సిబీఐకి 'నో ఎంట్రీ' చెప్పిన ముఖ్యమంత్రులంతా ఏమయ్యారో తెలుసా?


సీబీఐ తో ఆట అంటే బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ పేరు తొలుత చెప్పుకోవాలి. దాణా కుంభకోణంలో చిక్కుని సీబీఐ దృష్టిలో పడ్డారు. అయితే విచారణను తప్పించుకోవడానికి ఆ సంస్థను రాష్ట్రంలోకి రాకుండా జీవో ఇచ్చారు. సుప్రీంకోర్టు దాన్ని కొట్టేయడంతో సీబీఐ విచారణ జరిపి ఆయన్ను జైలుకు పంపింది. ఆ తరువాత రాజకీయంగా ఆయన బాగా వీకైపోయారు.

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి గా పనిచేసిన కాలంలో వీరభద్ర సింగ్ పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆ కేసు కూడా సీబీఐ చేతికి వెళ్లింది. దీంతో వీరభద్ర సింగ్ సీబీఐను అడ్డుకుంటూ తన రాష్ట్రంలో 'నో ఎంట్రీ' అంటూ  జీవో జారీ చేశారు. కానీ - సుప్రీంకోర్టు ఆ జీవోను కొట్టేసింది. తరువాత కేసు విచారణ జరిగి వీరభద్రసింగ్ తో సతీ సమేతంగా జైలు కెళ్లాల్సి వచ్చింది.

జార్ఖండ్ లో ఇండిపెండెంట్ అభ్యర్థి గా గెలిచి అదృష్టం తంతే గార్లె బుట్టలో పడి ముఖ్యమంత్రి అయిపోయిన మధుకోడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో సీబీఐ ఎంటరైంది. ముఖ్యమంత్రి అయిపోయిన అంత స్పీడుగాస్పందించి సీబీఐ ప్రవేశాన్ని 'నో ఎంట్రీ' అంటూ నిరాకరిస్తూ జీవో జారీచేశారు.. కానీ దిల్లీకోర్టు కొట్టేసింది. దాంతో సీబీఐని  ప్రవేశాన్ని ఆయన ఆపలేకపోయారు. చివరకు ముఖ్యమంత్రి హోదా లోనే 'అరెస్టై జైలు ఊచలు' లెక్కపెట్టారు, అదీ కూడా మరీ కొద్దికాలంలోనే. 

ఇక మన పొరుగు రాష్ట్రం, చంద్రబాబు గారు ఈమద్య రాజకీయ ప్రాణప్రతిష్ట చేసిన కర్ణాటక — గతకాలంలో యడ్యూరప్ప కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మైనింగ్ కేసుల్లో ఉన్న గాలి జనార్దన రెడ్డిని వెనకేసు కొచ్చారాయన. సీబీఐ విచారణను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. కానీ హై-కోర్టు ఉత్తర్వులను కొట్టేసింది. దాంతో సీబీఐ తన పని మొదలుపెట్టి యడ్యూరప్పను జైలుకు పంపింది.


ఇప్పుడు మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో,  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్రంలో సిబీఐ ప్రవేశానికి సాధారణ సమ్మతిని రద్ధుచేస్తూ ప్రభుత్వ ఆదేశం విడుదల చేశారు.  ఆయన పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు సిఎం రమేష్ - సుజనా చౌదరి, బీద మస్తాన్ రావు అనే మాజీ ఎమెల్యే పారిశ్రామికవేత్త తదితరులపై ఈడీ - ఐటీ రైడ్లు జరగడం. ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహనరెడ్డిపై హత్యాయత్నం కేసులు వచ్చి పడడంతో ఆయన కంగారుపడి సీబీఐకి నో ఎంట్రీ బోర్డుపెట్టారు. మరి చంద్రబాబు పరిస్థితి ఏమవుతుందో చూడాలి.


సీబీఐని అడ్డుకున్న వీర శూరాగ్రేశ్వరుడు ఒక్క నారా చంద్రబాబు నాయుడు మాత్రమే కాదు - గతంలో ఇలాంటి ముఖ్యమంత్రులున్నారు. అయితే, వారందరికీ చివరికి ఏమైంది? వారి రాజకీయ జీవితం ఏమైందో పైన వివరించాం.    


"సీబీఐకి నో" చెప్పిన చంద్రబాబును మోడీ వ్యతిరేక వర్గమంతా ఇప్పుడు హీరోలా చూస్తోంది. అంతేకాదు మమత బెనర్జీ, హెచ్ డి కుమారస్వామి, అరవింద్ కేజ్రివాల్ వంటివారు ఈ విషయంలో ఆయన్ను అనుసరించి అభినందించగా, స్వంత మీడియా అహోరాత్రాలు గోరంతలు కొండంతలు చేసి చంద్రబాబు గొప్ప కథానాయకుణ్ణి చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని ఎదిరించే మొనగాడు చంద్రబాబు మాత్రమే అని దేశంలో చాలామంది ఇప్పటికే డిసైడైపోయారట.


అయితే, సీబీఐ విషయంలో ఉన్న ఒక సెంటిమెంట్ - గత అనుభవాలను గుర్తు చేస్తున్నవారు మాత్రం చంద్రబాబు జైలు కెళ్లడం ఖాయమంటున్నారు. అందుకు పైన వివరించిన ఉదాహరణలు కూడా చూపిస్తున్నారు.  గతంలో ఇలాగే సీబీఐకి ఆటంకం కలిగించే జీవోలు ఇచ్చిన  ముఖ్యమంత్రులంతా ఆ తరువాత ఎన్నికల్లో ఓటమిపాలై కేసుల్లో చిక్కుకుని జైలు ఊచలు లెక్కబెట్టారట.


అయితే అవన్నీ గత ప్రభుత్వాల హయాంలో జరిగినవే.  బిజెపి ప్రభుత్వ హాయాంలో జరిగినవి కావు. అయినా నేఱాభియోగాల విచారణలు జరిగే తరుణంలో "నో ఎంట్రీ టు సిబీఐ" అంటే జనం తమ చెవుల్లో కాలీఫ్లవర్లు పెట్టుకొని కూర్చోలేదు. మనం మన చంచా మీడియా ఎన్ని గొట్టాల్తో గీ పెట్టినా రంగు డబ్బాల్లో ఎన్ని సినిమాలేసినా జనం ఆమాత్రం అర్ధం చేసుకోగలరు కదా!

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: