సామాజిక మీడియా వేదికగా ఎల్వీ సుబ్రమణ్యంపై బాబు మార్క్ బురదచిమ్మే కార్యక్రమం మొదలెట్టిన తమ్ముళ్ళు

ఎన్నికల ప్రహసనం అయిపోయింది. ప్రజాభిప్రాయం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఆ సమయం రాగానే లెక్కింపు జరిగి ఆ తరవాత జయాపజయాలు ప్రకటించ బడతాయి. ఇంతలోనే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంపై బురదజల్లే కార్యక్రమం మొదలుపెట్టారు తెలుగు తమ్ముళ్ళు.  తెలుగుదేశం ప్రతినిధులకు దాని అధ్యక్షుడు నారా చంద్రబాబుకు నాయుడు తమ పార్టీ అధికారంలోకి రావటమే ముఖ్యం.

ఆయన అధికారం కోసం ఎమైనా చేయగలరు ఏమైనా మాట్లాడగలరనటానికి క్రింద ఉదహరించటం జరిగింది దానికోసం :


*ఎలెక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లలో లోపాలున్నాయని – ఈవీఎంలలో, వివిప్యాట్లలో కాన్-ఫిగరేషన్ (ఆకృతీకరణ) మార్చవచ్చని, రష్యన్ హ్యాకర్లు మన ఈవీఎంలను హ్యాక్ చేయగలరని బల్లగుద్ది మరీ ఆయనకు బాగా అనుభవమున్న విషయం లాగా ముఖ్యమంత్రి పలుసార్లు ప్రజావేదికలపై  స్వయంగా చెప్పారు 


*కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర నిఘా సంస్థలైన సీబీఐ, ఈడి వంటి రాజ్యాంగ సంస్థలను ఎంతదిగజారైనా దూషించగలరు. ఎన్నికల కోడ్ అంటే ఇసుక రేణువుతో సమానంగా చూస్తారు.


*సాక్షాత్తు దేశ ప్రధానిని సైతం ఎంత అగౌరవంగానైనా తిట్టగలరు ఎందుకంటే ఆయన నలభైయేళ్ళ రాజకీయ అనుభవమున్న రాజకీయ వేత్త.


*తన మంత్రి మండలి లోని ఒక మంత్రి వర్యుని ఆధ్వర్యంలోని విద్యావ్యవస్థల్లో విద్యార్ధినీ విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకున్నా దానిపై కనీసం విచారణ కమిటీలు వేసి విచారణ కూడా చేయించరు. 

*తన పార్టీ ప్రజా ప్రతినిధులకు చెందిన బస్ ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రయాణికులు మరణించినా లక్ష్యం లేదు.  పుష్కరాల్లో తన కుటుంబ ఆనందంకోసం మూడు పదుల మంది మరణించినా వారిపై దయలేదు. 


*దుర్మార్ఘానికి పరాకాష్ట ప్రజలెన్నుకున్న ప్రతిపక్ష శాసనసభ్యులను పట్టపగలు ప్రజాస్వామ్యం వలువలూడ్చి కోనేసిన వైనం ప్రజాస్వామ్య వాదులను కలచి వేసింది.  అయినా అధికారం కోసం ఆయన ఎంత నీచస్థాయి కైనా దిగజార్చారని పించింది


*ఎన్నికల విధుల్లోకి నారాయణ, శ్రీచైతన్య కళాశాల ఉద్యోగులను, ఆశావర్కర్లను  తీసుకునేలా చేసిన వైనం, ఆయన ప్రజాస్వామ్యవాదా? వాడుకొని వదిలేద్ధాం అనే బాపతా? తెలుగు ప్రజలంటే భక్తా? లేక అధికారం అంటే వల్లమాలిన ప్రేమా?


*0.3% ఈవీఎంలలో ఇబ్బందివస్తే తన తెలుగు తమ్ముళ్ళను వెనకేసుకి దాన్ని 30%గా మార్చి ప్రచారం చేయటం, ఎన్నికల సంఘం నైతికత మీదే బురదచల్లటానికి ప్రయత్నించిన ఆ మహనీయుణ్ణి జనం మళ్ళా ఎన్నికలు పెడితే మాత్రం శంకరగిరి మాన్యాలు పట్టిస్తారనేది నిర్వివాదాంశం.


*గతంలో ఏపి ట్రాన్-స్పోర్ట్ కమీషనర్ ఎన్. బాలసుబ్రమన్యంగారిపై టిడిపి ఎంపిలు కేసినేని నాని, ఎమెల్సీ బుద్ధా వెంకన్న, ఎమెల్యే బోండా ఉమ చేసిన దురాగతమైన దాడి తెలిసీ ఇదే చంద్రబాబు నాయుడు మౌనం వహించటం ఏ రకమైన ప్రజాసేవ?


టిడిపి అధినేత - తన పార్టీ వాళ్లని, వేరే పార్టీ వాళ్ళు తిడితే - వాళ్ళని తన పార్టీలోని అదే కులానికి చెందిన వారితో తిట్టిచటం - ఆయనకు అలవాటే – అదే ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రమణ్యాన్ని తన పార్టీలోని బ్రహ్మణుడైన వేమూరి ఆనంద్ సూర్య తో విమర్శింప చేయటం ఆయనలోని కుల కార్పణ్యాన్ని ప్రజలు గమనిస్తున్నారు. 


అసలు ఆకథ ఏమంటే:


ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యంపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అమరావతిలో తెలుగుదేశం పార్టీ నేత‌లు జూపూడి ప్రభాకర్, వేమూరి ఆనంద్ సూర్య మీడియాతో మాట్లాడుతూ క‌ల‌కలం రేపే వ్యాఖ్య‌లు చేశారు.  


“తాత్కాలిక సీఎస్‌గా అధికారంలో ఉన్న సీఎస్ తనకు లేని అధికారాన్ని ప్రదర్శిస్తున్నారు” అని 


“నెల్లూరు సింహపురి ఆసుపత్రిలో మానవ అవయవాలను అక్రమంగా దొంగిలించి అమ్ముకునే ముఠాకు సీఎస్ ఎల్వీఎస్ అండగా నిలిచారు”

“శీనయ్య అనే గిరిజన వ్యక్తి  ప్రమాదానికి గురై సింహపురి ఆసుపత్రిలో చేరితే బ్రెయిన్-డెడ్ అని నాటకాలాడి అవయవాలు అమ్ముకున్నారు”


"దీని వెనుక పెద్ద కుట్ర ఉందని అతని భార్య తెలుసుకొని ఫిర్యాదు చేసిందని, అయితే, ఆసుపత్రి యజమాని పవన్ కుమార్ సీఎస్‌ ను కలిశాక కథ‌ అంతా మారింది” 


“మే 23 తరువాత సీఎస్‌గా ఉండనని తెలిసి ఇల్లు చక్కదిద్దుకుంటున్నారు. మానవ అవయవాలు అమ్ముకునే వారికి సీఎస్ ఎల్వీఎస్ అండగా నిలవడాన్ని ఖండిస్తున్నాం" అని జూపూడి ప్రభాకర్ ఆరోపించారు. 


ఒక ఐఏఎస్ అధికారి ఇచ్చిన రిపోర్టు చెత్తబుట్టలో వేసిన సీఎస్‌ కి వ్యవస్ధపై ఎంత గౌరవం ఉందో తెలుస్తుందన్నారు.  ఎవరి ప్రయోజనాల కోసం ఎవరి ఆదేశాలతో సీఎస్ మళ్లీ రిపోర్ట్ కోరారనేది తేలాల్సి ఉంద‌న్నారు.


ఇంటరిం - సి.ఎస్ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేయనుందని అన్నారు.


“సింహపురి ఆసుపత్రి యాజమాన్యానికి సీఎస్ ఎల్వీఎస్ కొమ్ము కాస్తున్నారు” అని ఆనంద్ సూర్య ఆరోపించారు.


“ఒక వర్గంతో కుమ్మక్కై వారి ప్రయోజనాల కోసం పని చేస్తున్నారు” అని కూడా ఆరోపించారు.


మానవత్వాన్ని మంటగలిపే విధంగా వ్యవహరిస్తున్న ఆసుపత్రి యాజమాన్యానికి సీఎస్ వత్తాసు పలికారని, సీఎస్ వచ్చినప్పటి నుండి తన సొంత ప్రయోజనాల కోసం పని చేస్తున్నారు” అని మండిప‌డ్డారు.

ఇలా పనిచేస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని తెలిపారు. ప్రభుత్వంలో ముఖ్య కార్య‌ద‌ర్శిది ఒక గుమాస్తా తరహా పాత్ర మాత్రమేనని ఎన్నికైన ప్రభుత్వానిదే తుది నిర్ణయాధికారమ‌ని ఆనంద్ సూర్య తెలిపారు.


రాజ్యాంగ వ్యవస్థలో శాసనవ్యవస్థకు ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తుంటే, ఎక్జెగ్యూటివ్ వ్యవస్థకు ప్రధాన కార్యదర్శి బాధ్యత వహిస్తారని, విధుల నిర్వహణ లో సీఎంది శాసనాధికారమైతే - సిఎస్ ది శాసనాలను అమలు పరచే వ్యవస్థ అని వేమూరు ఆనంద్ సూర్య కు తెలియకపోవటం ఆయన ఖర్మ.  తేడా వస్తే ఈ ఆనంద్ సూర్యను వేరే బ్రహ్మణుని తోను, జూపూడి ప్రభాకరును మరో ఎస్సీ సభ్యునితో తిట్టించగలడని మొత్తం తెలుగు జనానికి తెలుసు. వీళ్లకు తెలియక పోవటం దురదృష్టం. మొత్తం మీద అధికారం కోసం చంద్రబాబు ఏమి చెయగలరో? ప్రజలకు అరటి పండు వలిచి పెట్టినంత సులభంగా చెప్పగలరు. 


ఇంట్లో హెరిటేజ్ పాలు తాగే జూపూడి ప్రభాకర్ స్వభావం తెలిసిందిగా!  ప్రభాకర్ స్వభావం తేట తెల్లమైంది కదా! ఇక హెరిటేజ్ పాలు తాగకండి 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: