అసలైన టీడీపీ రాజీనామాలు 'అప్పుడే' మొదలవుతాయి ..!

Prathap Kaluva

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార పార్టీ నుంచి వలసలు జోరందుకోవడంతో టీడీపీలో అలజడి మొదలైంది. ఇప్పటికే పార్టీ అధినేత బుజ్జగించిన ఎవరు లెక్క చేయడం లేదు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు పార్టీ మరి జగన్ సమక్షం లో చేరిన సంగతి తెలిసిందే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయంలో గత ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు ఎన్నికుట్రలు పన్నినా.. ఎన్ని వ్యూహాలను రచించి అమల్లో పెట్టినా.. ఎన్నికల సమయానికి తెలుగుదేశం పార్టీ నుంచినే నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ లోకి వలసలు సాగిస్తూ ఉండటం గమనించాల్సిన  విషయం.


బాబు చేతిలో పవర్ ఉంది, మీడియా ఉంది, ఐదేళ్ల పాలనతో సంపాదించిన అర్థబలం ఉంది.. అయినా.. ఇవేవీ ఇప్పుడు జగన్ వద్ద కనిపించకపోయినా.. ఆయన పార్టీలోకే తెలుగుదేశం నుంచి వలసలు సాగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకూ వెళ్లిన వారు మాత్రమే కాదు.. మరి కొంతమంది కూడా ఇప్పుడు ఆ ప్రయత్నంలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. టికెట్ల విషయంలో చంద్రబాబు నాయుడు అధికారిక ప్రకటనలు చేస్తే అసలు కథ మొదలవుతుందని సమాచారం అందుతోంది.


టికెట్ల విషయంలో చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకూ ఏమీ తేల్చడంలేదు. దాదాపుగా నాన్చుడు ధోరణిని సాగిస్తూ ఉన్నారు. అభ్యర్థుల విషయంలో లీకులు మాత్రమే ఉన్నాయి. అధికారిక ప్రకటనలు ఏమీలేవు. ఈ నేఫథ్యంలో కొందరు నేతలు ప్రస్తుతానికి గుంభనంగా ఉన్నారు. ఇప్పటికే అలాంటి వాళ్లు తమ అనుచవర్గాలతో సంప్రదింపులు అయితే జరుపుతూ ఉన్నారు. మరో వారంరోజులు వేచిచూసే ధోరణిలో కొంతమంది కనిపిస్తూ ఉన్నారు. టికెట్లు ఇస్తామని చెబుతున్నా.. కొంతమంది నేతలు ఇప్పటికే తెలుగుదేశాన్ని వీడారు. ఇక అసలు కథ టికెట్లు ఖరారు అయ్యాకా మొదలు కానుందని పరిశీలకులు అంటున్నారు. చాలా నియోజకవర్గాల్లో ఇలాంటి పరిణామాలు ఉండబోతున్నాయని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: