రాహుల్ గాంధీ అసలు పేరు ఎమిటో తెలుసా?

ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తులకు నిబద్ధత అవసరం. వారి జీవితాలు పూర్తిగా ప్రయివేట్ కాదు ఎంతో కొంత ప్రజలు, ప్రతిపక్షాలు, రాజకీయ వైరుధ్యం ఉన్నవారు పరిశీలిస్తూనే ఉంటారు. భారత ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధులు అవటానికి కనీస విద్యార్హతలు రాజ్యాంగం నిర్వచించ లేదు. ఎవరైనా దేశ, ప్రజా సేవా దృక్పథం ఉన్నవారు దేశ ప్రధానే కాదు రాష్ట్రపతి అవ్వటానికి ఈ జాతికి అభ్యంతరాలు ఏమీ లేవు.

అయితే డాంబికాలకు పోయి తమను తాము గొప్పవాళ్ళుగా ప్రొజెక్ట్ చేసుకునే క్రమంలో అబద్ధాలు, అర్ధ సత్యాలు ప్రకటిస్తూ అవమానాల పాలౌతున్నారు. దీనికి ఎవరూ అతీతులు కాదు. స్మృతి ఇరాని నుండి రాహుల్ గాంధి వరకు. ఇక రాహుల్ గాంధికి సోనియా గాంధికి వారి పేర్ల లోనే అనేక అనుమానాలున్నాయి భారత ప్రజలకు. కులం మతం అసలు ప్రామాణికాలు కానేకాదు.

కాని ఎన్నికలు ఓట్లు అధికారం కోసం వీళ్ళు చేయని మాయలు, కుట్రలు, కుతంత్రాలు లేవు. వీరి భారత పౌరసత్వం విషయంలో కూడా పలు అనుమానాలు పొడ సూపి అప్పుడప్పుడు వివాదాస్పదం అవ్వటం, ఆ తరవాత చల్లబడటం చూస్తూనే ఉన్నాం. రాహుల్ గాంధి హిందువే కాదని సుబ్రమణ్యస్వామి లాంటి వ్యక్తులెందరో ఉద్ఘాటిస్తూ ఉంటారు. ఋజువులు చూపుతూ వస్తున్నారు. అయినా రాహుల్ తనను తాను కాశ్మీరి బ్రాహ్మణుడుగా ప్రొజెక్ట్ చేసుకుంటూ జంధ్యం ధరిస్తారు. 

భారత ప్రజలకు రాజ్యాంగం ప్రకారం ఒక ముస్లిం ఒక క్రిస్టియం ఒక హిందూ ఎవరైనా ఏ రాజ్యాంగ పదవిలోనైనా వెలిగిపోవచ్చు. ప్రజల ఎంపిక ముఖ్యం. అయినా రాహుల్ ఎప్పుడు ఏదో విధంగా ఈ విషయాల్లో వివాదాస్పధం అవుతుంటారు. 

తాజాగా:  


కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం విడుదల చేసిన ధృవపత్రం ప్రకారం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు సోనియా గాంధి సుపుత్రుడు రాహుల్ గాంధీ పేరు వేరేనని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ నేషనల్ ఎకనమిక్ ప్లానింగ్ అండ్ పాలసీ (ఎకనమిక్స్‌ ఒక పార్ట్) లో ఫెయిలయ్యారన్నారు. రాహుల్ గాంధి మార్కుల లిస్ట్‌ను స్వామి ట్వీట్ చేశారు.

అమేథీ నుంచి రాహుల్ గాంధీ ప్రత్యర్థిగా బిజేపి తరపున బరిలో దిగుతున్న స్మృతి ఇరానీ విద్యార్హతల విషయమై వివాదం తలెత్తిన వేళ, బీజేపీ రాజకీయంగా ఎదురు దాడికి దిగింది. యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి అందజేసిన రాహుల్ ఎంఫిల్ సర్టిఫికెట్‌ ఫొటో-కాపీని బీజేపీ పార్లమెంట్ సభ్యుడు సుబ్రమణ్యస్వామి ట్వీట్ చేశారు. కేంబ్రిడ్జ్ సర్టిఫికెట్ ప్రకారం "బుద్ధూ" అసలు పేరు 'రాహుల్ విన్సీ' అని సుబ్రమణ్యస్వామి స్వామి తెలిపారు. నేషనల్ ఎకనమిక్ ప్లానింగ్ అండ్ పాలసీలో రాహుల్ ఫెయిలయ్యా రని స్వామి చెప్పారు. ఈ ట్వీట్‌ను స్మృతి ఇరానీ రీ ట్వీట్ చేశారు. 


రాహుల్ గాంధీకి నాలుగు పాస్‌ పోర్టులు ఉన్నాయని, ఒక దానిలో  రాహుల్ విన్సీ అని పేరుందని ఇటీవలే సుబ్రమణ్య స్వామి ఆరోపించారు. ఆయనకు ఎంఫిల్ డిగ్రీ లేదని ఆయన తెలిపారు. ఎకనమిక్స్ పేపర్లో రాహుల్ ఫెయిలయ్యారు అని అన్నారు. ఆయనకు జంధ్యం ఎలా ధరించాలో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో డిగ్రీ చదివినట్లు పేర్కొన్న స్మృతి ఇరానీ, ఈసారి మాత్రం డిగ్రీ చదవలేదని తన అఫిడవిట్లో పేర్కొన్నారు.

దీంతో కాంగ్రెస్ ఆమెను టార్గెట్ చేస్తూ పలుమార్లు పలు విధాలుగా విమర్శలకు దిగింది. ఆమె నామినేషన్‌‌ ను రద్దుచేయాలని డిమాండ్ చేసింది. కాగా, తాను డిగ్రీ చదివేందుకు ఢిల్లీ యూనివర్సిటీ లో చేరాను, కానీ పూర్తి చేయ లేదని స్మృతి ఇరానీ వివరణ ఇచ్చారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: