నిలువెత్తు స్వార్ధం మూర్తీభవించి-నమ్మకద్రోహానికి చిరునామా బాబు! గుర్తించిన భారత రాజకీయ పార్టీలు

ఒకవైపు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడేమో అచ్చం కాంగ్రెస్ నేతలా మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వీరవిధేయుడిలా ఛంద్ర బాబు మట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రధాని నరేంద్ర మోడీ ఏమైనా అంటే చంద్రబాబు నాయుడే ప్రధానంగా సహించలేకపోతూ ఉన్నారు. రాజును మించిన రజ భక్తి ప్రదర్శించే బానిసత్వం కనిపిస్తుంది అందులో. అందుకే అతి వినయం ధూర్త లక్షణం అంటారు. నరేంద్ర మోడీ విమర్శించింది తెలుగుదేశం పార్టీని కాదు. ఏ పార్టీపై వ్యతిరేఖత అనే పునాదులపై జన్మించిందో అదే కాంగ్రెస్ ను నేడు మోడీ విమర్శిస్తుంటే ఆనందించక శత్రువును ఆరాధించతం మొదలెట్టి మూలాలకే చెదలు పట్టించారు చంద్రబాబు. 

అయినా చంద్రబాబు మోడీ మీద తీవ్రంగా విరుచుకుపడుతూ ఉన్నారు. 'దశాబ్దాల కిందటే చనిపోయిన రాజీవ్ గాందీని నరేంద్ర మోడీ ఎలా విమర్శిస్తారు?' అని చంద్ర బాబు ప్రశ్నించేయడం పెద్ద విడ్డూరం కాక ఏమౌతుంది? ఎందుకంటే మొన్నటి వరకూ చంద్రబాబు  'కాంగ్రెస్ పై పోరాడా? ఇందిరాగాంధీ పై పోరాడా? రాజీవ్ గాందీ పై పోరాడా?  సోనియా గాంధి ఒక రాక్షసి-ఒక విదేశీ శక్తి అనే వారు కాదా?” ఇప్పుడేమో 'రాజీవ్ గాంధీని నరేంద్ర మోడీ ఎలా విమర్శిస్తారు?' అంటూ నరేంద్ర మోడీని కాంగ్రెస్ కంటే ముందుగానే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇలా చంద్రబాబు కాంగ్రెస్ మీద ప్రేమ ఆప్యాయతలను చూపిస్తూ ఉంటే కాంగ్రెస్ వాళ్లేమో వైఎస్ జగన్మోహనరెడ్డి మీద ప్రేమ వ్యక్తీ కరణ చేసేస్తూ ఉన్నారు! అంతా ఆర్టిఫీషియల్ గా లేదా? కడుపులో తెమిలినట్లు ఉందంటున్నారు ఆయన చరిత్ర తెలిసిన కాంగ్రెస్ వాదులు. 

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వైఎస్ జగన్ కు చేరువలోకి వెళ్లిందని జగన్ దగ్గరకు తన దూతలను కూడా పంపిందని ‘జాత్రీయ మీడియా’ కోడై కూస్తోంది. డానికి జగన్మోహనరెడ్డి సమాధానంగా ఒక మాట చెప్పారని, 'ఫలితాలు వెల్లడి అయిన తర్వాత చూసుకుందాం' అని జగన్ ఒక మాటమీదే నిలబడ్డాడని అత్యంత విశ్వాసం ప్రదర్శించాయి అని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. అయినా జగన్ మీద కాంగ్రెస్ పార్టీ తమ స్నేహాన్ని ప్రకటిస్తున్నాయి. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ నేతలు వైసిపితో స్నేహ వారధి నిర్మించే పని మొదలెట్టారు.

 'జగన్ మా వాడే.. మా కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు..' అంటూ పాత చుట్టరికం కలుపుతూ తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ వ్యాఖ్యానించారు.
జగన్మొహనరెడ్డిని పొగడటమే కాదు చంద్రబాబును విమర్శించడానికి కూడా చింతా మోహన్ వెనుకాడ లేదు. చంద్రబాబును అవకాశవాదిగా అభివర్ణించారాయన. మరి ఈ మాటలను వింటుంటే కాంగ్రెస్ వాళ్లు “యూటర్న్ బాబు” విషయంలో “యూటర్న్” తీసుకున్నారన్నట్లే ఉంది.  అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. 

నరేంద్ర మోడీ రాజీవ్ గాంధిని విమర్శించినందుకు కాదు గాని చంద్రబాబు ఆ మిషతో నరేంద్ర మోడీని తిట్టటం సోనియాకు మనసులో ఎక్కడో కలుక్కు మన్నట్లు ఉంది. అందుకే ఆమె హృదయ స్పందనకు చింతా మోహన్ మాటల్లో ప్రతిద్వనించింది. 

తెలుగుదేశం అధినేత చంద్రాబును బీఎస్పీ అధినేత మాయవతి టీఎంసీ అధినేత మమతా బెనర్జీలు నమ్మడం లేదనే టాక్ మొదలైంది. చంద్రబాబు నాయుడు పక్కా కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ లా వ్యవహరిస్తూ ఉన్నాడని వారు అనుమానిస్తూ ఉన్నారట. అందుకే బాబు బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ అంటూ చేస్తున్న హడావుడికి వారు దూరం అవుతున్నారని భోగట్టా! ఇప్పుడు జాతీయ స్తాయిలో ఈ మాట వినిపిస్తూ ఉంది. కొన్నాళ్ల కిందట చంద్రాబు నాయుడు మాట్లాడుతూ, ఫలితాలకు ముందే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో బీజేపీ వ్యతిరేక కూటమి పార్టీలు సమావేశాన్ని నిర్వహిస్తాయని ప్రకటించారు. మే 21ని అందుకు మూహర్తంగా బాబు ప్రకటించారు. అయితే ఆ సమావేశం ఇప్పుడు పూర్తిగా రద్దు అయినట్టుగా సమాచారం. చంద్రబాబును మాయవతి మమత బెనర్జీ అఖిలేష్ యాదవ్ లు నమ్మకపోవడమే అందుకు కారణం అని సమాచారం! ఫలితాలకు ముందే అలా మీటింగ్ ఏర్పాటు చేసి రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలనేది చంద్రబాబు ప్లాన్ అని మాయ-మమతలు-అఖిలెష్ పసిగట్టినట్టుగా సమాచారం.

చంద్రబాబు వలలో చిక్కుకోడం ఇష్టం లేక వారు, ఆ సమావేశానికి డుమ్మా కొట్టేశారని తెలుస్తోంది. ఒక ప్రాంతీయ పార్టీ అదీ కాంగ్రెస్ వ్యతిరేఖతే పునాదిగా ఏర్పడ్డ తెలుగుదేశం అధినేత గత కొన్నాళ్లుగా పూర్తిగా కాంగ్రెస్ విధేయుడిగా మారిపోవటం, తరచూ రాహుల్ గాంధిని కలుస్తూ భజన చేయటం వారికి రుచించలేదు.  చంద్రబాబు పూర్తి కాంగ్రస్ వ్యక్తిగా పని చేస్తున్నాడని రాహుల్ గాంధిని బిజేపి వ్యతిరేఖ ఫ్రొంట్ భుజస్కంధాల మీద పెట్టటానికి చంద్ర బాబు ప్రయత్నిస్తున్నాడని అర్థం చేసుకున్న మాయ-అఖిలేష్-మమతలు ఆ సమావేశానికి అయిష్టతను ప్రదర్శించారని - దీనివలన ఫలితాలకు ముందు "బీజేపీ వ్యతిరేఖ ఫ్రంట్ మీటింగ్" అనేది ఏదీ ఉండదని స్పష్టంగా తెలుస్తుందని జాతీయ రాజకీయ పరిశీలకులు అంటున్నారు. దీంతో మమత మాయ, కేసీఆర్-జగన్ వైపు దృష్టి మరల్చారని రాజధాని వార్తలు. అంటే చంద్ర బాబు అటు కాంగ్రెస్ కు ఇటు బిజేపికి రెంటికి చెడ్డ రేవడిలా మిగిలిపోయారని జాతీయ రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: