పాకిస్థాన్‌కు చైనా అంతులేని ఆర్థిక సాయం - చైనా వస్తు బహిష్కరణే దీనికి సమాధానం

మతవాదం శత్రుత్వం రెండూ పాకిస్తాన్ ను రక్షిస్తూ వస్తున్నాయి. సౌదీ అరేబియా లాంటి ముస్లిం దేశాలు మతమే ప్రధానంగా పాకిస్తాన్ ఎన్ని కిరాతకాలు ప్రదర్శించినా దాని పక్షమే వహిస్తున్నాయి. పైకి పదుగురిలో మనపట్ల స్నేహం ప్రదర్శిస్తూనే "వడ్డించేవాడు మనవాడైతే ఎన్నడున్నా మన లడ్డూలకు బంగం లేదు" అన్నట్లు పాకిస్తాన్ కు అందించాల్సిన ఆర్ధిక రాజకీయ సహకారం అందించటం చూస్తూనే ఉన్నాం. 

ఇక పోతే శత్రువు శత్రువు మిత్రుడన్నట్లు చైనా కు మనపై ఉన్న రాజకీయ ద్వేషం బ్రహ్మపుత్ర జలాల్లా పాక్ కు ఆర్ధిక రాజకీయ సామాజిక సహకారం అందజేయటంలో నిస్సిగ్గుగా ప్రవర్తిస్తూనే ఉంది. అంతర్జాతీయ వేదికలపై నుండి బహిరంగంగానే ఉగ్రవాద మూకలను కాపాడటంలో చైనా పాకిస్తాన్ కు కావలసినంత చేయగలిగినంత సహకారం చేస్తూనే ఉంది.  

ప్రస్తుతం ఆర్థిక లోటుతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌కు చైనా అండగా నిలుస్తోంది. దాదాపు 2 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లను అప్పు గా ఇచ్చేందుకు చైనా ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు పాకిస్థాన్‌ కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. మన శత్రు దేశమైన పాకిస్థాన్‌ చేస్తున్న వికృత ఉగ్రవాద చర్యలను చూస్తూనే, ఆ దేశానికి చైనా దన్నుగా నిలవడం గమనార్హం. చైనా నుంచి నిధులు పొందడానికి అవసరమైన అన్ని చర్యలు పూర్తయ్యాయని వచ్చే సోమవారం పాకిస్థాన్‌ ప్రభుత్వ ఖాజానాలో నిధులు జమ అవనున్నాయని పాకిస్థాన్‌ అధికార పత్రిక డాన్‌ వెల్లడించింది. 

ఇదే పాకిస్థాన్‌కు సౌదీ అరేబియా, యూఏఈ కలిపి 2 బిలియన్‌ డాలర్ల ఆర్థిక సహాయం అందించాయి. గతంలో పాక్‌కు 6 బిలియన్‌ డాలర్ల ఆర్థిక సహాయం చేస్తామని చెప్పిన సౌదీ అరేబియా ఇప్పటికే 3బిలియన్‌ డాలర్లు సమకూర్చింది. మిగిలిన నిధులను సౌదీ నుంచి పాక్‌ దిగుమతి చేసుకునే క్రూడ్‌ ఆయిల్‌ లో రాయితీలుగా ఇస్తామని ప్రకటించింది. 2018నవంబర్‌ లో చైనా రాజధాని బీజింగ్‌ లో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌తో సమావేశమైన చైనా ప్రీమియర్‌ - లీ కెఖియాంగ్‌ ప్రతినిధులు తాజా నిధుల సమీకరణ కోసం ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. 

పాక్‌ ను ఆర్థికంగా నిలబెట్టేందుకు నిధులివ్వడమే కాకుండా ఆ దేశంలో పెద్దయెత్తున చైనా పెట్టుబడులు పెట్టి, పారిశ్రామిక కారిడార్లను ఏర్పాటు చేయనుందని చైనా కాన్సుల్‌ జనరల్‌ లాంగ్‌ డింగ్‌ బిన్‌ ప్రకటించారు. పాకిస్థాన్‌ను కాపాడేందుకు చైనా సహా ఇస్లామిక్‌ దేశాలన్నీ అండగా నిలుస్తున్నాయి. కాని ఉగ్రవాదులకు ఆశ్రయ మిస్తున్న పాక్‌ విధానాన్ని మాత్రం ఈ దేశాలు తప్పు పట్టక పోవడం గమనార్హం. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: