ని దళితుడంటూ యోగి చేసిన వ్యాఖ్యలపై రాజస్థాన్ 'సర్వ బ్రాహ్మణ మహాసభ' లీగల్ నోటీసు ఇచ్చింది. మూడు రోజుల్లో క్షణాపణ చెప్పకపోతే చట్టపరంగా చర్యలు తప్పవని స్పష్టం చేసింది. హనుమంతుడు దళితుడు అని చెప్పినందుకు మూడు రోజుల్లో క్షమాపణ చెప్పాలని లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సురేష్ మిశ్రా నోటీసులు జారీ చేసింది.


కాగా ఇంతకుముందే మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. `90% మంది ముస్లింలు కాంగ్రెస్ కే ఓటు వేయాలని మధ్యప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు - కమల్ నాథ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన సీఎం యోగి ఆదిత్యనాథ్.. కాంగ్రెస్కు ఎస్సీ - ఎస్టీల ఓట్లు అవసరం లేదని తెలుస్తున్నది.


కాంగ్రెస్ కు కేవలం ముస్లింల ఓట్లు ఉంటే సరిపోతుంది. మీ అలీని మీ వద్దే ఉంచుకోండి.. మాకు బజరంగ్ భళీ (హనుమంతుడు)  చాలు` అని పేర్కొన్నారు. కాగా దీనిపై వివాదం చెలరేగింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: