రాఫెల్ భారత్ పాలిటి "బ్రహ్మాస్త్రమే"

రాఫెల్ విషయంలో స్వార్థ ప్రయోజనాలను నెఱవేర్చుకోవటం కోసం చేస్తున్న రాగ్ధాంతం వల్ల దేశం ఇబ్బందులు పడుతోందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ విషయంలో తనకు ఏ మాత్రం వేరే ఆలోచన లేదన్నారు. రాఫెల్ యుద్ధ విమానాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ. ఇటీవలే పుల్వామా దాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో దాడులు చేసిన భారత సైన్యం వద్ద రాఫెల్ ఫైటర్ జెట్స్ ఉండి ఉంటే, పరిస్థితి మరోలా ఉండేదన్నారు మోదీ. ఆ సమయంలో మన దగ్గర రాఫెల్-జెట్స్ లేకపోవడం వల్ల దేశం మొత్తం బాధ పడిందన్నారు. 

ఇప్పుడు దేశమంతా రాఫెల్-జెట్స్ గురించే మాట్లాడుకుంటుందని అన్నారు. మన దగ్గర రాఫెల్ ఉండి ఉంటే, పాక్ భూభాగంలో జరిగిన దాడులఫలితం మరోలా శక్తివంతం గా ఉండేదని అన్నారు నరేంద్ర మోదీ. ఒక మీడియా ఈవెంట్‌ లో మాట్లాడుతూ ఆయన రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంలో భారీ కుంభకోణం జరిగిందన్న కాంగ్రెస్ ఆరోపణలను ప్రస్తావిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. 

కేవలం నరేంద్ర మోదీని వ్యతిరేకించాలని మాత్రమే అనుకుంటే పర్వాలేదు కానీ, దాని వల్ల ఉత్పన్నమయ్యే వికృత పరిణామాలతో "మసూద్ అజర్ లాంటి ఉగ్రవాదులు మరింత బలపడుతున్నారు" అని అన్నారు. రాఫెల్ విషయంలో రాజకీయ స్వార్థ ప్రయోజనాల సాధన కోసం చేస్తున్న రాద్దాంతం వల్ల దేశం ఇక్కట్లు ఇబ్బందులకు గురౌతుందని అనారు ప్రధాని. ప్రతి పక్షాల స్వార్థ పూరిత ప్రయోజనం దేశానికి తీవ్రమైన చేటు చేస్తుందని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. 

రానున్న రోజుల్లో రాఫెల్ భారత సైన్యం చేతుల్లోకి రానుంది. ఇప్పటివరకు పాక్ ఫైటర్ జెట్స్‌ను ఎదుర్కోవాలంటే, భారత్ కు రెండు సుఖోయ్-30ంఖీ విమానాలు అవసరం. ఎందుకంటే పాక్ ఫైటర్ జెట్‌ లో ఉన్న ఆయుధాల ప్యాకేజీ సుఖోయ్ కంటే ఉత్తమమైనవి. అయితే రాఫెల్ రాకతో ఇప్పటివరకు ఉన్న ఈ కొరత తీరపోనుంది. ఇక పాక్ యుద్ధవిమానాలు ఎదుర్కోవడం రాఫెల్‌ ఫైటర్-జెట్‌ లతో చాలా సులభం. రాఫెల్-జెట్స్‌ ను ఎదుర్కొవాలంటే ఇక పాకిస్థాన్ రెండు ఎఫ్-16 ఫైటర్-జెట్ లను వినియోగించ వలసి వస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: