న్యూ ఇయర్ కు, క్రాకర్స్ కు ఉన్న సంబంధమేంటి..?

Vasishta

న్యూ ఇయర్ అంటేనే రకరకాల సెలబ్రేషన్స్ గుర్తొస్తాయి. అందులో ప్రపంచవ్యాప్తంగా పేరొందింది క్రాకర్స్ ను పేల్చడం.. న్యూ ఇయర్ కు వెల్ కమ్ అంటే క్రాకర్స్ పేల్చడమే అన్నంతగా అవి మారిపోయాయి. అర్ధరాత్రి 12 గంటలైతే చాలు.. ఆకాశంలో పలు రంగుల్లో వివిధ ఆకృతుల్లో వెలుగులు విరజిమ్ముతాయి. వాటిని చూసి ఆనందం పట్టలేక ప్రజలు కేరింతలు కొడుతుంటారు. అసలు న్యూ ఇయర్ కు ఇలా క్రాకర్స్ పేల్చడం వెనుక ఉద్దేశమేంటి..?


ఒకప్పుడు చైనాలో దుష్టశక్తులను పారదోలడానికి క్రాకర్స్ ను వాడుతుంటారు. 7వ శతాబ్దంలో చైనాకు చెందిన టాంగ్ వంశస్థుల పాలనలో పండగలు, ఇతర వేడుకల్లో ఈ ఫైర్ వర్క్స్ ను రూపొందించారు. దీన్ని ఒక శాస్త్రవిభాగంగా మార్చి ఆ నిపుణులను పైరో టెక్నీషియన్ లుగా పిలవడం మెదలు పెట్టారు. దీన్ని ఆ తర్వాత కాలంలో పాలనలోకి వచ్చిన సాంగ్ వంశస్థులు ప్రోత్సహించి ఫైర్ వర్క్స్ ను పలు రకాలుగా వృధ్ధిచేసి ఇతర దేశాలకు ఎగుమతి చేశారు. వాటి ఫలితమే నేడు ప్రపంచవ్యాప్తంగా రంగురంగుల క్రాకర్స్ చూస్తున్నాం.


మన దేశంలో కూడా అనేక సందర్భాల్లో క్రాకర్స్ వినియోగిస్తుంటాం.. సంతోషమైనా, ఆనందమైనా క్రాకర్స్ కాల్చడం కామనైపోయింది. చీకటి నుంచి అజ్ఞానాన్నిపారదోలి, జ్ఞానాన్నిచ్చేవి వెలుగులే. క్రాకర్స్ వెలుగుకు చిహ్నం. అందుకే కొత్త ఏడాది ముగిసి మరో కొత్త ఏడాదిలోకి స్వాగతం చెప్పే సమయంలో కూడా ఫైర్ వర్క్స్ ను కాలుస్తున్నాం.. మనదేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో నూతన సంవత్సర వేడుకలు గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర హోటల్ ట్రైడెంట్, హోటల్ తాజ్ రోడ్ల ట్రెజంక్షన్ లో ఘనంగా జరుగుతాయి. ఇక్కడ కూడా ఫైర్ వర్క్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి..



న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అత్యంత వేడుకగా జరిగే మరో ప్రదేశం ఆస్ట్రేలియాలోని సిడ్నీ. సర్క్యులర్ క్వే సిడ్నీలో అత్యంత వాణిజ్య ప్రాధాన్యమున్న ప్రాంతం. మధ్యలో హార్బర్ ఉంటుంది. ఈ హార్బర్ చుట్టూ ఆకాశ హర్మ్యాలు, ప్రముఖ వాణిజ్య సంస్ధలు కొలువై ఉన్నాయి. ఇక్కడ జరిగే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చూడడానికి రెండు కల్లూ చాలవు. ఫైర్ వర్క్స్ ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్.  


దుబాయ్ లో నూతన సంవత్సరం వేడుకలు బుర్జ్ ఖలీఫా సెంటర్ వద్ద జరగుతాయి. దుబాయ్ అంటేనే మనకు ఎత్తైన కట్టడాలు గుర్తొస్తాయి. ఖలీఫా ప్రపంచంలోనే ఎత్తైన టవర్ అనే విషయం తెలిసిందే! ఇక్కడ జరిగే ఫైర్ వర్క్స్ ప్రపంచవ్యాప్తంగా పేరొందాయి. ఇక్కడ సెలబ్రేషన్స్ వీక్షించేందుకు ప్రపంచంలోని నలుమూలల నుంచి పర్యాటకులు తరలివస్తారు.


లండన్ లోని బిగ్ బెన్ గడియారంలో సరిగ్గా 12 గంటలు కాగానే ఫైర్ వర్క్స్ ప్రారంభం అయితాయి. ఇది లండన్ లోని వెస్ట్ మినిష్టర్ బిల్డింగ్ పైన థేమ్స్ నదివైపు ఉంటుంది. సువర్ణకాంతుల తాపడాలతో వెస్ట్ మినిష్టర్ నాలుగు ప్రాకారాలు... థేమ్స్ నది వంతెన.. నదీప్రవాహం.. ఈ ఫైర్ వర్క్స్... రంగురంగుల కాంతుల్లో మనోహరమైన దృశ్యంగా సాక్షాత్కరిస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: