చంద్రబాబు కి గట్టి దెబ్బ - వైకాపా లోకి జయసుధ !!

KSK

ఐటీ గ్రిడ్ అంశం ఒక పక్క రెండు తెలుగు రాష్ట్రాల్లో గుబులు పుట్టిస్తూ ఉంటె మరొక పక్క వైకాపా లో సరికొత్త లీడర్ వచ్చి జాయిన్ అయ్యారు. వై ఎస్సార్ కి అత్యంత సన్నిహిత వ్యక్తి గా , మంచి నాయకురాలి గా గుర్తింపు ఉన్న జయసుధ ప్రస్తుతం వైకాపా లో జాయిన్ అయ్యారు. ఆమె ఆంధ్ర ప్రదేశ్ లో ఏదైనా ప్రాంతం నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.


వైకాపా పార్టీ లోకి ఎన్నికల టైం లో చేరికలు ఊపు అందుకున్నాయి. కీలక నేతలు అందరినీ జగన్ తనదైన శైలి లో తనవైపు తిప్పుకోవడం లో సక్సెస్ అవుతున్నారు. ఇప్పటికే నాగార్జున, సుమంత్, మంచు విష్ణు, మోహన్ బాబు, తదితరులు జగన్‌కి టచ్‌లో ఉండగా.. కమెడియన్ పృథ్వీ వైసీపీ కండువా కప్పుకుని కీలకపదవిని రాబట్టారు. 

మరొక పక్క నుంచి పార్టీ కి అండగా - సపోర్ట్ గా పోసాని, భాను చందర్, విజయ్ చందర్‌, చోటా కె నాయుడు తదితరులు వైసీపీ పార్టీకి మద్దతు ఎప్పుడో ప్రకటించారు. ఇప్పుడు అట్టహాసం గా జయసుధ కూడా రావడం వైకాపా కి బలం అంటున్నారు విశ్లేషకులు . 2009 ఎన్నికల్లో ఆమె సికిందరాబాద్ లో పోటీ చేసి ఎమ్మెల్యే గా గెలుపొందారు.

రాష్ట్ర విభజన నేపధ్యం లో అదే ప్రాంతం లో జయసుధ ఓడిపోయారు గత ఎన్నికల్లో.అనంతరం 2016లో టీడీపీ పార్టీలో చేరారు. అయితే జయసుధ టీడీపీలో ఉన్నప్పటికీ క్రియాశీలకంగా వ్యవహరించలేదు. జయసుధ ని టీడీపీ లో ఉంచడం కోసం చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేసారు అనీ ఆమె ససేమిరా అన్నట్టు తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: