ఎన్నికల సంఘం పనితీరుకు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసలు

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జవహర్లాల్ నెహౄ, ఇందిర గాంధి, రాజీవ్ గాంధి మరియు రాహుల్ గాంధి తో నాలుగు తరాల రాజకీయ వ్యక్తిగత అనుబంధం ఉంది.  నాలుగు తరాల రాజకీయాలను ఔపాసన పట్టిన రాజకీయ భీష్ముడు ప్రణబ్. మన తరంలో ఇంతటి రాజకీయ విఙ్జులు మరోకరు లభించుట దుర్లభమే. ప్రస్తుత భారత రాజకీయాల్లో అగ్రగణ్యుడని చెప్పవచ్చు. 
 
భారత ఎన్నికల సంఘం(ఈసీ) పై ఈ మాజీ రాష్ట్రపతి ప్రశంసలు కురిపించారు. జరిగిన సార్వత్రిక ఎన్నికల నిర్వహణ పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం పనితీరు పట్ల ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రాజకీయ భీష్ముడు అనతగ్గ  ప్రణబ్‌ ముఖర్జీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. న్యూఢిల్లీలో సోమవారం జరిగిన ఒక పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న ఆయన ఎన్నికల సంఘం పనితీరుపై మాట్లాడారు. 

దేశంలోని సంస్థలన్నింటినీ మరింత బలోపేతం చేయాలంటే అవన్నీ సక్రమంగా పనిచేసే అవకాశం కల్పించాలి. ఎన్నికలు నిర్వహణ సక్రమంగా జరిగింది  అని ప్రణబ్‌ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. అనేక ఏళ్ల కృషితో నిర్మించుకున్న వ్యవస్థలు, సంస్థలు సక్రమంగానే పనిచేస్తున్నాయని అన్నారు. వాటిని ఉపయోగించు కోవడంలోనే మన సమర్థత దాగి ఉందని హితవు పలికారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రజలు రికార్డు స్థాయిలో పోలింగ్‌ లో పాల్గొనడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. 


ప్రతిపక్షాలన్నీ భారత ప్రధాని నరేంద్ర మోడీపై గంపగుత్తగా కలిసి వ్యవస్థలను భ్రష్టు పట్టించారని అనటంలో ఏమాత్రం నిజం లేదని ప్రణబ్ ముఖర్జీ మాటలను బట్టి అనుకోవచ్చు. ముఖ్యంగా ఏపి ముఖ్యమంత్రి టిడిపి అధ్యక్షుడు నారా చాంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ పాలనలో వ్యవస్థలు భ్రస్టుపట్తిస్తున్నాడని చెప్పే వ్యాఖ్యల లోని నిబద్ధత ప్రశ్నార్ధక మౌతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: