“దమ్ముంటే నా ముందుకు వచ్చి మాట్లాడు” అంటున్న అసెంబ్లీ స్పీకర్

"ఎన్నికల్లో గెలిచేందుకు తాను ₹11.5 కోట్లు ఖర్చు పెట్టాను

”ఆడది వంటింట్లో ఉండాలి… కారు షెడ్లో ఉండాలి” వంటి ఫ్యూడలిస్టిక్ వ్యాఖ్యలు ఈ ఆధునిక కాలంలో చేయడం, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సభాపతి అయి ఉండి కూడా నేరుగా:

*అధికార టీడీపీ రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటూ,
*ఇతర పార్టీల నేతలకు టీడీపీ కండువా కప్పడం వంటి చర్యలతో విమర్శలు ఎదుర్కొంటున్న కోడెల శివప్రసాదరావు తాజాగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి పట్ల చేసిన ఆయన స్థాయికి తగని వ్యాఖ్యలు మొత్తం ఉభయ తెలుగురాష్ట్రాల్లోని రాజకీయవర్గాల్లో  దుమారం రేపుతున్నాయి. ఆయన తీరు తీవ్ర  చర్చనీయాంశమైంది.

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగించిన కోడెల శివప్రసాదరావు, 40 ఏళ్లుగా రాజకీయాల్లో నిప్పులా బతికానని ఆయనకు ఆయనే చెప్పుకున్నారు. ఒక్క అవినీతి పని కూడా చేయలేదని కూడా అన్నారు. ఈ తెలుగు దేశం వాళ్ళు ఒక్కరేనా నాలుగు దశాభ్దాలు అధికారంలో ఉండి నిప్పులా బ్రతికింది? నిప్పులా బ్రతకటం త్యాగం స్థాయికి చేర్చారు వీళ్ళు వీళ్ళ నోరు అతి తరచుగా జారటం ద్వారా!  

అంత గొప్ప నీతి నిజాయతీ పరుడైన తనపై ఒక దుర్మార్గుడు వచ్చి రాజకీయ పార్టీ పెట్టి ప్రతి చిన్నపనికి కోడెల శివప్రసాదరావు లంచం తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నాడని మండి పడ్డారు. 16 నెలలు జైల్లో ఉన్న జగన్‌మోహనరెడ్దికి చంద్రబాబు లాంటి వ్యక్తిని విమర్శించే ధైర్యం ఎలా వచ్చిందని బెదిరింపు ధోరణిలో సభాపతి సభ వెలుపల  మాట్లాడారు.


వైసీపీ వాళ్లకు దమ్ముంటే తన ముందుకు వచ్చి మాట్లాడాలని స్పీకర్ సవాల్ చేశారు. లేదంటే తానే జగన్‌మోహనరెడ్ది రమ్మన్న చోటికి వెళ్లేందుకు కూడా సిద్ధమన్నారు. ఒక సాదా సీదా  రౌడీ ఇజం గూండా ఇజం చేసే రాజకీయ నాయకుడులాగా ఒక రాష్ట్ర సభాపతి మాట్లాడటం ఆ పదవిలో ఉన్న వ్యక్తికి గాని, ఆ రాజ్యాంగ పదవికి గాని శోభించదు.

చంద్రబాబుకు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు కోడెల. చంద్రబాబు లేకుంటే అమరావతితో పాటు రాష్ట్రంలో మరుగుదొడ్లు కూడా వచ్చేవి కావన్నారు. స్పీకర్‌ అయి ఉండి ఇలా ప్రతిపక్షంపై సవాళ్లు విసరడం ముఖ్యంగా ఉభయ తెలుగురాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. ఈ తీరు ప్రతిష్టాత్మక రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికిగాని, ఆ ఆ పదవికిగాని కూడా సిగ్గుచేటని అంటున్నారు. ముఖ్యమంత్రి మెప్పు పొందటానికి ఇప్పటికే శాసనసభను ఏకధృవ నిరంకుశ నిర్వహణస్థాయికి దిగజార్చారని ఆయనకు గొప్ప పేరుంది. 

సాక్షాత్తు అసెంబ్లీ స్పీకర్ కోడలు, మీడియా ముందుకొచ్చి కన్నీళ్లు పెట్టుకుంటుంది నాకు న్యాయం చేయండి మహాప్రభో అని. కానీ కేసు బుక్ చేసుకొనే నాథుడెక్కడా!  కార్లు షెడ్లో ఉండాలి, ఆడోళ్ళు వంటింట్లో ఉండాలి అని మీడియాలో మాట్లాడిన అని స్పీకర్ గారేమో మహిళా సాధికారత అంటూ గొప్పగా స్పీచ్ ఇస్తుంటారు అమరావతిలో. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: