అద్వానీకి టికెట్ దక్కక పోవడానికి వయసొక్కటే కారణం కాదు? ఇంకా..?: గడ్కరీ సంచలన వ్యాఖ్య

భారత రాజకీయాల్లో డైనాస్టీ ప్రత్యేకించి వారసత్వ రాజకీయాలు చెయ్యని పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎక్కడో ఒకటి అర సందర్భాలలోతప్ప ఇక్కడ వారసత్వ రాజకీయా లకు చోటు లేదనే చెప్పాలి. ఎంతో కొంత ఏవో కొన్ని సిద్ధాంతాలనైనా అనుసరించే ఆచారం సాంప్రదాయం బిజేపి ఉంది. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కురువృద్ధులకు ముఖ్యంగా ఎల్కే అద్వాని, మురళి మనోహర్ జొషి లాంటి వారికి టికెట్లు దక్కక పోవడంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది.  

బీజేపీ కురువృద్ధులకు టికెట్లు దక్కక పోవడంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కొంత ఆసక్తికర మరికొంత సంచలన వ్యాఖ్యలు చేశారు. 75 ఏళ్ల వయసు పైబడిన వారికి ఈ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకూడదని బీజేపీ నిర్ణయించినట్టు ఇటీవల ఒక చానల్ ఇంటర్వ్యూలో అమిత్ షా వ్యాఖ్యానించారు. అయితే, వయసు ఒక్కటే కారణం కాదని, ఇతరత్రా చాలా అంశాలు దీనికి ముడి పడి ఉన్నాయని నితిన్ గడ్కరీ తెలిపారు. 

"అద్వానీ, మురళీ మనోహర్ జోషి మా ఐకాన్లు. వారి మీద మాకు పూర్తి గౌరవం ఉంది. రాజకీయాల్లో ఒక తరం నుంచి మరో తరం వస్తుండాలి. ‘పెద్దవాళ్లు’ అన్న కారణంతోనే వారికి టికెట్ నిరాకరించలేదు" అని తెలిపారు. తాను ప్రధాని పదవి రేస్‌లో లేనని స్పష్టం చేశారు. ఎన్నికల్లో బీజేపీ గెలవడం ఖాయం, నరేంద్ర మోదీ పీఎం కావడం ఖాయమని తేల్చి చెప్పారు.

దేశంలో నిరుద్యోగం, వ్యవసాయం సమస్యలను పరిష్కరించడానికి మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నిరుద్యోగం అనేది కేవలం మోదీ ప్రభుత్వంలోనే ఉన్న సమస్య కాదని గడ్కరీ అభిప్రాయపడ్డారు. ఐదేళ్లలోనే నిరుద్యోగాన్ని అంతం చేస్తామని తామేమీ చెప్పలేదన్నారు. బయోఇథనాల్ వినియోగంపై ప్రోత్సహించడం ద్వారా రూ.2లక్షల కోట్ల ఇండస్ట్రీ ఏర్పడిందని, 50లక్షల ఉద్యోగాలు సృష్టించామని చెప్పారు. రోడ్స్ సెక్టార్‌లో 35వేల మంది యువతకు ఉపాధి కల్పించామన్నారు.

దేశభద్రత విషయంలో పార్టీలకు అతీతంగా అందరూ ఒక్కటి కావాలని నితిన్ గడ్కరీ పిలుపునిచ్చారు. ఎయిర్‌స్ట్రైక్స్ వంటి వాటిపై రాజకీయాలు తగవన్నారు. అసలు దేశ భద్రత అనే అంశంపై చర్చకు పెట్టడం సరికాదని గడ్కరీ అన్నారు. విదర్భను ప్రత్యేక రాష్ట్రం చేస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నామని, దీనిపై తీర్మానం కూడా చేశామని గడ్కరీ చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: