ఎడిటోరియల్ : ఏపి ఎన్నికల్లో కెసియార్ ప్లాన్ ఇదేనా ? రిటర్న్ గిఫ్ట్

Vijaya

రానున్న ఏపి ఎన్నికల్లో తాము కూడా వేలు పెడతామని కెసియార్, కెటియార్ చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. తెలంగాణా ఎన్నికల్లో యాక్టివ్ పార్టు తీసుకున్న చంద్రబాబునాయుడును ఉద్దేశించి కెసియార్ మాట్లాడుతూ చంద్రబాబుకు తాను రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ చెప్పారు. రిటర్న్ గిఫ్ట్ విషయమై రాజకీయంగా రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. టిఆర్ఎస్ వర్గాల సమాచారం ప్రకారమైతే కెసియార్ తొందరలో ఫెడరల్ ఫ్రంట్  ఏర్పాటు చేయబోతున్నారట. బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా జాతయ స్ధాయిలో ఓ నేషనల్ల పార్టీ ఏర్పాటవుతుందంటూ కెసియారే స్వయంగా చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది.

 

జాతీయ స్ధాయిలో ఏర్పాటు చేయబోయే ప్రత్యామ్నాయానికి కెసియార్ ఫెడరల్ ఫ్రంట్ అని పేరు పెట్టారు. ఆ ఫ్రంటులో ఏపి నుండి వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కూడా చేరమని ఆహ్వానిస్తున్నారట. ఒకవేళ జగన్, పవన్ గనుక ఫెడరల్ ఫ్రంట్ లో చేరితే వైసిపి, జనసేనలు ఒక విధంగా మిత్రపక్షాలవుతాయి. ప్రస్తుతానికైతే రెండు పార్టీల అధినేతలు ఉప్పు నిప్పులాగ వ్యవహరిస్తున్నారు. జగన్ ది మొదటి నుండి ఒకే స్టాం అయినా పవన్ మాత్రం ఎప్పటికప్పుడు గాలి వాటుగా ఏదో మాట్లుడుతూ అందరిలోను అయోమయం సృష్టిస్తున్నారు.

 

అసలు పవన్ ఏపిలో చంద్రబాబుకు మిత్రపక్షమా లేకపోతే వైసిపి లాగ ప్రతిపక్షమా అన్నది జనాలకు అంతుబట్టకుండా ఉంది. ఎందుకంటే, నిజంగానే పవన్ ప్రతిపక్ష నేత అయితే, అధికార పార్టీ తెలుగుదేశంపార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును వదిలిపెట్టి ప్రధాన ప్రతిపక్షం వైసిపి అధినేత జగన్ ను ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఒక ప్రతిపక్ష పార్టీ మరోక ప్రతిపక్ష పార్టీరి టార్టెట్ చేసుకుంటున్నదంటే అధికార పార్టీ తరపున పనిచేస్తున్నదనే అనుమానాలు జనాలకు రావటం సహజం. కాబట్టి సరైన స్టాండ్ తీసుకోలేని పవన్ దే తప్పంతా అని జనాలు అనుకుంటున్నారు. అయితే వీరిద్దరూ కెసియార్, కెటియార్ తో మంచి సంబంధాలు కలిగున్నారు.

 

 ఈ నేపధ్యంలోనే కెసియార్ ఫెడరల్ ఫ్రంట్ విషయాన్ని ఇద్దరితోను  ప్రస్తావించారట. మరి వారిద్దరూ ఏ విధంగా స్పందించారో మాత్రం స్పష్టంగా బయటకు రాలేదు. ఫెడరల్ ఫ్రంట్ లో వారిద్దరినీ తీసుకుని మిత్రపక్షాలను చేయాలని కెసియార్ వ్యూహమట. ఒకవేళ అదే గనుక జరిగితే ఏపి ఎన్నికల్లో సంచలనం నమోదైనట్లే. చంద్రబాబుకు కెసియార్ ఇవ్వబోయే రిటర్న్ గిఫ్ట్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందనే అనుకోవాలి. ఫెడరల్ ఫ్రంట్ లో మిత్రపక్షాలుగా కొనసాగుతున్న కారణంగా ఏపి ఎన్నికల్లో కూడా పొత్తు పెట్టుకుని పనిచేసేందుకు మార్గం సుగమం అవుతుంది.

 

సరే ఎవరెన్ని సీట్లలో పోటీ చేస్తారన్నది వేరే విషయం అనుకోండి. ముందంటూ ఇద్దరూ కలిసి పనిచేయటానికి ఒప్పుకుంటే సీట్ల షేరింగ్ అదే తేలిపోతుంది. ఇద్దరినీ కలిపిన కెసియార్, కెటియార్ సీట్ల షేరింగ్ విషయంలో మధ్యవర్తిత్వం చేయకుండానే ఉంటారా ? ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదంటే ప్రతిపక్షాలు ఐక్యంగా ఉండాలన్న విషయం ఇద్దరికీ తెలీకుండానే ఉంటుందా ? కాకపోతే తాను నిజమైన ప్రతిపక్షమే అని చంద్రబాబు జేబులోని మనిషిని కాదని నిరూపించుకోవాల్సిన అవసరం పవన్ మీదే ఉంది. ఒకవేళ ఇద్దరి మధ్య పొత్తంటూ కుదిరితే చంద్రబాబు పరిస్ధితేమిటన్నదే చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: