ఒక్క ఓటు ఎంత పని చేసింది.. ఇదే ఓటు ప్రమాణం..!

Chakravarthi Kalyan

రాజును.. బంటును.. సమానంగా చూసే గొప్పదనం ప్రజాస్వామ్యానిది. ప్రధాని అయినా సామాన్యుడైనా ఓటు ముందు అంతా సమానమే. అందరి ఓటు విలువా ఒక్కటే. భారత రాజ్యాంగం మనకు ప్రసాదించిన హక్కుల్లో ఓటు హక్కు చాలా విలువైంది. ఆ నేను ఒక్కడినీ ఓటేయకపోతే ఏమవుతుందిలే అన్న బద్దకం అస్సలు పనికిరాదు.



ఓటు విలువ తెలియజెప్పేఓ అద్భుతమైన ఘటన 2008లో జరిగింది. అప్పటి రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర పీసీసీ ప్రెసిడెంట్ గా సీపీ జోషి ఉండేవాడుఆ ఎన్నికల్లో ఆయన కేవలం ఒక్క ఓటు తేడాతో ఓడిపోయాడట. విచిత్రం ఏంటంటే.. ఆ ఎన్నకల్లో జోషి భార్య, తల్లి మరియు డ్రైవర్ ఓటు వేయలేదట.



అంతే కాదు.. తన డ్రైవర్ ఓటేయడానికి వెళ్తానంటే జోషియే అడ్డుపడి ఆపాడట. చివరకు ఒక్క ఓటు తేడాతో జోషి ఓడిపోయాడు. గెలిస్తే సీఎం కావాల్సిన వాడు.. చివరకు ఎమ్మెల్యే కూడా కాలేకపోయాడు. అందుకే మన ఒక్క ఓటుతో ఒరిగేదేముంది అన్న మనస్తత్వం వద్దే వద్దు. ఓటే ముద్దు.


మన ఓటుతో గెలిచే ముఖ్యమంత్రే కాదు.. ఓటేసే ముందు మనం కూడా ఓటు ప్రమాణం చేయాలి.. ఆ ప్రమాణం ఇలా ఉండాలి.

" ఓటర్ అనే నేను... శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయతను చూపుతానని, దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడడానికి, ఒక ఓటరుగా, నా కర్తవ్యమైన "ఓటు"ను శ్రద్దతో, అంతఃకరణ శుద్దితో, భయంగాని, పక్షపాతంగాని, రాగద్వేషాలు గాని లేకుండా, నోటుకు, మద్యానికి, కులానికి, మతానికి లొంగకుండా వివేచనా, విచక్షణా జ్ఞానంతో రాజ్యాంగం నాకు కల్పించిన అత్యద్భుతమైన అవకాశమైనటువంటి ఓటు హక్కును వినియోగించుకుంటానని రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నాను."


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: