చంద్రబాబు-జగన్ - పవన్ : మూడు వారాల రాజకీయం ముగింపు!

Edari Rama Krishna
2019 ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయిన గత నాలుగు వారాలుగా ప్రపంచ వ్యాప్త తెలుగు ప్రజలందరి చూపు ఆంధ్రప్రదేశ్ వైపే.  చంద్రబాబు నాయుడు, జగన్, పవన్ ముచ్చటగా ముగ్గురు రాజకీయ వేడిని - మాఘమాస భానుని వేడికంటే రెట్లు పెంచారు.


పక్కనే ఉన్న తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నయన్న స్పృహకూడా లేకుండా ఆంధప్రజలు,  మా దగ్గర ఎలానూ కేసీఆర్ వస్తాడులే కానీ ఈ సారన్నా జగన్ వస్తాడా మీ తాన..అంటూ తెలంగాణ లో ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీదే ఆసక్తి చూపించేంతగా ఈ త్రిమూర్తులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని రక్తి కట్టించారు. 


భారత దేశంలో హిందీ తర్వాత అత్యంత ఎక్కువ మంది మాట్లాడే తెలుగు వారి గురించి యావత్తు భారత్ మాట్లాడుకునేంత ఎన్నికల వేడి రాజేసారు మన నాయకులు.


పిల్లల పరీక్షల కంటే, మండుతున్న ఎండల కంటే, టివి సీరియళ్లకంటే, ఐపిఎల్ కంటే కూడా ఎక్కువ మంది ప్రజలు యువతి, గృహిణులు, ఉద్యోగులు, వ్యాపారస్థులు ఎన్నికల గురించి మాట్లాడుకున్నారంటే అతిశయోక్తి కాదేమో.


2019 ఎన్నికలలో ధనం, మద్యం, కుట్రలు, కుతంత్రాలతో పాటుగా, సిద్దాంతాలు, విలువలు, సాంప్రదాయాలు వంటివి శీర్ష పీఠికకు రావడం చెప్పుకోదగిన పరిణామం. 


చంద్రబాబు- జగన్ - పవన్ త్రిమూర్తుల్లా నడిపించిన ప్రచారం చెదురు - మదురు సంఘటనలు తప్ప ప్రశాంతంగా జరిగి - ముగిసిందనే చెప్పొచ్చు.
చంద్రబాబు సభకెళ్తూ అభిమాని మృతి, జగన్ సభలో అభిమాని మృతి, పవన్ సభలో అభిమాని మృతి అంటూ వచ్చిన వార్తలు మాత్రం అందరి గుండెల్ని కలిచివేసిందనే చెప్పొచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: