చంద్రబాబు తన రాజకీయం కోసం.. హైదరాబాద్లోని ఆంధ్రుల భవిష్యత్ పణంగా పెడుతున్నారా..?

Chakravarthi Kalyan

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి దాదాపు 5 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ ఐదేళ్లలో హైదరాబాద్ లో ఆంధ్రులు దాదాపు ప్రశాంతంగానే బతుకుతున్నారు. ఎక్కడా ఒక్క చిన్న సంఘటన కూడా సామాన్య ఆంధ్రులను ఇబ్బందులుకు గురి చేసిన దాఖలాలు కనిపించలేదు.

 



రాష్ట్రం విడిపోక ముందు.. తెలంగాణ వస్తే ఏమవుతుందో అని భయపడిన ఆంధ్రులు కూడా ఇప్పుడు హైదరాబాద్ లో చీకూచింతా లేకుండా ఉంటున్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు పదే పదే తెలంగాణ సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నారు. హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రులను కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని విమర్శిస్తున్నారు.



హైదరాబాద్ లోని పారిశ్రామిక వేత్తలను కేసీఆర్ బెదిరించి వైసీపీలో చేరుస్తున్నారంటున్నారు. తాజాగా శివాజీ కూడా అదే పాట పాడుతున్నారు. చంద్రబాబు అండ్ కో పదే పదే ఈ విమర్శలు చేయడం వల్ల హైదరాబాద్‌లోనే స్థిరపడిపోయిన ఆంధ్రులు ఇప్పుడు భయాందోళనలకు గురవుతున్న పరిస్థితి.



హాయిగా ఉన్న సమయంలో చంద్రబాబు పదే పదే చేస్తున్న విమర్శల వల్ల.. నిజంగానే తెలంగాణ సర్కారు.. తెలంగాణ పౌరులు తమను ఇబ్బంది పెడితే పరిస్థితి ఏంటన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. పోనీ అందుకు ఏమైనా ఆధారాలు చూపెడతారా అంటే అదీ లేదు. ఇకనైనా చంద్రబాబు ఇలాంటి కామెంట్లు చేయకుండా ఏపీ రాజకీయాలు చూసుకోవాలని హైదరాబాద్ లో స్థిరపడిన ఆంధ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: