మందేమైనా కొబ్బరి కాయల వ్యాపారమా ... పవన్ కు పృథ్వి పంచ్ ..!

Prathap Kaluva

కమెడియన్ పృథ్వి రాజకీయాల్లో చాలా యాక్టీవ్ గా అయ్యాడు. వైసీపీ తరుపున నుంచి అవతలివారికి ఓ రేంజ్ లో కౌంటర్ లు ఇస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కు "తాట" తీస్తా అనే పదం ఊతపదంగా మార్చుకున్నారు. తాజాగా పవన్ కల్యాణ్ విజయసాయిరెడ్డికి ఈ హెచ్చరిక జారీచేశారు! విజయసాయి రెడ్డి తాట తీస్తారట జనసేన అధిపతి. ఇప్పటివరకూ ఎవరెవరికి తీశాడో  కానీ.. పవన్ అవేమాటలే మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కో ఎన్నికల ముందు ఒక్కో డైలాగుతో వస్తూ ఉంటారు పీకే.


అప్పుడెప్పుడో కాంగ్రెస్ వాళ్ల పంచెలు ఊడగొట్టాలని పిలుపునిచ్చీన ఈయన ఇప్పుడు పంచెల మీద నుంచి తాట మీదకు వచ్చారు. పంచెలు ఊడగొట్టడం అయిపోయిందేమో మరి. ఇక జనసేన అధిపతి రొటీన్ డైలాగ్ కు సరైన పంచ్ వేశారు నటుడు పృథ్వి. పవన్ కల్యాణ్ సినిమాల్లో సైతం నటించిన పృథ్వీ ఏమాత్రం మొహమాటాలు ఏమీ పెట్టుకోకుండా గట్టి రివర్స్ పంచ్ ఇచ్చారు.


‘తాట తీస్తా.. తొక్క తీస్తా.. మనదేమైనా కొబ్బరికాయల వ్యాపారమా? నోటికి ఏది వస్తే అది మాట్లాడటమా..’ అని పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ప్రశ్నించారు పృథ్వీ. ‘గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నీతిమంతుడు అని చెప్పి ఆయనకు ఓట్లు వేయించావు, ఇప్పుడు మళ్లీ చంద్రబాబును సీఎంగా చేయాలని కష్టాలు పడుతున్నావు, ఓటు ఏ రోజు వేయాలో కూడా తెలియని మంగళగిరి మాలోకాన్ని ఏమైనా అనగలుగుతున్నావా?’ అని పవన్ ను ఉద్దేశించి వృథ్వి ప్రశ్నించారు. మొత్తానికి పవన్ కల్యాణ్ తాట తీస్తా డైలాగ్ కొబ్బరికాయల వ్యాపారాన్ని గుర్తు చేస్తోందని ఒక సహనటుడు పంచ్ వేసే స్థాయికి వచ్చినట్టుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: