ఎడిటోరియల్ II - ఏపి లో చాపకింద నీరులా ప్రభుత్వ వ్యతిరేఖత? నిశ్శబ్ధ ప్రభంజనం!

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మీడియా మద్దతుతో చంద్రబాబు నాయుడు రాష్ట్రంపై చేస్తున్న రాజకీయం అంతా ఇంతా కాదు. కేసీఆర్ తనతో పొత్తుకు అంగీకరించక పోవటాన్ని ఈయన చాలా అవమానంగా చూస్తున్నారు. టిడిపి చరిత్ర సమస్థం పోత్తుల పొడుపుల పరాయణత్వం. ఒకే ఒక సామాజికవర్గ అభివృద్ది ప్రయోజనాల ప్రాతిపదికన రెండే రెండు జిల్లాల కేంద్రంగా సాగే పాలన రాష్ట్రానికి ఏ మేలు చేయలేదని చెప్పొచ్చు.


నాలుగున్నర యేళ్ళ పాటు బిజెపి భజన ఆ తరవాత, ఒకే పనికి పదుల సంఖ్యలో శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాలు, వీడియో కాన్-ఫరెన్సులు, అనేక పేర్లతో జరిగిన విన్యాసాలు మొత్తం కలిపి నిరర్ధక వ్యయం ప్రజాధన సంపద బుగ్గిపాలు, రాష్ట్రం అప్పులపాలు. కేంద్రం తో గిల్లికజ్జాలు - సరిగా చూస్తే ప్రత్యేక హోదా సంజీవని కాదు ప్రత్యేక పాకేజీయే ముద్దు అని దానిని హత్తు కొని చేసిన కార్యక్రమాలు ప్రజల మదినుండి తొలగిపోవు. రాజకీయం కోసం ఎన్.డి.ఏ నుండి బయటపడి బిజెపి వ్యతిరేఖతతో ధర్మదీక్షలు, నిర్మాణ దీక్షలు.


మనకు హక్కు ఉన్నా  మనం కేంద్రం నుండి సహకారం తీసుకోవాలంటే వారితో మన సంబంధ బాంధవ్యాలు సఖ్యత ప్రాధాన్యత వహిస్తాయి. అలాంటి చోట్ల తన పార్లమెంటు సభ్యులతో, తన స్వప్రయోజనాలు, వారి స్వప్రయోజనాలు సాధించుకుంటూ బ్రతికిన నాయకత్వం సామాజిక ప్రయోజనాన్ని ఎలా సాధించు కోగలదు? అనేది ప్రధాన ప్రశ్న. ఇతర రాష్ట్రాల్లో ఏపి ప్రయోజనాలను ఫణంగా పెట్టి, బిజెపి వ్యతిరేఖత ప్రదర్శించటం, బిజేపి ఓటమికి దాని వ్యతిరేఖ పార్టీల గెలుపుకు తీవ్ర ప్రచారం చేస్తూ చేయిస్తూ దేశంలో అందరు రాజకీయ నాయకుల కంటే తానే ఎక్కువ అనుభవఙ్జుణ్ణి, ఆఖరకు ప్రధానమంత్రి కంటే కూడా నేనే గొప్పోణ్ని అనటం తనకంటే ఉన్నత స్థానంలో కూర్చున్న వాళ్లకి  'ఎక్కడో మండిపోయేలా, కర్రు కాల్చి వాత పెట్టాలనిపించేలా'  నిపిస్తుంది.


ఆత్మస్తుతి, పరనింద, స్వప్రయోజనాల సాధన, స్వకుల, స్వజనుల ప్రయోజనాలు మాత్రమే ప్రాధాన్యతగా పరిపాలన సాగించేవారికి, సర్వేలు ఎమి చెప్పినా సమాధానం ఎన్నికల తరవాత మాత్రమే తేలుతుంది. 2019 ఎన్నికలలో ఆయన స్వంత మీడియా ఎంత గోక్కున్నా తెలంగాణా ప్రజల మనసులో ఉన్నట్లే ఏపి ప్రజల మనసుల్లో మెదిలేది ఓటు కు నోటు కేసు, ఉమ్మడి రాజధానిని అన్యాయంగా వదిలెయ్యటం, ప్రజాధనాన్ని దుబారా చేయటం, రాజధాని పేరుతో మలేసియా జపాన్ సింగపూర్ మాకి అసోసియేట్స్, రాజమౌళి ఇలా చేసిన గారడీలు, విన్యాసాలు తాత్కాలిక నిర్మాణాల్లో తగలేసిన జాతి సంపద, గుజరాత్, కర్ణాటక, తెలంగాణా ఇలా అనేక రాష్ట్రాల్లొ బిజెపి వ్యతిరెఖత సాధించటానికి తరలించిన రాష్ట్ర సంపద - ఇదంతా ప్రజల మనసుల్లో సినిమా రీలులా తిరగటం తధ్యం.


వీటితోపాటు ఆయన ప్రవచించిన మద్యప్రదేశ్ రాజస్థాన్ చత్తీస్-గడ్ రాష్ట్రాలలో బిజెపి ఓటమికి తానే కారణం అని చెప్పటం ఇంకా మరెన్నోవిషయాలు చంద్రబాబు పై ప్రధాని మదిలో మంచిని కాదు కదా ఏదో చూద్ధాం అనే ఆలోచన కూడా మిగలనిస్తాయా? అన్నది అనుమానమే!  


అలాగే నైతికంగా టిటిడిలో చేసిన అరాచకాలు, వైదికులతో ఆడిన ఆటలు, వైరిపక్ష శాసనసభ్యులను గోడ దూకించి తన పార్టీలో చేర్చుకొని, ప్రతిపక్షాన్ని శాసనసభలో నిరంతరం అవమానాలకు గురిచేయగా అక్కడ ఇక చేసేదేమీ లేదని ప్రతిపక్షం జనారణ్యాలు పట్టటం - వారికి ఆ దుస్థితి పట్టించి అన్ని విధాలుగా మానసిక హింసకు  గురి చేసిన పలితం 2019 ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబు కు చూపిస్తారనె మాట ప్రభంజనం నిశ్శబ్ధగా వ్యాపించి ఉందని అంటున్నారు.


అలాగే కాంగ్రెస్ తో,  టిడిపి మైత్రిని  సమాజం హర్షించని అపవిత్ర సంగమం అని అంటున్నారు విశ్లేషకులు. ఇక కాంగ్రెస్ రాష్ట్రాన్ని అడ్ద దిడ్దంగా విడగొట్టి చేసిన ద్రోహం ఏ ఆంధ్రుడు మరచి పోడు. అది కలలోని మాట. అది వారి మనో ఫలకం నుండి చెరిగిపోలేదన్నది ప్రజల మాట


ఇకపోతే విపక్షనేత వైఎస్ జగన్మొహనరెడ్డిపై ఎయిర్-పోర్టులో దాడి, మరియు హత్యాప్రయత్నం కేసు విచారణ నిర్వహించిన తీరు, నేఱస్తునిపై కంటే ప్రభుత్వ నిర్వాకంపై ఫోకస్ అవటమే కాదు, అధికారపార్టీకి చేందిన వ్యక్తుల ప్రమేయం ఉందనేది,  ఎన్ఐఏ విచారణలో రేపు ఋజువై, విశ్వరూపం దాలిస్తే ప్రభుత్వ నైతికత కుడితి లో పడ్ద ఎలుక మాదిరే కదా! 


ఇక రాష్ట్రంలో సిబీఐ ప్రవేశ నిషేధం ఆత్మహత్యా సదృశం. కేంద్రంతో చంద్రబాబు కయ్యం - టిడిపికి గాని, ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకుగాని,  ఏ మేలూ చేయదు సరికదా! ఆదాయపు పన్ను ఎగవేసిన వాళ్ళు దొరికిపోతుంటే రాష్ట్రప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది యేమిటి? ఇదీ ప్రధాన ప్రశ్న. మీరు ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రులైంది - పన్నుఎగవేత దారుల్ని రక్షించటానికా? అన్నీ కాంట్రాక్టులను పత్రికా ప్రకటనలను మీ సామాజిక వర్గానికి చెందిన మీడియా హౌజెస్ కు పంచటానికా?  మీ ఎమెల్యేలు ఆడవారిపై చేసే దాష్టీకం నుండి కాపాడటానికా? ఇదంతా ప్రజలు మరువరు సరి కదా! రాస్తే రామాయణ మంత ఉంది ఈ నాలుగున్నరేళ్ళ చరిత్ర లోని అరాచకం, అవినీతి, కుటుంబ, కుల, బందుజన ప్రీతి. 


మరో ఆరునెలల్లో జరిగేది చెప్పాలంటే మహాభారతమే ఔతుంది. అమరావతిలో తెలుగు దేశంపట్ల ఉన్న వ్యతిరేఖత కూకటపల్లి ఎన్నికల్లోనే బట్టబయలైంది. కాంగ్రెస్ తో కలిపి నాలుగు పార్టీలను వెనుకేసుకొచ్చి నందమూరి ఆడపడుచు ఎన్నికల్లో నిలబడ్డప్పుడే జనం నిర్దాక్షిణ్యంగా ఓడించి వేసిన వ్యతిరేఖత అది. నిజంగా చెప్పాలంటే అది మోడీకి కాకుండా వైసిపికి అనుకూల విజయం ఇచ్చేది తధ్యం. తెలంగాణాలోలాగే ఎలాంటి వ్యూహాలు పనిచేయవనేది విశ్లేషకుల అభిప్రాయం. 


ఇక నరేంద్ర మోడి అసలే జగమొండి - ఆయన చిఠ్ఠా విప్పితే జరబోయేదేంటో తెలుస్తుంది. నన్నురక్షించండి, ప్రజలంతా నా చుట్టూ వలయంగా నిలబడి, రాష్ట్రాన్ని  కాపాడండి అన్ననాడే  నీవే రాష్ట్రమా? అన్న ప్రశ్న ఉద్భవించింది. రాష్ట్రంలో మోడీకి పోయేదేమీ లేదు బూడిద తప్ప! అధికారంపోతే కూడా ఆయనకయ్యెదేమీ లేదు?  పెళ్ళామా? పిల్లలా? నత్తింగ్!  


ఇందిరే ఇండియా అన్న డికె బారువా దెబ్బతో ఎన్నికల్లో ఇందిర ప్రభుత్వమే ధారుణంగా కుప్పగూలిపోయింది. అది మరువకూడదు. కాంగ్రెస్ తో టిడిపి కలిసి నడిస్తే ఉభయ నాశనం తప్ప మరేమీ కాదు!  అలాగే సుబ్రమణ్యస్వామి అన్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధి బ్రిటీష్ పౌరుడైతే - భారతీయుడైన మీరు దేశపాలన విదేశీయుని చేతిలో పెడతారా? అసలు రాష్ట్రాన్ని నిట్టనిలువున చీల్చిన కాంగ్రెస్ తో మీ వియ్యం ఏపి ప్రజ సహిస్తుందా?  ఆ శాంపిల్ స్ట్రోక్ తెలంగాణా జనం మొన్న ఎన్నికల్లో చూపింది కదా! 


చివరగా ఒక మాట 17 సీట్లున్న కేసీఆర్ ఎంతో 25 సీట్లున్న మీరూ అంతే! పెద్ద ఫరక్బడేది ఏమీ లేదు. మరో విషయం ఉత్తర ప్రదేశ్ లోని ఎస్పి-బిఎస్పి ఫెడరల్ ఫ్రంట్ లో చేరతాయట. డిల్లీలో వినికిడి. ఒడిసాలోని 21 సీట్లను చూసి మురిసిపోవద్దు - యూపిలోని 80 సీట్ల దెబ్బ బలంగా పడుతుంది. తస్మాత్ జాగ్రత్త!   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: