జగన్ అవినీతి గురించి టీవీ9 రవిప్రకాశ్‌ వై.ఎస్‌.ను అడిగితే ఏం చెప్పారంటే..?

Chakravarthi Kalyan
రవిప్రకాశ్ టీవీ 9 నుంచి బయటకు వచ్చారు. ఇదే సమయంలో సాక్షి మీడియా ఈ ఇష్యూను బాగా హైలెట్ చేసింది. రవిప్రకాశ్ పై కోపంతోనే సాక్షి టీవీ ఇలా చేసిందని మీడియా వర్గాల్లో చర్చ నడిచింది. అయితే ఇదే సమయంలో టవీ నైన్ రవిప్రకాశ్ ఇంటర్వ్యూలో వైఎస్ జగన్ అవినీతి గురించి చెప్పిన విషయాలు గుర్తుకొస్తున్నాయి. 


2009 ఎన్నికల ముందు వైఎస్సార్ టీవీ9 కు ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎన్‌కౌంటర్ విత్ రవిప్రకాశ్ అనే ఆ ప్రోగ్రామ్‌లో రవిప్రకాశ్ నేరుగా సూటిగా ప్రశ్నలు అడిగారు. కొన్ని ప్రశ్నల తర్వాత జగన్ గురించి అడిగారు. మీ కుమారుడు జగన్ పెట్టిన విద్యుత్ కంపెనీలోకి బినామీల రూపంలో పెట్టుబడులు వచ్చాయని ఆరోపణలున్నాయి. మీరేమంటారు అని రవిప్రకాశ్ అడిగారు. 

దీనికి వైఎస్ సమాధానం ఇస్తూ.. ఈ అంశంపై ఒక రోజంతా అసెంబ్లీలో చర్చించారు. ఆ సండూర్ సంస్థ  2002-04 కల్లా పూర్తయింది. పది రూపాయల షేరును కొందరు 120కో 140 కో కొన్నారు. ఇందులో విచిత్రం ఏముంది.. అది పూర్తిగా ఆ కంపెనీ వ్యవహారం అంటూ సమాధానం చెప్పారు. 
 
అదే సమయంలో వైఎస్ మాట్లాడుతూ.. ఇదే రామోజీరావు తన సంస్థ షేరును పది రూపాయల షేరు 5 లక్షలకు అమ్మితే అది తప్పుగా చంద్రబాబు కనపడలేదా అని వైఎస్ సమాధానం ఇచ్చారు. ఈ అంశంపై చంద్రబాబు గత ఏడాది ఆరోపణ చేశారు. మరి అప్పటి నుంచి కేసు ఎందుకు పెట్టలేదు అని ప్రశ్నించారు వైఎస్. 

ఇదే సమయంలో జగన్ ఆదాయపన్ను రిటర్న్స్ లో చూపించని ఆస్తులు కలిగి ఉన్నారని.. సాక్షిలోకి ఫెమా నిబంధనలు ఉల్లంఘించి పెట్టుబడులు వచ్చాయని ఆరోపణలున్నాయి కదా మీ సమాధానం ఏంటి అని రవిప్రకాశ్ వైఎస్‌ను ప్రశ్నించారు. దీనికి వైఎస్ సమాధానం చెబుతూ.. జగన్ వ్యాపారాలు జగన్ వి. వాటిలో తప్పులుంటే చట్టపరంగా చర్య తీసుకోండి.. ఎవరు కాదన్నారు.. అంటూ ఎదురుప్రశ్న వేశారు వైఎస్‌ఆర్. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: