లోకెష్ కోసం మంగళగిరిలో బలహీన అభ్యర్ధిని నిలిపితే పవన్ కళ్యాన్ చరిత్ర హీనుడుగా మిగలటం గ్యారంటీ

ఎవరెన్ని చెప్పినా జనసేన మనస్పూర్తిగా బరిలో నిలిస్తే ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల్లో ట్రయాంగులర్ ఫైట్ తపదు. ఇక్కడ సీత్లు ఎన్నివస్తాయి అనేది ప్రశ్న కానే కాదు. ప్రత్యర్ధుల ఓటమికి చాలా స్థానాల్లో జనసేన కారణం కావచ్చు. అయితే జనసేన నాయకుడు పవన్ కళ్యాన్ మానసిక సంసిద్ధత ప్రధాన్యత సంతరించుకోనుంది. మొత్తం మీద శాసనసభ ఎన్నికలకు ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో జనసేన సిద్ధమైంది.  ఇప్పటికే పొత్త చర్చలు ముగించి సీట్ల కేటాయింపును కూడా జనసేనాని పవన్ కళ్యాన్ పూర్తి చేశారు. ఈ ఎన్నికల్లో మాయావతి నాయకత్వంలోని బహు జన సమాజ్ పార్టీ ( బీఎస్పి) మరియు ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో జనసేన పొత్తు పెట్టుకుంది. 

బీఎస్పీకి 21 అసెంబ్లీ 3 పార్లమెంట్ స్థానాలను కేటాయించింది. 
సీపీఐ, సీపీఎంలకు 7 అసెంబ్లీ సీట్లు 2 ఎంపీ సీట్లను జనసేన కేటాయించింది. 

షాకింగ్ ఏమంటే: సీఎం చంద్రబాబు కుమారుడు మంత్రి నారా లోకేష్ తన జీవితంలో తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతూ మంగళగిరి నుంచి పోటీచేస్తున్నారు. ఆ సీటులో జనసేన పోటీ చేయక పోవడంపై అందరిలోనూ అనుమానాలు బలపడుతున్నాయి. మంగళగిరి శాసనసభ స్థానాన్ని అక్కడ ఏమాత్రం స్థానబలం లేని సీపీఐకి జనసేన కేటాయించినప్పుడే దీనివెనుక నిజాయతీ లేని రాజకీయ కుట్ర పూరిత వ్యూహం ఏదైనా  దాగి ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. 


ముఖ్యంగా జనసేన వ్యతిరేఖ పక్షాలైన వైసీపీ దాని మద్దతు దారులు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడుతో రహస్య ఒప్పందం చేసుకొని ఇలా సీట్ల కేటా యింపులు చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. అందుకే వ్యూహాత్మకంగా లోకేష్ సహా బలమైన టీడీపీ నేతలున్నచోట జనసేన బరిలోకి దిగడం లేదని ఆడిపోసుకుంటున్నారు.  ఒకవేళ జనసేన తన పార్టీ అభ్యర్ధిని మంగళగిరి లో ఎన్నికల బరిలో నిలపక పోతే జనసేన పార్టీని జనం ఖచ్చితంగా పిల్ల  తెలుగుదేశం పార్టీ అంటారనేది 100% జరగి ఆతరవాత పవన్ కళ్యాన్ జనసేన చరిత్ర హీనులు అయ్యేది తధ్యం అంటున్నారు జనం.  
Jana Sena Party Office Removed In Mangalagiri ?

మంగళగిరిలో లోకేష్ పై పోటీపడకపోవడానికి జనసేనాని పవన్ దగ్గర సమాధానం లేదు. పొత్తులోభాగంగా కేటాయించామని మాత్రమే చెబుతున్నారు. మంగళగిరిలో ఎలాగూ సీపీఐ గెలవదని బలం లేదని తెలుసు. అయినా ఆ సీటును  సీపీఐకి జనసేన ఎందుకు ఇచ్చిందన్న ప్రశ్న ప్రజల్లో ఉదయిస్తోంది.


2009 ఎన్నికల్లో  చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం మంగళగిరిలో రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ కాపు ఓటు బ్యాంకు గణనీయమైంది. జనసేన పోటీ చేస్తే ప్రత్యర్థుల ఓట్లను చీల్చి ఓడించే సత్తా ఉంటుంది.  కానీ అక్కడ బలంగా ఉన్న వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఓడించేందుకే జనసేన బలమైన క్యాండిడేట్ ను బరిలో నిలుపలేదు అనే చర్చ వినిపిస్తోంది. 

అంతిమంగా లోకేష్ ను గెలిపించటం కోసమేనని ఇలా పవన్ చేశారని జనం అర్ధం చేసుకుంటున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే వైసీపీ ఆరోపణలకు బలం చేకూరు తోంది. టీడీపీ-జనసేన మ్యాచ్ ఫిక్సింగ్ నిజమేనా?  అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితే ఇంకా చాల చోట్ల జరగనుందని అంటున్నారు. 


అసలు ఇలా అక్రమ పొత్తు కంటే బహిరంగంగానే టిడిపి – జనసేన పొత్తు ఏర్పాటు చేసుకుంటే రాజకీయంగానైనా పవన్ కళ్యాన్ కు గౌరవం మిగులుతుంది. లేకపోతే పవన్ నిజస్వరూపం ఇదేనా? అని సినీ రంగంలోని అభిమానులు సైతం అనుకునే ఆస్కారం ఉంది. అదే జరిగితే పవన్ కళ్యాన్ రెండిటికి చెడ్డ రేవడి అయ్యేది తధ్యం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: