నరేంద్ర మోదీతో దేశానికి పెను ప్రమాదం: నారా చంద్రబాబు నాయుడు

చంద్రబాబు నాయుడుతో స్నేహం పాముతో స్నేహం లాంటిదే అని ప్రధాని నరెంద్ర మోడీకి బాగా అర్ధమై ఉంటుందీ పాటికే. స్నేహం చేసిన నాలుగేళ్ళు ఆయనను హిమవత్పర్వతంతో పోల్చారు. శాసన సభలో కూడా ఆ విషయాన్ని నొక్కి వక్కాణించారు.  ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యెక పాకేజీ అంగీకరించి దానికి సంతోషపడి బిజేపి నాయకులకు సన్మానం చేసిన చంద్రబాబు నేడు నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజేపై గరళం చిమ్ముతున్నారు. ఎన్డీఏ నుండి బయటకు వచ్చిన చంద్రబాబు మోడీపై ప్రదర్శించిన వఒఇరం చూస్తుంటే ఈ క్రింది పద్యం గుర్తుకు వస్తుంది.

 

నరేంద్ర మోదీతో దేశానికి పెనుప్రమాదం ఉందని, ఆయన్ని గద్దె దించేందుకు ప్రవాసాంధ్రులు, కన్నడిగులు సహకరించాలని ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. కర్ణాటకలోని శ్రీరామనగర, సింధనూరులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించి నారు. 

 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో బీజేపీకి 150-170 సీట్లు మించి రావని సర్వేలలో తేలిందని నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మహాత్మాగాంధీ పుట్టిన గడ్డపై నుంచి వచ్చిన నరేంద్ర మోదీ ఆ ప్రాంతానికే కళంకం తెచ్చారని పేర్కొన్నారు. నరేంద్ర మోదీ నోరు విప్పితే అబద్ధాలే నని, ఆయన మాటల గారడీ కి ప్రజలు మోసపోవద్దని అన్నారు.  తిరుమల వెంకన్న సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని మాటిచ్చిన మోదీ ప్రధాని అయ్యాక మాట తప్పారని ఆరోపించారు. విభజన హామీలు నెరవేర్చాల ని అడిగితే అణగ దొక్కాలని ప్రయత్నించారన్నారు.

 

ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం నరేంద్ర మోదీపై తిరుగుబాటు చేసి ఎన్డీయే నుంచి బయటకు వచ్చామని చంద్రబాబు చెప్పారు. తాము లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి 126 మంది ఎంపీలు మద్దతిచ్చినా మోదీ మనసు కరగలేదన్నారు. మోదీ మాటలకు చేతలకు పొంతన ఉండదని విమర్శించారు

.

"ఈ ఐదేళ్లలో ఎంతో మంది సైనికులు చనిపోయారు. గోవధ అంశం దేశవ్యాప్తంగా హింసకు దారి తీసింది. ₹ 2వేల నోట్లను వద్దని చెప్పినా వినకుండా అమల్లోకి తెచ్చారు. పెద్దనోట్లతో ఓట్లు కొనుగోలు చేసే పన్నాగం దీనివెనుక ఉంది. అధికారంలోకి వస్తే స్విస్ బ్యాంకుల నుంచి నల్లధనం తెస్తామన్నారు. దాని ఊసేలేదు. ఆర్థిక నేరగాళ్లను రాచమర్యాదలతో విదేశాలకు సాగనంపారు. నిజాయతీపరులు, మోదీని విమర్శించే నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు"  అని చంద్ర బాబు ధ్వజమెత్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: