ఎడిటోరియల్: చంద్రబాబు స్వార్ధం వలన రాష్ట్రానికి నష్టం లక్షకోట్ల రూపాయిలు కోల్పోయిన పరువు అదనం

ఓటుకు నోటు ద్వారా ఏపి ప్రజల వచ్చిన నష్టం ఆయనే అన్నట్లు అక్షరాల  లక్ష కోట్లు పరువు ప్రతిష్ఠల పోకడ అదనం అన్నమాట. చంద్ర బాబెంత సమర్ధుడు?  నాలుగు దశాబ్ధాల అనుభవమున్న చంద్రబాబు నాయుణ్ణి ఏపి ప్రజలు ఎన్నుకొని అధికారం ఇచ్చారు. కొత్తరాష్ట్రానికి అనుభవమున్న నేత అవసరాన్ని ఆ ప్రజలు గుర్తించిన పర్యవ సానమే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరవాత తన పుత్రరత్నాన్ని ఏపి ప్రజల నడినెత్తిపై పెట్టి వచ్చీ రాని మాటల అఙ్జానితో తైతెక్కలాడిస్తున్నారు. కనకపు సింహాసనమున ....అన్నట్లు కాలం జరిగిపోతుంది. 
 
అయితే ఆయన లీలామృతములో కొద్ది రోజుల క్రితం ఒక సంచలన విషయం చెప్పారు. తెలంగాణ నుంచి లక్ష కోట్ల రూపాయలు రావాల్సి ఉందని ప్రకటించారు. గతంలో కేంద్రం నుంచి కూడా ఇలాగే లక్ష కోట్లకు పైగా నిదులు రావల్సి ఉన్నా, రాలేదని చెప్పారు. చంద్రబాబు తన తెలివి తేటలతో ఎపిలో తన వైఫల్యాలన్నిటిని అటు ప్రదాని నరేంద్ర మోడీ పైననో, లేక ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పైననోవేసి తప్పించుకోవాలని చూస్తున్నారు. ఆయన తాజగా చేసిన ప్రకటన నిజంగా ఆశ్చర్యకరమై నదే, నాలుగు సంవత్సరాల పది నెలల కాలం గడిచిన తర్వాత చంద్రబాబు ఈ విషయం చెప్పారు. 

తెలంగాణలో ఉన్న ఆస్తుల ద్వారా ఈ మొత్తం రావాలని ఆయన అన్నారు. దీనిని ఎవరు ఇస్తారని కూడా ప్రశ్నించారు. జగన్మోహన రెడ్డి అడుగుతారా? అని అన్నారు. అంటే చంద్రబాబు అదికారం అనుభవిస్తుంటే, జగన్మోహనరెడ్డి లేదా మరో నాయకుడు తెలంగాణా నుండి రావలసిన నిధుల కోసం, కేంద్రం నుండి రావలసిన విభజన హామీల కోసం ప్రజల్లో ఉండి పోరాడాలన్నమాట. మరలాంతప్పుడు "ఈ నంగనాచి తుంగ బుర్ర" ను గెలిపించటంలోని ఔచిత్యం ఏమిటి? 

కెసిఆర్ పై, జగన్ పై, నరెంద్ర మోదీ పై యధావిధిగా రోజూవారీ ఆవుకథ, పిట్టకథ చెబుతూ ఆయన ఎలా ఏపి ప్రజలను గతంలో నిందించినది తిరిగి దాన్నే ప్రచారం చేయ డానికి నేడు ఎన్నికలవేళ చంద్రబాబు పూనుకుంటున్నారు. ఈ ఎన్నికల ప్రచారం అంతా ఇలా ఈ ముగ్గురు చుట్తూ తిప్పేసి జనాన్ని పిచ్చివాళ్లను చేయాలనో, మాయ చేస్తూ దగా చేయాలనో ఆయన మరోసార్ఫి ఆలోచిస్తున్నారనుకోవాలి. ఆ రకంగా ఎజెండాను సెట్ చేసుకొవటానికి కారణం ఆయన ప్రజాధనమెంతో వృధా చేస్తూ తన కుటుంబ స్వంత ఆస్తులు తన వారి సిరిసంపదలు పెంచుకుంటూ వస్తున్నారు.

నిజంగానే తెలంగాణ నుంచి ఎపికి లక్ష కోట్లు రూపాయిలు రావాల్సి ఉంటే చంద్రబాబు ఏమి చేస్తున్నట్లు? ముఖ్యమంత్రిగా తన హక్కులను అనుభవిస్తున్న ఈ మాయల మాంత్రికులు బాధ్యతలను విస్మరించింట్లేకదా? ఆయన తాను ఈ విషయంలో విఫలం అయ్యానని ఒప్పుకుంటున్నట్లే కదా! 

ఇప్పుడు తెలంగాణాలో కెసిఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయిన దరిమిలా, కేంద్రంలో నరెంద్ర మోడీ మళ్ళా అధికారంలోకి వచ్చి —  పొరపాటున చంద్రబాబు శాసనభ ఎన్నికల్లో గెలిస్తే, నిత్యం ఈ ముగ్గురి మద్య జరొగేది కోతుల కాట్లాట తప్ప మరొకటి ఉండదని చంద్రబాబు చెబుతున్నట్లే కదా! చంద్రబాబు చేసిన ఓటుకు నోటు నేరం లో ఇరుక్కొని కెసిఆర్ దెబ్బకు హైదరాబాద్ వదలి పారిపోయి వచ్చింది నిజం కాదా? ఆ తర్వాత మూడున్నర సంవత్సరాలు కెసిఆర్ ను పల్లెత్తు మాట కూడా అనకుండా గడిపింది నిజం కాదా? 
మిస్టర్ ప్రైం-మినిస్టర్ అని సంభోదించిన గల్లాజయదేవ్ ఆయనో వీరుళ్ళా పచ్చమీడియా ప్రచారం. విదేశాల్లో దేశాధ్యక్షుణ్ణించి సామాన్యునివరకు మిస్టర్ అనే సంభోదిస్తారు. కారణం జయదేవ్ చంద్రబాబు మరియు పచ్చమీడియావారి స్వంతకులం వారు కావటమే! 

జయదేవ్ కంటే అద్భుతంగా హిందీభాషలో అనర్గళంగా ఉపన్యసించిన రామ్మోహన నాయుణ్ణి నాలుగురోజులు మెచ్చుకొని ఆ తరవాత నుంచి గల్లా గారిని గల్లి నుండి డిల్లీ వరకు ఆకాశానికెత్తేస్తున్న పచ్చమీడియా ప్రాధాన్యం కులగజ్జా! ప్రజాశ్రేయస్సా! 
 

తెలంగాణ టిడిపి నేతలు ఆయనను ప్రత్యేకం గా కెసిఆర్ ను విమర్శించాలని కోరినా ఆయన అంగీకరించలేదన్నది వాస్తవం కాదా?  ఆ తర్వాత తెలంగాణాలో టి ఆర్ ఎస్ తో టిడిపి మైత్రి “వెల్-కం” బ్రాండ్ తో ఐఖ్యం కావాలని చంద్రబాబు వేసిన ఎత్తులు కేసీఆర్ దగ్గరపారలేదు సరికదా – కాంగ్రేస్ తో కలిసి  కెసిఆర్ ను చిత్తుగా ఓడించవచ్చనుకుని తప్పులో కాలేసిన చంద్రబాబుకు తెలంగాణా ప్రజలు చెప్పుతో సమాధానం చెప్పేరు.  తప్పుడు అంచనాతో చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఆమూలాగ్రం భంగపడ్డారు. అంతకు ముందు కెసిఆర్ తో పొత్తు పెట్టుకోవడం కోసం తహతహలాడింది పచ్చి నిజం.ఈ విషయం ఆయనే పలుమార్లు చెప్పారు. చివరికి అసెంబ్లీలో కూడా అన్నారు. కెసిఆర్ తో కలిపి పనిచేద్దామని,పొత్తు పెట్టుకుందామని, అదిక సీట్లు సంపాదిద్దామని కోరితే కెసిఆర్ ఒప్పు కోలేదన్న సంగతిని ఆయన బయట పెట్టారు.

అంతేకాదు హైదరాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్ధులను పక్కన బెట్టుకుని తాను కెసిఆర్ తో పొత్తు పెట్టుకుందామని ప్రయత్నించానని, అందుకోసం తాను కెసిఆర్ ఎదుట స్థాయి ని కూడా తగ్గించుకున్నానని కూడా చంద్రబాబే వెల్లడించారు. ఆ రకంగా ఆంద్రుల పరువు తీసింది చంద్రబాబేనని వేరే ఎవరూ చెప్పవలసిన అవసరం లేకుండా చంద్ర బాబు చెప్పేశారు.  అంతేకాదు, పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండవలసిన హైదరాబాద్ ను వదలుకున్న సంగతిని కూడా ఆయన అంగీకరించారు. కాంప్రమైజ్ అయ్యానని కూడా ఆయన అన్నారు.

ఇవన్నిదేనికి, తన మెడకు చుట్టుకున్న ఓటు కునోటు కేసు నుంచి బయటపడడానికి చేసుకున్న రాజీ కోసమే కదా! ఇప్పుడు రెండు రకాలుగా చంద్రబాబు ఆంద్రప్రదేశ్ కు నష్టం చేశారు. 

*ఒకటి ఆంద్రప్రదేశ్ కు చంద్రబాబు చెబుతున్నట్లు తెలంగాణ నుంచి రావల్సిన లక్ష కోట్లను రాకుండా పోవడం.
*రెండు కెసిఆర్ ముందు తన కేసు గురించి తలవంచుకుని ఆంద్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయడం.

ఒక ముఖ్యమంత్రిగా ఆయన చేసిన నిర్వాకం ఆంధ్రప్రదేశ్ ప్రజల పరువు ప్రతిష్ట దిగజార్చేదిగానే భావించాలి. మొత్తం మీద చంద్రబాబు ఓటుకు నోటు కేసు ఖరీదు ఏపి ప్రజల పరువు ప్రతిష్టలతో పాటు లక్షకోట్లు రూపాయిలన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: