పరికరాలతో పోట్లాడే పనిమంతుడు మన చంద్రబాబు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, సారీ! ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తలపెట్టిన మంత్రి వర్గ సమావేశానికి అధికారులు హాజరవుతారా? లేదా? అనే సందేహం ఉత్పన్నమైంది. అది ఒక రకంగా ముఖ్యమంత్రి ని అనుకునే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి పరీక్షనే. చంద్రబాబు ఏర్పాటు చేసే మంత్రివర్గ సమావేశానికి హాజరు కావడానికి అధికారులకు ఎన్నికల కమిషన్ (ఈసి) అనుమతి ఇస్తుందా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారగా - దాని మీద ఆధార పడిందే మంత్రి వర్గ సమావేశానికి అధికారులు హాజరవుతారా? లేదా?  అనే సందేహం.

తాజాగా వివాదాస్పదుడుగా రాణిస్తున్న చంద్రబాబు రాజ్యాంగ ప్రసాదిత అధికార వ్యవస్థపై దాడి చేయటం మొదలెట్టిన దరిమిలా ఈ సమస్య రావణకాష్టంగా మారింది. ఆయన ఈ విషయాన్ని దేశ సర్వోన్నత న్యాయ స్థానం ముందు పెట్టాల్సింది. అలా కాకుండా  ఎన్నికల కోడ్ అమలౌతున్న సమయంలో ఈసి అదుపాఙ్జల్లో పనిచేసే అధికార వ్యవస్థ పై దాడి చేయటం "చాక్లేట్ కోసం ఏడ్చే పసిపిల్లాడి తీరు" ను గుర్తు చేస్తుంది. తా బట్టిన కుందేటికి మూడే కాళ్ళు - నే చెప్పిన మాటే వేదం అనే వారికి సమాధానమే కాదు సహకారమూ దొరకదు. అయినా నిజంగా ప్రజాసేవ చేసే వారు ఇంకో వారం ఆగలేరా? ఇలా పరికరాలతో కొట్లాడే ఈ పనిమంతుడు ప్రజలకు ఏమి ఒరగబెట్టాడో ఐదేళ్ళ పాలన చెపుతూనే ఉందంటున్నాయి విపక్షాలు 
   
ఈసి పై పోరాటం సాగిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అధికారులు లేకుండా తన మంత్రివర్గ సభ్యులతోనే సమావేశం ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఏర్పడ వచ్చునని అంటున్నారు. మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (ఎల్వీ సుబ్రహ్మణ్యం)  సమాచారం అందాల్సి ఉంటుంది. తగిన సమాచారంతో మంత్రివర్గ సమావేశానికి హాజరు కావాలని ఆదేశిస్తూ ప్రధాన కార్యదర్శి ఒక నోట్ సర్క్యులేట్ చేస్తారు. 


ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున మంత్రివర్గ సమావేశానికి హాజరు కావాలా? వద్దా?, ఈ నోట్ సర్క్యులేట్ చెయ్యాలా/ వద్దా? అనే విషయాలపై ప్రధాన కార్యదర్శి ఈసీ అనుమతిని రాతపూర్వకంగానో, మౌఖికంగానో తీసుకోవలసి ఉంటుంది. అందుకు సంబంధించి నోట్ సర్క్యులేట్ చేయడానికి కూడా ఆయన ఈసి అను మతి తీసుకోవాల్సి ఉంటుంది. 

ఈసి అనుమతి ఇస్తే అధికారులు మంత్రివర్గ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే వారు హాజరు కారు. ఫణి తుఫాను పై సమీక్షకు ఎల్వీ సుబ్రహ్మణ్యం హాజరు కాకపోవడం పై చంద్రబాబు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మంత్రి వర్గ సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తనకు రిపోర్టు చేయాల్సిందేనని ఆయన అంటున్నారు. 


ముఖ్యమంత్రి, మంత్రులు సుప్రీం అని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేవలం పెసిలిటేటర్ మాత్రమేనని, అవసరమైనప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమావేశానికి హాజరు కావాల్సిందే నని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: