జగన్ పార్టీలోకి స్టార్ కమెడియన్ అలీ..!

Chakravarthi Kalyan

వైసీపీలోకి సినీ నటుల రాక పెరుగుతోంది. ఇటీవలే సినీనటుడు భాను చందర్ జగన్ ను ఆయన పాదయాత్రలో కలిశారు. అంతకుముందు సినీ నటుడు కృష్ణుడు కూడా జగన్‌ను కలిశారు. తాజా స్టార్ కమెడియన్ అలీ జగన్ ను కలిశారు. ఆయనతో గంటసేపు వరకూ ఏకాంతంగా చర్చించారు.



జగన్ పాదయాత్రపై ప్రశంసలు కురిపించిన అలీ.. ఆరోగ్యం కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలని జగన్ కు సూచించినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అలీ విశాఖ వచ్చి మరీ జగన్ ను కలవడంతో వైసీపీలో ఆలీ చేరిక ఖాయమైనట్టు వార్తలు వస్తున్నాయి.



జనవరి 9 న ఇచ్చాపురంలో జగన్ పాదయాత్ర ముగింపు సభ భారీగా జరగబోతోంది. ఆ సభలోనే అలీ పార్టీలో చేరవచ్చని తెలుస్తోంది. అయితే వైసీపీలో అలీ చేరుతున్నారన్న వార్తలపట్ల జనసేన కార్యకర్తల్లో విస్మయం వ్యక్తమవుతోంది.



అలీ మొదటి నుంచి చిరంజీవి కుటుంబంతో చక్కని సంబంధాలు కొనసాగిస్తున్నారు. అలీ వచ్చే ఎన్నికల్లో జనసేన తరపున బరిలో దిగనున్నాడని కూడా వార్తలు వచ్చాయి. ఆయన ఇప్పుడు హఠాత్తుగా జగన్‌ను కలవడం జనసేన వర్గాలలో కలకలం రేపుతోంది. సినీ నటులు ఒక్కొక్కరుగా వైసీపీ వైపు మొగ్గుతుండటం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: