ఎడిటోరియల్: వ్యవస్థలను ధారుణంగా పరిహాసం చేస్తున్న ప్రజానాయకుడు?

వైసిపి అధినేత జగన్మోహన్రెద్ది పై జరిగిన హత్యాయత్నం విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి తీరు అనుమానాస్పదంగా ఉందనే కామెంట్లు రాష్ట్రమంతా వినిపిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ కేసుపై జాతీయ విచారణ సంస్థ - ఎన్ఐఏ విచారణ మొదలైన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడిలో పెరుగుతున్న అసహనం ఆందోళన అంతా ఇంతా కాదు. అదంతా ఆయన ధైహిక భాషే (బాడీ లాంగ్వేజ్) చెపుతుంది. 

ఎన్ఐఏ విచారణను ఎలాగైనా ఆపాలనే తపనతో ఆయన చేసే ప్రయత్నాలు ఆయన పైకే అన్నీ వెళ్ళూ చూపించే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ విచారణను ఆపాలని అంటూ ప్రతి సమా వేశంలో కేంద్రాన్ని నిందించటమే కాదు చంద్రబాబు నాయుడి ప్రభుత్వం హైకోర్ట్ కోర్టు తలుపు కూడా తట్టింది. దీని విషయంలో అక్కడి పరిణామాలు చంద్రబాబుకు ఏమాత్రం అనుకూలంగా లేవు! కారణం హైకోర్ట్ ఆఙ్జ మేరకే కేంద్రం ఈ బాధ్యత ఎన్ఐఏ కి అప్పగించింది.

చంద్రబాబు కోరిక ప్రకారం ఎన్ఐఏ ఈ కేసు విచారణ విషయంలో  స్టే ఇచ్చేందుకు హై కోర్టు నిరాకరించింది. ఆ వెంటనే చంద్రబాబు నాయుడు ఢిల్లీకి పయనం కావడం అక్కడ ఎన్వి రమణ  ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకించి అమరావతి ప్రాంత నివాసి, అనేక సందర్భాల్లో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా, పేరున్న ప్రముఖ న్యాయమూర్తిగా ఆయన గమనార్హం.  అక్కడ వివిధ వ్యక్తులను చంద్రబాబు నాయుడు కలిశాడు. ఇదంతా చంద్రబాబు నాయుడి రాజకీయమే అని, ఎన్ఐఏ విచారణను ఆపించడానికే చంద్రబాబు నాయుడు ఢిల్లీ లో లాబీయింగ్ చేస్తున్నాడనే సమాచారం వినిపిస్తోంది.

ఎలాగైనా ఎన్ఐఏ విచారణ ఆగాలనేది చంద్రబాబు స్కెచ్. అందులో భాగంగానే ఆయన ఢిల్లీకి వెళ్లాడని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వైసిపి కూడా పదే పదే ఇదే మాటే చెబుతోంది. చంద్ర బాబు నాయుడు తీరును తీవ్రంగా తప్పుపడుతోంది.

అసలుకు జగన్మోహన రెడ్డిపై హత్యాయత్నం విషయంలో తెలుగుదేశం ప్రమేయం లేకపోయి ఉంటే, చంద్రబాబుకు ఇంత ఆందోళన ఎందుకు? బాబు అంతలా ఆందోళన చెందుతూ, అనేక సందర్భాల్లో అసహనం ప్రదర్శిస్తూ ఎలాగైనా తనకున్న మానేజ్మెంట్ ఎబిలిటీస్ అన్నీ ఏకీకృతం చేస్తూ – ఇలాంటి పరిస్థితుల్లో కూడా సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి  రంజన్ గొగోయిని కలవటం –కారణాలు ఏవైనా చెప్పుచ్చు - న్యాయమూర్తులను పలుమార్లు అనవసరంగా రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు కలవటం సబబని పించదు. వారిని కూడా తన మానేజ్మెంట్ ప్రక్రియలోకి లాగుతున్నాడేమో అన్న అనుమానం లేశమాత్రమైన ప్రజాస్వామ్యలో పొడచూపరాదు-ఇవన్నీఎన్ఐఏ విచారణను ఆపించాలనే ఆయన తపనను నిజం చేసు కోవటా నికేనా? అసలు రాష్ట్ర పాలనను ప్రక్కనబెట్టి, దావోస్ లో జరిగే సదస్సుకు సైతం నామంపెట్టి ఎన్ఐఏ విచారణ ఎందుకు నిలిపివేయించాలని అనుకుంటున్నాడు? ఇవన్నీ చూస్తుంటే గతంలో ఆయన విచారణ నిలుపుదల చేసిన కేసుల జాబితాలోకి ఇది చేరుతుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

న్యాయస్థానాలు సైతం ఇలా ఒక ముఖ్యమంత్రి లేదా ఒకే వ్యక్తి పనుపున దాదాపు ఇరవై కేసులలో న్యాయవిచారణ నిలుపుదల చేయటం లోని ఔచిత్యమేమిటి? ప్రజాస్వామ్యంలో న్యాయాన్ని ఆశించే ప్రతి పౌరుని మదిని తొలుస్తున్న ప్రశ్నలు.  ఇక ఈ కేసులో ఎన్ఐఏ ప్రాథమిక సమాచారంతో చార్జిషీట్ ను దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పనుపున రాష్ట్ర పోలీస్ యంత్రాంగం మొత్తం ఈ కేసులో ససేమిరా ఎన్ఐఏ విచారణకు సహకరించట్లేదనేది – ప్రజలందరికి తేట తెల్లమైంది.

ఎన్ఐఏ విచారణ సందర్భంగా శ్రీనివాసరావును ఏ-వన్ ముద్దాయిగా పేర్కొంది. ఈ కేసులో విచారణ కొనసాగుతూ ఉందని ఎన్ఐఏ ప్రకటించింది. మొత్తానికి చంద్రబాబు మాత్రం ఈ విచారణ విషయంలో చాలా తర్జన భర్జనలు పడుతూ ఉన్నాడని అమరావతి న్యూడిల్లీ సమాచారం.  నేఱ విచారణ, న్యాయ ప్రక్రియ రెండూ జరగటమే కాదు అవి సరైన మార్గంలోనే జరుగుతున్నాయ ని ప్రజావాహినికి అనిపించటం కూడా ముఖ్యం.

ఆ విషయంలో ముఖ్యంగా  బాధ్యాతాయుత పదవిలో ఉన్న చంద్రబాబు నాయుడు, ఆయనతో డీల్ చేసే మిగిలిన సమాజం గుర్తించటం ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరం.  కేంద్రాన్ని ప్రతి దానికి నిందించే గురివింద చంద్రబాబు తనకింద ఉన్న కారు నలుపు తెలుసుకోవటం చాలా అవసరం.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: