చంద్రబాబు గెలుపుకు "ఆ కులమే" అడ్డంకా..?
తెలంగాణ ఎన్నికల్లో ఏపీ సీఎం చక్రం తిప్పడం అనేక సంచలనాలకు దారి తీసింది. మహాకూటమి కోసం చంద్రబాబు చేసిన ప్రచారం.. ఆ కూటమి కంటే టీఆర్ఎస్ కే ఉపయోగపడింది. కూటమి సాకుతో చంద్రబాబు మళ్లీ తెలంగాణలో చక్రం తిప్పుతాడన్న భయంతో కేసీఆర్ వ్యతిరేకులు కూడా కారు గుర్తుకే ఓటేశారని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇప్పుడు ఏపీలోనూ సేమ్ సీన్ రిపీట్ అవుతుందా.. ఏపీ రాజకీయాల్లోనూ వేలు పెడతామని ఇప్పటికే గులాబీ దళపతులిద్దరూ తేల్చేశారు. మా పుట్టలో వేలు పెడితే కుట్టమా అని కేటీఆర్ ఎన్నికల సమయంలోనే వార్నింగ్ ఇచ్చేశాడు. రిటర్న్ గిఫ్ట్ తప్పకుండా ఉంటుందంటూ కేసీఆర్ కూడా నేరుగానే చెప్పేశాడు.
మరి ఇప్పుడు తెలంగాణ సీన్ ఏపీలోనూ రిపీట్ కావాలి కదా.. కేసీఆర్ వచ్చి ఇక్కడ వేలు పెట్టడమేంటన్న సెంటిమెంట్‌తో చంద్రబాబు వైపే జనం మొగ్గాలి కదా.. చంద్రబాబు కూడా ఏకపక్షంగా నెగ్గాలి కదా.. మరి అలా జరుగుతుందా.. అంటే అంత సీన్ లేదన్న టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ వేరు ఆంధ్రా సెంటిమెంట్ వేరు.
తెలంగాణలో ప్రాంతీయ సెంటిమెంట్ సులభంగా రాజుకుంటుంది. ఎందుకంటే అక్కడ కుల ప్రభావం తక్కువ. కానీ ఏపీ విషయానికి వస్తే ఇక్కడ కుల రాజకీయాలు కీలక పాత్ర పోషిస్తాయి. కేసీఆర్ ఏపీలో వేలు పెట్టాడు కదా అని ఏపీ జనం అంతా చంద్రబాబుకు జై కొట్టే పరిస్థితి లేదు. కులాల వారీగా విడిపోవడం కారణంగా కేసీఆర్ ఎఫెక్ట్ చంద్రబాబును గెలిపించే పరిస్థితి లేదు. అంటే ఏపీలో చంద్రబాబుకు గెలుపునకు కుల భావనే ప్రధాన అడ్డంకి అన్నమాట.