పవన్ ను ఓడిస్తే వైసీపీ అభ్యర్ధికి మంత్రిపదవి ... ఆస్తులు అమ్మైనా సరే పవన్ ను ఓడిస్తా ..!

Prathap Kaluva

పవన్ కళ్యాణ్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న సంగతి తెల్సిందే. ఒకటి భీమవరం కాగా రెండోది గాజువాక . రెండు నియోజక వర్గాల్లో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. 2009 ఎన్నికల్లో మెగాస్టార్‌ కూడా ఇంతే రెండు నియోజకవర్గాల్లో పోటీ చేశారు. అందులో ఒకటి పాలకొల్లు రెండోది తిరుపతి. అయితే అనూహ్యంగా పాలకొల్లులో ఓడిపోయారు చిరంజీవి. ఇది మెగాస్టార్‌ కెరీర్‌లోనే మాయని మచ్చగా మిగిలిపోయింది. సొంత ఊరు జనాల చేతే చిరంజీవి చీ కొట్టించుకున్నారని అప్పట్లో కామెంట్స్‌ కూడా విన్పించాయి.పదేళ్ల తర్వాత ఎన్నికలు.


అప్పుడు మెగాస్టార్‌లా ఇప్పుడు పవన్‌ గాజువాక, భీమవరం నుంచి పోటీ చేస్తున్నారు. అయితే.. అప్పటి  ఫలితాల్ని రిపీట్‌ చెయ్యాలని అనుకుంటున్న జగన్‌.. భీమవరంలో వైసీపీ అభ్యర్థికి గ్రంథి శ్రీనీవాస్‌కు ఓ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చాడట. భీమవరంలో పవన్‌కల్యాణ్‌ని ఓడిస్తే.. తొలిదశ కేబినేట్‌లో కీలక మంత్రిపదవి ఇస్తానని హామీ ఇచ్చాడట. దీనిద్వారా తనని విమర్శిస్తున్న పవన్‌కల్యాణ్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టాలనేది జగన్‌ ప్లాన్‌. జగన్ బంపర్‌ ఆఫర్‌తో గ్రంధి శ్రీనివాస్‌ భీమవరంలో ప్రచారం కూడా మొదలుపెట్టేశాడు. ఎలాగైనా సరే పవన్‌ని ఓడించి మంత్రి  అవ్వాలని ఆశపడుతున్నాడు. అవసమైతే.. ఆస్తులు అమ్మి అయినా ఓడించాలని ప్లాన్ చేస్తున్నాడు. 


 రాజకీయ చైతన్యం మెండుగా ఉన్న భీమవరం జనాల్ని  తనవైపునకు తిప్పుకోలగలిగితే.. పవన్‌ని ఓడించడం పెద్ద కష్టమేమి కాదని అనుకుంటున్నాడు గ్రంథి శ్రీనివాస్‌. అయితే.. గ్రంథి శ్రీనివాస్‌ ఇందుకోసం చాలా కష్టపడాలి. కాపు ఓట్లు ఎక్కువుగా ఉన్న భీమవరంలో పవన్‌ని ఓడించడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అయితే గతంలో మెగాస్టార్‌ పోటీ చేసిన పాలకొల్లులో కూడా కాపు ఓట్లు ఎక్కువే. అయినా అక్కడ సాద్యమైంది ఇక్కడ ఎందుకు సాధ్యంకాదు అనే ఉద్దేశంతో ఇప్పుడు పవన్‌కల్యాణ్‌ లాంటి మాస్ ఇమేజ్‌ ఉన్న కొండను ఢీకొట్టేందుకు సిద్ధమవుతున్నాడు భీమవరం వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్‌. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: