అమరావతిలో రెండు నెలలకే కూలుతున్న హైకోర్టు భవనాల స్లాబులు?

పువ్వు పుట్టగనే పరిమళిస్తుందని అంటారు పెద్దలు. ప్రపంచంలోనే అత్యంత ఉత్తమ రాజధానిని నిర్మిస్తామంటూ ఊదరగొట్టే ఉపన్యాసాలతో ఏపీ ప్రభుత్వం గతంలో అమరావతిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణంలో అత్యంత దయనీయకరంగా అభాసుపాలైన సంగతి తెలిసిందే. నాసిరకం వస్తువాడకం, నాసిరకం నిర్మాణ పనుల కారణంగా,  కొద్దిపాటి వర్షానికే ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహన రెడ్డి ఛాంబర్‌తో పాటు, మంత్రుల కార్యాలయాల్లోకి వర్షపునీరు వరదలా  చేరడం తెలిసిందే.

గత చిత్రం 

తాజాగా రాజధానిలోని నేలపాడులో తాత్కాలిక హైకోర్టు భవనం నిర్మాణంలోనూ అదే రకమైన డొల్లతనం బయటపడింది. జనరేటర్‌కు సంబంధించి నిర్మాణంలో ఉన్న ఆరు గదుల్లో రెండు గదుల స్లాబ్‌ కూలింది. ఈ సంఘటనలో నలుగురు కార్మికులు గాయపడ్డారు. వీరిని తాడేపల్లి సమీపంలోని ఎన్‌ఆర్ఐకి ఆస్పత్రి కి తరలించారు.

గత చిత్రం 

శుక్రవారం ఉదయం పనులు చేస్తుండగా గోడ కూలినట్లు కార్మికులు తెలిపారు. కార్మికులంతా జార్ఖండ్‌ కు చెందినవారు.  అయితే ఈ సంఘటనను మీడియా ప్రతినిధులు చిత్రీకరించేందుకు వెళ్లగా, వారిని అక్కడ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు.

నేటి చిత్రం 

కొద్దికాలం క్రితమే ఆంధ్రప్రదేశ్ లో తాత్కాలిక హైకోర్టు భవనాన్ని ముఖ్యమంత్రి, రాష్ట్ర న్యాయమూర్తుల సమక్షంలో, ప్రారంభింపజేసిన విషయం తెలిసిందే. కాగా, భవనం ప్రారంభించి, కేవలం రెండు నెలలు కాకముందే దాని పరిస్థితి అత్యంత అద్వాన్నంగా మారింది. 

నేటి చిత్రం 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: