సుమలతను కర్ణాటకలో అమానవీయంగా అవమానించిన జేడీఎస్

కర్ణాటక మండ్య లోక్ సభ నియోజక వర్గం నుంచి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బహుబాష నటి, స్యాండిల్ వుడ్ రెబల్ స్టార్ అంబరీష్ సతీమణిని మానసికంగా హింసించడానికి జేడీఎస్ నాయకులు అనేక విదాలుగా సిద్దం అయ్యారు. అసలు సుమలతది ఏ జాతి, ఆమె అంబరీష్ గౌడ ను పెళ్లి చేసుకున్నంత మాత్రాన గౌడ అయి పోతుందా? అంటూ మండ్య లోక్ సభ సిట్టింగ్ ఎంపీ శివరామేగౌడ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.


ఒక ఆడపడుచును ఇలా వేదింపులకు గురి చేస్తారా! అంటూ అంబరీష్ అభిమానులు మండి పడుతున్నారు. మీకు దమ్ముంటే సుమలతను అడిగిన ప్రశ్నను మీ మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీకి చెందిన యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీని ప్రశ్నించండి అంటున్నారు అంబరీష్ అభిమానులు.


ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు ఎక్కడి నుంచి అయినా ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అవకాశం ఉంది. మండ్య లోక్ సభ ఎన్నికల్లో సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల మద్దతుతో పోటీ చేస్తున్నారు. మండ్య లోక్ సభ నియోజక వర్గంలో సుమలత స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చెయ్యడంతో జేడీఎస్ పార్టీ నాయకులు జీర్ణించుకో లేకపోతున్నారు.


ఇప్పుడు సుమలత కులం ఏమిటి అంటూ కొత్త వివాదం తెరమీదకు తెచ్చారు. యుపీఏ అధ్యక్షురాలు మండ్య సిట్టింగ్ ఎంపీ శివరామేగౌడ నిఖిల్ కుమారస్వామికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్బంగా శివరామేగౌడ మాట్లాడుతూ సుమలత ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో జన్మించారని అన్నారు. సుమలత నాయుడు కులానికి చెందిన మహిళ అని, కేవలం అంబరీష్ ను పెళ్లి చేసుకున్నంత మాత్రానా ఆమె గౌడ కులంలోకి ఎలా వస్తారు? అని ప్రశ్నించారు. సుమలతను అడుగుతున్న ప్రశ్నను యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీని అడుగుతారా? అంటూ అంబరీష్ అభిమానులు ఎంపీ శిరామేగౌడ మీద మండిపడుతున్నారు.


సుమలతది నాయుడు రెబల్ స్టార్ అంబరీష్ గౌడ అన్న విషయం మండ్య ప్రజలందరికీ తెలుసు. అయితే అంబరీష్ ను వివాహం చేసుకున్న సుమలతను తాము గౌడ అని ఎలా అంగీకరించడానికి సాధ్యం అవుతుంది అంటూ జేడీఎస్ ఎంపీ శివరామేగౌడ ప్రశ్నించారు. గౌడను పెళ్లి చేసుకున్న సుమలత ఎప్పటికి గౌడ కాలేదని, ఆమె కులం నాయుడు అని శివరామేగౌడ అన్నారు.


బెంగళూరు నగరం, నగర శివార్లలో నాయుడు కులస్లులు ఎక్కువగా ఉన్నారని, కాని ఈమె ఇప్పుడు మండ్యలో రాజకీయాలు చెయ్యడానికి వచ్చారని, తాము అంగీకరించ మని ఎంపీ శివరామేగౌడ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సుమలత గౌడ కోడలు కాలేదు రెబల్ స్టార్ అంబరీష్ తండ్రి హుచ్చే గౌడ. సుమలత ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో తాను అంబరీష్ భార్య, హుచ్చే గౌడ కోడలు, తనను గెలిపించాలి అని ప్రచారం చేస్తున్నారు.


సుమలతను హుచ్చే గౌడ కోడలుగా ఎలా ఊహిస్తామని ఎంపీ శివరామేగౌడ ప్రశ్నించారు. భర్తను పెళ్లి చేసుకున్న తరువాత మహిళకు ఆయన ఇంటి పేరు వర్తిస్తుంది ఈ కనీస జ్ఞానం శివరామేగౌడకు లేదా అని అంబరీష్ అభిమానులు, మండ్య మహిళలు మండిపడుతున్నారు. ఇలా మన తెలుగు ఆడపడుచు సుమలతను జేడీఎస్ నాయకత్వం కులం పేరుతో అవమానిస్తే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిగ్గు ఎగ్గు మరచి జేడీఎస్ నిఖిల్ కుమార్ గౌడ అంటే కుమారస్వామి గౌడ పుత్రరత్నానికే మద్దతిచ్చారు. అయినా అభిమానం అభిజాత్యం ఉండటానికి చంద్రబాబేమన్నా ఎన్టీఆరా!   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: