రంగం లోకి దిగిన కేంద్ర ఎన్నికల సంఘం - 45000 మంది సిబ్బంది ఒకేసారి ..

KSK

ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణా రాష్ట్రాల్లో జరుగుతున్న ఐటీ గ్రిడ్ అంశం మీద కేంద్ర ఎన్నికల సంఘం - రాష్ట్ర ఎన్నికల సంఘాలతో కలిసి కసరత్తు మొదలు పెట్టింది. ఏపీ లో ఫాం 7 ఎవరి నుంచి వచ్చాయి .. అందులో ఎన్ని గందరగోళ ఫేక్ ఫాం లు ఉన్నాయి అనేవి చూడడం కోసం ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది.



ఫాం 7 యొక్క దుర్వినియోగం గురించి డిస్కషన్ లు మొదలు అయ్యాయి. లక్షలాది ఫాం 7 లు ఫేక్ వి అని తేలింది . దాదాపు లక్షా అరవై వేల దరఖాస్తుల స్క్రూటినీ జరుగుతోంది. నలభై వేల మండి సిబ్బంది తో క్షుణ్ణంగా పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు ఐదువేల దరఖాస్తులు మాత్రమే నిజవైనవి అనీ మిగితావి భోగస్ అని చెబుతున్నారు.


కేంద్ర ఎన్నికల సంఘం పనిగట్టుకుని ఈ విషయం లో రంగం లోకి దిగడం ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిన అంశం. ఈ దేశం లో ఇప్పటివరకూ సేఫ్ గా ఉన్న ఓటు కి కూడా అన్యాయం జరుగుతోంది అనిపిస్తోన్న తరుణం లో కేంద్ర ఎన్నికల సంఘం మంచి నిర్ణయం తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: