కులగజ్జి తీవ్రస్థాయికి చేరటానికి ఏపి అధినేత నిర్వాకమే కారణం: పోసాని కృష్ణ మురళి

ప్రభుత్వాధినేత కులాధినేత కావటంతోనే ఆంధ్రప్రదేశ్ లో కమ్మవారు, టిడిపి ప్రభుత్వం, రెండూ సమాజం నుండి మానసిక వెలివేతకు గౌరౌతున్నారని, ఆ పరిస్థితి తెలంగాణాలో లేదని కనీసం కుల ప్రభావానికి ఇక్కడి కమ్మవారు పడలేదని ప్రముఖ తెలుగు నటుడు రచయిత అదే సామాజిక వర్గానికి చెందిన పోసాని కృష్ణ మురళి అదీ తీవ్ర ఆవేదనతో వ్యాఖ్యానించారు. దానికి సంబంధించిన వీడియో ఈ ఆర్టికిల్ తో అందిస్తున్నాము.


ఆంధ్ర లో కమ్మ వారి పరిస్థితి ఏమిటో తెలుసా?  అంటూ ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మీడియాలో ఆ విషయమై వచ్చిన వార్తలు ఆసక్తికరంగా ఉన్నాయి.


నేను కమ్మ వాణ్ణి.  ఆంధ్రలో ఉన్న మా కులం వారి పరిస్థితి ఏమిటో మీకు తెలుసా?  నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ కారణంగా కమ్మ వారిని అంటరాని వారి కింద సమాజం చూస్తుంది. 


"మనం కమ్మ వారం.  మన కులం వారికే ఓట్లేయాలి.  కాపులకు, రెడ్లకు వేయరాదని అందరి రక్తనాళాల్లోకి ఎక్కించారు. మరి మన కులం వారు మాత్రమే ఓట్లేస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారా?

అంత సంఖ్యలో మన కులం వారున్నారా?

మరి మన కులం వారికి ఎందు కంత కుల పిచ్చి ఎక్కించారు? 

కుల దురద ఎందుకు పుట్టించారు?

బ్రోకరైనా, లోఫరైనా మన కులం వారికే ఓటు వేయాలని కమ్మ కుల దురద ఎక్కించారు?


తెలంగాణ కమ్మవారికి ఈ పిచ్చి లేదు. అందుకే వారు సమాజంలో గౌరవాన్ని పొందుతూ ఆనందంగా బతికేస్తున్నారు.  లగడపాటి రాజగోపాల్‌ సర్వే గురించి ప్రస్తావించా లంటేనే సిగ్గేస్తోంది.


సైబరాబాద్‌ నిర్మాణానికి కాంగ్రెస్‌ వారు శంకుస్థాపన చేస్తే చంద్రబాబు దాని చుట్టూ స్థలాలు కొని ప్రయోజనం పొందారు. సైబరాబాద్‌ నేనే కట్టాను అని చంద్రబాబు చెప్పడం ఎంతదౌర్భాగ్యం?


ఆయన సైబరాబాద్‌ చుట్టు పక్కల పొలాలను కొని వాళ్లవాళ్లను ఆయన బినామీలను అభివృద్ధి చేశాడు అంతే. కాని ఆ సమాజం లోని వారికి ఆయన చేసిన మేలేమైనా ఉందా?


సైబరాబాద్ లో ఎలా ఐతే ప్రజా సంపదను దోచేసి తన కులం వాళ్ళ పరం చేశాడో ఈ రోజు అమరావతిలో చంద్రబాబు అదే చేసాడు. అమరావతిలోను, ఆ చుట్టుపట్ల ఇరుగు పొరుగు భూములన్నీ కారు చవక ధరలకు ప్రభుత్వం పేరు చెప్పి స్వంతం చేసుకున్నవారిలో అత్యధికులు కమ్మవారే. మిగిలిన కొద్దిమంది ఎవరైనా ఉంటే బాబు గారి అనుచరులే అని ఆయన మాటల్లో ద్వనించింది. 

 


ఇవాళ మీరెళ్లండి అమరావతి చుట్టుపక్కల భూములన్నీ మా సామాజికవర్గం అంటే కమ్మ వాళ్లవే.  కేసీఆర్‌ ఏమీ మా కుల పోడు కాదు. కేసీఆర్‌ చేస్తున్న పనులు మంచివి కావడం వల్లే నేను ఆయన గెలవాలని కోరుకున్నా.


నిజాయితీగా నిరంతరం పని చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే ఆంధ్రలో తహసీల్దారు వనజాక్షిని చెప్పుతో కొట్టిన వారిని ఎందుకు అరెస్టు చేయించ లేదు? ఆయన తన కుల పోడనే కదా! అని ఆయన ప్రశ్నించారు. అలాగే ఆంధ్ర సమాజంలోని అన్నీ వ్యవహారాలను కమ్మ కులం పరం చెస్తే మిగిలిన వారికి మండదా? ఈయన వలన కమ్మ కులం భ్రష్టుపట్టి పోతుందని ఆవేదన చెందారు పోసాని.  

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: