ఏపీలో ఆసక్తిరేపుతున్న బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు..!

KSK
ప్రస్తుతం ఏపీలో బీజేపీ పార్టీ పరిస్థితి చూస్తుంటే చాలా దయనీయంగా మారింది. 2014లో మోడీ హవా కొనసాగుతున్న క్రమంలో బిజెపి పార్టీని ఎంతగానో ఆదరించారు ఏపీ ప్రజలు. అయితే తీరా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీల విషయంలో మొండివైఖరి కనబరచడంతో ఏపీ ప్రజలు తీవ్ర అసహనంతో బిజెపి పార్టీ పై ఉన్నారు.


దీంతో చాలామంది బిజెపి పార్టీకి చెందిన నాయకులు ఎన్నికలు వస్తున్న క్రమంలో ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల బిజెపి పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ పరిణామంపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ.. కొందరు పార్టీని వీడినంత మాత్రాన తమ పార్టీ ఖాళీ కాలేదని నష్టం లేదని, తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.


ట్విస్ట్‌లు, యూటర్న్‌లకు టీడీపీ పెట్టింది పేరని, ఎన్నికలు వస్తున్నాయనే పెన్షన్లను పెంచారని విష్ణుకుమార్‌రాజు విమర్శించారు.ఇటీవల ఏపీలో బీజేపీ పరిస్థితి బాగోలేదని, ఒడిదుడుకులు ఎదుర్కొంటోందని విష్ణుకుమార్‌రాజు చెప్పిన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో కొందరు బీజేపీని వీడారని తెలిపారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని, ఏ పార్టీ నుంచి పోటీ చేసేది కోడ్ వచ్చాక చెప్తానన్నారు.


సార్వత్రిక ఎన్నికల ముందు రాష్ట్రంలో బీజేపీకి వలసల కష్టాలు ఎదురవుతున్నాయి. మరోపక్క కొంతమంది బిజెపికి చెందిన నాయకులు పార్టీ వీడే ఆలోచనలో ఉన్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వినబడుతున్నాయి. మొత్తం మీద రానున్న ఎన్నికల్లో ఏపీలో బీజేపీ పార్టీకే డిపాజిట్ కూడా దక్కే అవకాశాలు లేనట్లు కనిపిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: