ప్రజలు – అధిష్టానం

Kuthuru RajiReddy
తన భవితను ప్రజలే నిర్ణయిస్తారని రాజ్యసభ సభ్యుడు చిరంజీవి విచిత్రంగా మాట్లాడుతున్నారు. హీరోలుగా రాణించాలంటే, సినిమాలు హిట్ కావాలంటే ప్రజాధరణ కావాలిగాని అధిష్టానం వద్ద మార్కులు కొట్టేసి పదవులు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీలో తమ పార్టీని విలీనం చేసిన చిరంజీవికి తెలియలేదా! లేకుంటే తన దృష్టిలో అధిష్టానం అంటే ప్రజలే అనుకున్నారో తెలియదుగాని మొత్తానికి తన భవితవ్యం ప్రజలపై ఉందని చెప్పారు. చలనచిత్రరంగంలో ఒక వెలుగు వెలిగిన మెగాస్టార్ చిరంజీవి తన పుట్టిన రోజున ఏదో ముచ్చటించుకుంటూ మాట వరుసకు పాత్రికేయులతో మాట్లాడారు. తనకు పదవి రావడం అనేది ప్రజలే నిర్ణయిస్తారని అనడంతో చిరంజీవి ఎందుకు అలా మాట్లాడారోనని విన్నటువంటి వారు నిబ్బరపోయారటా. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మినహాయిస్తే కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎప్పుడైనా ప్రజల ఇష్టాను సారంగా ముఖ్యమంత్రి, పిసిసి పదవులుగాని దక్కినట్లు వినలేదు. కాంగ్రెస్ పార్టీలో ప్రజలచేత ప్రత్యేక్షంగా ఎన్నికల్లో గెలుపొందే పదవులు మినహాయించి ఉన్నత పదవులు పొందాలంటే ప్రజలతో సంబంధం లేకపోయిన పర్వాలేదుగాని అధిష్టానం దగ్గర విదేయుడిగా ఉండాలి. అందుకే విదేయుడిగా, నమ్మిన బంటుగా, అదిష్టానం దగ్గర మార్కులు కొట్టడం కాంగ్రెస్ పార్టీలో ముందుగా నేర్చకోవాల. అప్పుడే వారు ఊహించిన పదవులు ఆలస్యంగా నైనా వరిస్తాయి. అంతేగాని పదవులు ప్రజలే నిర్ణయిస్తారు, తమ భవిత ప్రజలపై ఉందని అనుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నత పదవులు పొందడం కష్టసాద్యమని చెప్పవచ్చు. పిసిసి అధ్యక్షుడిగా రాజ్యసభ సభ్యుడు చిరంజీవి నియమించబడుతాడని ఎవరు ప్రచారం చేశారో గాని 24గంటల నుండి అదే పనిగా అన్ని ప్రసారసాధనాలు ప్రచారం చేస్తున్నాయి. ఒక దశలో మీడియా ప్రచారం చూసి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందా అనే దిశగా ప్రచారం సాగుతుంది. పిసిసి అధ్యక్షుడుని తొలగించి అదే స్థానంలో చిరంజీవిని నియమిస్తారని ఎవరు ఇప్పటి వరకు సూచన ప్రాయంగా కూడా చెప్పలేదు. ఇటువంటి పరిస్థితిలో చిరంజీవిని నియమిస్తారనే ప్రచారం ఎందుకు తెరమీదకు వచ్చిందో తెలియదు. అయితే చిరంజీవి పిసిసి అధ్యక్షునిగా నియమించడానికి కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయని కూడా ప్రచారం జరుగుతుంది. పార్టీని స్థాపించి దాన్ని నడుపలేక కొద్ది రోజులకే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారని, పిసిసి అధ్యక్షపదవిని చేపట్టాలంటే రాజకీయ అనుభవం కావాలని ,అందుకే అధిష్టానం ఈ విషయంలో తర్జనభర్జనలు చేస్తుందని మరో వైపు మీడియా కధనాలను ప్రసారం చేస్తుంటే ఏది విశ్వసించాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: