సత్తెనపల్లి టిడిపి - వైసిపి పోరులో జనసేనకు విజయం తధ్యం!!!

ఇద్దరి మద్య పోరాటంలో మూడోవాడికి ప్రయోజనం దక్కుతుంది. ఇది సాధారణంగా జరిగేదే. అదే జరిగింది గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో. నువ్వా నేనా అంటూ హోరా హోరీ ఫైట్ ఇక్కడ జరిగిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం అక్కరలేదు. అందరూ అనుకుంటున్నట్లుగా ఇక్కడ తెలుగుదేశం వైసీపీ మధ్య మాత్రమే పోటీ జరగలేదు. ఇక్కడ జనసేన ఒకటుందన్న విషయాన్ని అందరూ మర్చిపోయినట్లున్నారు. 


జనసేన అభ్యర్థికి మంచిపేరు గౌరవం ఉండటంతో సత్తెనపల్లిలో త్రిముఖపోటీ జరిగిందని అంటున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ఇప్పుడు హాట్-టాపిక్ గా మారింది. ఇక్కడ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు టీడీపీ తరుపున, వైసీపీ నుంచి అంబటి రాంబాబు, జనసేన పార్టీ నుంచి రాజకీయాల్లో విలువలు పాటించే యర్రం వెంకటేశ్వరరెడ్డి పోటీచేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

టీడీపీ, వైసీపీలు ఇప్పుడు గెలుపు తమదంటే తమదని పైకి చెబుతున్నా లోపల మాత్రం ఇద్దరికీ అంత నమ్మకం లేదన్నది వాస్తవం. కోడెల శివప్రసాదరావు విషయమే తీసుకుంటే ఆయనకు సొంతపార్టీ నేతలే సహకరించలేదని చెబుతున్నారు. అంతే కాదు మొత్తం నియోజకవర్గంలో ఆయన సామాజిక వర్గంలో తప్ప వేరెవరికి ఆయనపై ఆయన కుటుంబ సభ్యులపై సదభిప్రాయం లేదు. శాసనసభ స్పీకర్గా ఆయన పిరాయింపులను ప్రోత్సహించిన తీరు రాజకీయాలలో విలువలు కోరుకునే వారితో పాటు తటస్థులకు ఏ మాత్రం నచ్చలేదు. కులం కోసం మాత్రమే పనిచేసే  వ్యక్తిగా ప్రజల్లో ఆయనకున్న కీర్తి. 


అయితే తాను నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని కోడెల అంటున్నారు. తొలుత కోడెలకు టిక్కెట్ ఇవ్వవద్దంటూ సత్తెనపల్లి టీడీపీ కార్యాలయంలోనే ఆందోళన చేసిన నేతలను కోడెల బుజ్జగించినా ఆయనకు సహకరించలేదని చెబుతున్నారు. కోడెల తిరిగి గెలిస్తే తమపై ప్రతీకారం తీర్చుకుంటారని భావించి టీడీపీ నేతలే కొందరు జనసేన పార్టీకి సహకరించారన్న టాక్ ఇక్కడ బాగా విన్పిస్తుంది.


ఇక వైసిపి అంబటి రాంబాబు పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. సత్తెనపల్లి నియోజకవర్గంలో కమ్మ, ముస్లిం, మాదిగ, రెడ్డి కులస్ధుల ఓటర్లు ఎక్కువగా ఉన్నారు ముస్లిం, ఎస్సీ ఓట్లు తమకే పడ్డాయన్న విశ్వాసంలో అంబటి ఉన్నారు. అంబటి రాంబాబుకు కూడా టిక్కెట్ ఇవ్వవద్దంటూ వైసీపీ నేతలు లోటస్ పాండ్ వద్ద ధర్నాకు దిగారు. వారంతా ఇప్పుడు సత్తెనపల్లిలో జనసేనకు జైకొట్టారంటున్నారు. అయితే జగన్-వేవ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నందున తన గెలుపు ఖాయమన్న నమ్మకంలో అంబటి రాంబాబు ఉన్నారు. అప్పుడే తమ గెలుపు ఖాయమై పోయినట్లు వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే జనసేన అభ్యర్థి యర్రం వెంకటేశ్వరరెడ్డికి మంచి పేరుంది. రాజకీయాల్లో అవినీతి ఆరోపణలు లేని వ్యక్తిగా ఆయనకు ప్రజల్లో పలుకుబడి ఉంది. కాపు, రెడ్డి సామాజికవర్గం ఓట్లతో పాటు ముస్లిం ఓట్లు కూడా తనకే పడ్డాయని యర్రం వెంకటేశ్వరరెడ్డి భావిస్తున్నారు. ఆయన గెలుపుపై పూర్తి ధీమాగా ఉన్నారు. త్రిముఖ పోటీలో కొద్ది ఓట్ల తేడాతో నైనా తాను గెలుస్తానని యర్రం ధీమాగా ఉన్నారు.
ఇలా మూడు పార్టీలు ఎవరికి వారే ధీమా కనపరుస్తున్నప్పటికీ ఈ ఎన్నికల్లో ఓటమి పాలయితే అంబటి రాంబాబు, కోడెల శివ ప్రసాదరావులకు రాజకీయంగా ఇబ్బందులు తప్పవు. కోడెలకు ఇవే చివరి ఎన్నికలని సత్తెనపల్లి ప్రజలు అంటున్నారు. మరి పలితాలకోసం ఎదురుచూద్ధాం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: