ఇదీ.."బాబు మార్క్"...రాజకీయం...!!!

NCR

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయ చతురత అందరికి తెలిసిందే. తనకు ఇష్టమైన వారిని అందలం ఎక్కించటం, అవసరం ఉన్నంత వరకు ఉపయోగించుకుని వారిని మధ్యలోనే వదిలేయడం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. ఒక్కోసారి  చంద్రబాబు రాజకీయ ఎత్తుగడల కోసం  ఇష్టం లేక పోయినా కొంతమందికి పదవులు కట్టబెట్టడం ఆతరువాత వ్యూహాత్మకంగా వారిని  వదిలించుకోవడం, ఇలా  ఎన్నో సందర్భాలలో జరిగిన విషయమే.  దానికి తాజాగా జరిగిన  కిడారి శ్రావణ్  ఎపిసోడ్ నిదర్శనమని అంటున్నారు.

 

వైసిపి ఎమ్మెల్యేగా విజయం సాధించిన కిడారి  శ్రీనివాసరావును చంద్రబాబు టీడీపీలోకి ఆహ్వానించారు ఎందుకంటే.  వైసిపికి పట్టున్న విశాఖ మన్యంలో పాగా వేయాలనేది బాబు ఎత్తుగడ. ఆ తరువాత సర్వేశ్వరరావు మావోయిస్టులు చంపడం, సర్వేశ్వరరావు తనయుడు శ్రావణ్ కి మంత్రి పదవి ఇవ్వడం అంతా చెకచెకా జరిగిపోయాయి. అయితే చట్టసభల్లో సభ్యుడిగా లేని నేత ఆరు నెలల వరకూ మాత్రమే మంత్రిగా కొనసాగే వీలు ఉంటుంది. కానీ చంద్రబాబు ఈ విషయాన్ని ఉద్దేశపూర్వకంగానే విస్మరించారని, కావాలనే శ్రావణ్ ని బాబు వ్యూహాత్మకంగా తప్పించారు అనేది విశ్లేషకులు అభిప్రాయం.

 

ఇదిలాఉంటే ఇందులో వాస్తవం ఎతవరకూ ఉంది, ఇది బాబు పై ఆరోపణలుగా అనుకోవచ్చు కదా అంటే. గతంలో జరిగిన మరొక సంఘటనని కూడా మననం చేసుకోవాలి. టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ కి కూడా బాబు ఇదే రకమైన అభువం చూపించారని చరిత్ర చెప్పిన నిజం అంటున్నారు విశ్లేషకులు. అప్పట్లో హరికృష్ణను తప్పించిన మాదిరిగానే ఇప్పుడు శ్రావణ్ ను కూడా చంద్రబాబు తప్పించేశారని విశ్లేషిస్తున్నారు  రాజకీయ విశ్లేషకులు.

 

అసలు అప్పట్లో ఏమి జరిగింది. 1995లో ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచిన సమయంలో  హరికృష్ణ కూడా బాబు వెంట నడిచారు. ఈ క్రమంలో వాళ్ళని సంతృప్తి పరచడానికి హరికృష్ణ ని తన క్యాబినెట్ లోకి తీసుకున్నారు.  కానీ అప్పటికి హరికృష్ణ చట్ట సభలో సభ్యులు కాదు. ఆరు నెలల్లో ఎలాగైనా సరే చట్టసభల్లోకి తీసుకు వస్తానని హామీ ఇచ్చిన బాబు ఆ విషయాన్ని కావాలనే మరుగున చేయడంతో, హరికృష్ణ రాజీనామా చేయాల్సి వచ్చింది.దాంతో హరికృష్ణ చంద్రబాబు పై కోపంగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత బాబు తన మార్క్ రాజకీయం చూపించి మళ్ళీ శ్రావణ్ పదవికి ఎసరు పెట్టారనేది రాజకీయ పండితుల అభిప్రాయం.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: