రాష్ట్రంలో ఎన్నికల వేడిరాజుకుని, నేడు పోలింగ్ వరకు పుంజుకుంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సరళిపై అనేక ఆశలు నెలకొన్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ టీడీపీ ఎట్టి పరిస్థితిలోనూ విజయానికి చేరువ కాదనే సంపూర్ణ అంచనాల నడుమ జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఇప్పుడు అదే పార్టీ ప్రభావం చూపుతోం ది. ఎలాగైనా సరే ఓటింగ్ ప్రక్రియను ప్రభావితం చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో పోలింగ్ మొద లైన రెండు గంటల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా అలజడులకు చంద్రబాబు వ్యూహాత్మకంగా తెరదీశారు. ఈ వీఎంలు విఫలమయ్యాయని, తాము వేస్తున్న ఓటు వైసీపీకి పడుతోందని ఆయన కొత్త పల్లవి అందుకున్నారు.
మరి చంద్రబాబు చేసిన ఆరోపణలపై దృష్టి పెట్టిన సీఈవో.. ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. వాస్త వానికి ఎక్కడైనా విపక్షం ఆందోళనకు దిగాలి. కానీ, అధికారంలో ఉండి కూడా చంద్రబాబు రోడ్డున పడ్డాడం టే.. ఆయనకు పాలనా దక్షత లేదనే అనుకోవాలి. అన్ని విధాలుగాను చంద్రబాబు విఫలమయ్యారనే చెప్పాలి. ఇక, ఇప్పుడు ప్రజల చూపంతా కూడా గుంటూరు జిల్లా మంగళగిరిపైనే ఉంది. ఇక్కడ నుంచి సీఎం కుమా రుడు నారా లోకేష్ బరిలో నిలిచారు. ప్రతి ఒక్కరినీ తాను మెప్పించగలనని చెప్పిన లోకేష్ మంగళగిరిని పలకడంలోనే తడబడి.. బ్యాడయ్యారు. ఇంత వరకు బాగానే ఉన్నా అనేక విధాలుగా కూడా ఆయన తన పరువును పోగొట్టుకున్నారు.
ఇక, ఇప్పుడు పోలింగ్ విషయానికి వచ్చేసరికి అన్నీ మేనేజ్ చేశారని అంటున్నారు. మంగళగిరి నుంచి బలమైన అభ్యర్థిగా ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రతి ఒక్కరినీ కలుపుకొని పోయే నేతగా, ఆపద్భాంద వుడిగా పేరు తెచ్చుకున్న ఆళ్ళకు ఇక్కడి ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. అయితే, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఇక తన గెలుపు సాధ్యం కాదని గ్రహించిన టీడీపీ నాయకులు లోకేష్‌ను ఎలాగైనా గెలిపించుకోవాల నే పట్టుదలతో ఎన్నికల కేంద్రాలను, ఈవీఎం మిషన్లను కూడా ప్రభావితం చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ ఎవరికి ఓటేసినా.. టీడీపీకే పడుతోందని అంటున్నారు వైసీపీ నాయకులు. దీనిపై ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ ధర్నాకు దిగడం గమనార్హం. మొత్తానికి లోకేష్‌ను గెలిపించుకునేందుకు టీడీపీ ఎంతకైనా తెగిస్తోందని చెప్పడానికి ఈ ఉదాహరణ చాలని అంటున్నారు.