నమ్మినవారే చంపేశారా?

KSK
మరికొద్ది రోజుల్లో ఎన్నికలు ఉందనగా వైయస్ వివేకానంద రెడ్డి హత్య చేయబడడం ఆంధ్ర రాజకీయాలలో పెను సంచలనం సృష్టించాయి. వైయస్ హత్య కేసు విషయంలో అధికార పార్టీ టీడీపీ మరియు ప్రతిపక్ష పార్టీ వైసిపి ఒకరిపై ఒకరు చాలా దారుణంగా విమర్శలు చేసుకుంటున్నారు.


ఈ క్రమంలో ఈ హత్యకేసును రాష్ట్ర ప్రభుత్వ విచారణ సంస్థ సిట్ విచారిస్తున్న క్రమంలో వైయస్ వివేకానంద రెడ్డి ప్రధాన అనుచరులే హతమార్చినట్లు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ ప్రధాన అనుచరులైన పరమేశ్వర్‌ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి సూత్రధారులు కాగా, చంద్రశేఖర్‌ రెడ్డి అతని గ్యాంగ్‌ ఈ హత్యకు పాల్పడినట్టు సిట్ తేల్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.


ఆస్తి వివాదాల కారణంగా ఆయన నమ్మిన అనుచరులే చంపేశారన్న అంశాన్ని సిట్ దర్యాఫ్తు అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ హత్య కేసులో కొంత మంది అనుమానితులను మరియు ఓ స్కార్పియో వాహనాన్ని సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


ఈ కేసు విషయమై ప్రత్యేక బృందం కేసుకు సంబంధించి 40 మందిని ఇప్పటికే ప్రశ్నించారు. అయితే తాజాగా ప్రధాన అనుచరులు అయినా ముగ్గురిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకోవడంతో...వైయస్ వివేకానంద రెడ్డి ని నమ్మిన వారే గొంతు కోశార అన్న కామెంట్లు వినబడుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: