పోలవరం "డొల్ల"వరమేనా? ఉండవల్లి సంశయం నిజమైతే "రాజమండ్రి గోవిందా!"

పోలవరంపై చంద్రబాబు మాటలన్ని నీటిమూటలే అని తేలిపోతున్నాయి. 2018 లో పూర్తవవలసిన ప్రొజెక్ట్ సీనియర్, రాజకీయవేత్త మాజీ ఎంపీ, ఉండవల్లి అరుణ కుమార్ అభిప్రాయం ప్రకారం 2020 కి పూర్తయినా గొప్పే!  పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జరుగుతున్న లోపాలను, భవిష్యత్ లో ఎదురయ్యే ప్రమాదాలను ఉండవల్లి బట్టబయలు చేశారు. 


కేంద్రం సహకరించక పోయినా తమ నిధులతోనే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తిచేసి జనాల్లో క్రేడిట్ పొందాలి  అని చంద్రబాబు ఆరాటపడుతున్నారట. ఆరాట పడితే సొమ్ములొస్తాయా?  అలాంటిది జూన్ లో నీళ్లు ఇచ్చే విధంగా పనులు పూర్తి చేయాలని "అధికారులకు ఆదేశాలు" కూడా ఇచ్చారట. అంటే "అధికారులు పని చేయట్లేదని ఆ తరవాత చెప్పుకొని దాన్ని 2024 వరకు (అధికారంలోకి వస్తే) లాగించే ప్రణాళిక"  ఇదన్న మాట, అంటున్నారు రాజమండ్రి వాసులు ముఖ్య మంత్రి చంద్రబాబుపై  పోలవరం ప్రాజెక్ట్ గురించి  ఉండవల్లి అరుణ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాపు ఆయన చంద్రబాబుపై వెలిబుచ్చిన అనుమానం  వింటే చంద్రబాబు దిమ్మతిరగాల్సిందే.  


పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జరుగుతున్న లోపాలను, భవిష్యత్ లో ఎదురయ్యే ప్రమాదాలను ఉండవల్లి బట్టబయలు చేశారు. 

*పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో పలుసార్లు భూమి పగుళ్లు ఏర్పడటంపై అరుణ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదకర పరిస్థితిలో ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందన్నారు. 

*భవిష్యత్తులో ఏదైనా తేడా జరిగి "డ్యాం-డ్యామేజ్" అయితే రాజమండ్రి వరదల్లో ఢమాల్ అవటం తధ్యం,  వరదలో కొట్డుకుపోతుందని హెచ్చరించారు. 

*ప్రాజెక్ట్ చుట్టుపక్కలున్న గ్రామాలు తుడిచి పెట్టుకుపోతాయన్నారు. 

పోలవరం విషయంలో చంద్రబాబుది ద్వంద్వ వైఖరని, ప్రాజెక్ట్ విషయంలో చాలా దారుణాలు జరిగిపొతున్నాయని ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. "కాపర్ డ్యాం వల్ల ఎంత మేర మునిగిపోతుంది అనే దానికి లెక్కలు కూడా లేవు" అని అన్నారు. ఆ ప్రాంత 'ముంపు కు గురైన ప్రజలకు నష్టపరిహారం చెల్లించారా? ప్రజలకు న్యాయం చేశారా? అని ప్రశ్నించారు. ముంపు ప్రజలకు ₹ 30 వేల కోట్లు కావాలని, ఆ డబ్బు ఎక్కడి నుంచి తెస్తారో?  ముందుగా  చెప్పాలన్నారు.
 
పోలవరం ప్రాజెక్ట్ దగ్గర భూమి కుంగిపోవడం మాములు విషయం కాదని, దాన్ని సీరియస్ గా తీసుకోవాలని చంద్రబాబుకు సూచించారు. వెంటనే జియాలజిష్టులను ఇతర నిపుణులను పంపి పరిశీలన చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలవరం విషయంలో చాలా దారుణాలు జరుగుతున్నాయని అక్కడి అధికారులే స్వయంగా తనకు చెబుతున్నారని ఉండవల్లి ఆరోపించారు. పోలవరం నిర్మాణంలో టీడీపీ అనుసరిస్తున్న తీరు పూర్తిగా రాజకీయకోణమే, తప్ప అందులో ప్రజా ప్రయోజన కోణమే లేదని ఉండవల్లి తేల్చారు. 
 
ప్రాజెక్టు నిర్మిస్తున్న స్థలంలో భూమి కుంగిపోవడం ప్రభావం ప్రస్తుతం కడుతున్న "స్పిల్-వే" మీదే ఉంటుందని హెచ్చరించారు. ఇంత  భారీ ప్రోజెక్టును ఒక జియాలజిస్టు చేత  పర్యవేక్షణలో పరిశోధన జరగకుండా నిర్మాణం చేపట్టడం ప్రపంచ చరిత్రలో ఎక్కడా ఉండదని బహుశ ఇదే తొలిసారని వ్యాఖ్యానించారు. జియాలజిస్టులను పిలిచి ఇప్పటికైనా పరిస్థితిని సమీక్షించాలని కోరారు. 


"ఇప్పటికైనా మేల్కొంటే కేవలం డబ్బు మాత్రమే పోతుంది. కానీ డ్యామ్ పూర్తయ్యాక వరదవస్తే రాజమండ్రి దాని పరిసరాల ఆచూకికూడా ఉండదు. మొత్తం కొట్టుకుపోతుంది"  అని హెచ్చరించారు. ఇక అమరావతిలో కట్టిన బిల్డింగ్ లకే లీకేజీలు వచ్చాయనీ, వాటిని సిమెంట్ వేసి సరిదిద్దు కోవచ్చని చెప్పారు. కానీ పోలవరం ప్రాజెక్టు బద్దలైతే, తీవ్ర వినాశనం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.  పోలవరంలో తేడావస్తే ఊర్లు మిగలవూ, ప్రజలూ మిగలరని ఉండవల్లి హెచ్చరించారు.


పట్టిసీమ ప్రాజెక్టు వీలవుతుందని తాను చెప్పిన విషయాన్ని ఉండవల్లి గుర్తుచేశారు. పట్టిసీమ ప్రాజెక్టుకు ₹ 300 కోట్ల వ్యయం చాలని, అలాంటిది ₹ 1600 కోట్లను నీళ్ళపాలు చేశారని వాపోయారు.  

పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఉండవల్లి అరుణ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో ముఖ్యంగా టీడీపీ శ్రేణుల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ లో తేడా వస్తే రాజమండ్రికి నామరూపాలుండవని ఉండవల్లి చెప్పడం స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన నింపింది. ఉండవల్లి అరుణ కుమార్ పరిశీలన చేయకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడరనేది జన విశ్వాసం. అలాంటి వ్యక్తి పోలవరం ప్రాజెక్ట్ గురించి చెప్పిన మాటల్లో నిజం ఖచ్చితంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరి ఇప్పటికైనా నాలుగు దశాబ్ధాల రాజకీయ అనుభవం ఉందనే చంద్రబాబు గారు ఇప్పటికైనా మేల్కొంటారా? ఉండవల్లి లేవనెత్తిన విషయాలను సమాధానం చెప్పి తన తప్పులను సరిదిద్దుకుంటారా? రాజమండ్రికి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తారా? అనేది ప్రజలకు తెలియటం చాలా అవసరం. అసలు ఉండవల్లి అరుణ కుమార్ చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు నుండి స్పంధన రావటం అత్యంత అవసరం. 

\

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: