కేసీఆర్ ఆ విషయం లో కనీసం జగన్ ను అయినా ఒప్పిస్తాడా ...!

Prathap Kaluva

కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ నానా హంగామా చేస్తున్న సంగతి తెలిసిందే . అయితే తెలంగాణ ఎన్నికల్లో భారీ విజయం తరువాత కేసీఆర్ ఇంకా ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. మమతా బెనర్జీతో గతంలో కేసీఆర్‌ మంతనాలు జరిపారు, ఇంకోసారి మంతనాలు జరపనున్నారు కూడా. అయితే బీజేపీ వ్యతిరేక కూటమి ఆవశ్యకత గురించి పదే పదే మాట్లాడే మమతా బెనర్జీ, గతంలో కాంగ్రెస్‌ పార్టీతో కలిసి పనిచేశారు.. ఇప్పుడూ పనిచేయడానికి సిద్ధంగానే వున్నారు. కానీ, రాహుల్‌గాంధీని ప్రధానిగా ఆమె ఒప్పుకోవడంలేదు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీదీ ఇదే పరిస్థితి.


మారిన తాజా పరిస్థితుల నేపథ్యంలో, చంద్రబాబు కూడా తెలివిగా మాట మార్చేశారు. ప్రధాని అభ్యర్థి ఎవరన్నది ఇప్పుడు అప్రస్తుతం అంటూ అందరికీ పెద్ద షాకే ఇచ్చారాయన. ఈ మధ్యకాలంలో రాహుల్‌ని ఆకాశానికెత్తేస్తూ చంద్రబాబు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. కేసీఆర్‌ దూకుడుతో, వున్నపళంగా చంద్రబాబు వాయిస్‌లో మార్పు వచ్చిందనుకోండి.. అది వేరే విషయం.


మొత్తమ్మీద, జాతీయ స్థాయిలో తన వాయిస్‌తో ఏకీభవించడమే కాదు, గట్టిగా తనతోపాటు నిలబడే నేతల కోసం ఎదురుచూస్తున్న కేసీఆర్‌కి.. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు అంత సులువేమీ కాదు. కేసీఆర్‌కి ఘనంగా ఆహ్వానం పలికి, ఆప్యాయంగా కౌగలించుకున్నవారే. ఫెడరల్‌ ఆలోచనల్ని పక్కన పెట్టి కాంగ్రెస్‌తో మమేకమైపోతున్న దరిమిలా.. రానున్న రోజుల్లో కేసీఆర్‌ ప్రయత్నాలు ఏ మేరకు విజయవంతమవుతాయట.? అన్నిటికీ మించి, ఆంధ్రప్రదేశ్‌లో కేసీఆర్‌, వైఎస్సార్సీపీని అయినా మెప్పించగలరా.? వేచి చూడాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: