"ఓటేసిన వేటు దెబ్బ" చంద్రబాబుకు తెలిసే సుదినం రేపే! దిమ్మతిరిగి బొమ్మ కనిపించేనా!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ఓట్ల కౌంటింగ్ ఇంకా రెండురోజులు ఉందనగా కూడా డబుల్ టంగ్డ్  టాక్ ఆపడం లేదు. వందకు వెయ్యిశాతం గెలుస్తామని ఆయన చెబుతున్నారు. మరో వైపు ఈవిఎం ల విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వివిపాట్ స్లిప్పుల లెక్కింపుపై సుప్రింకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఏభై శాతం వివిపాట్ స్లిప్పుల లెక్కించాలని అంటున్నారు. దానిపై డిల్లీ వీధుల్లో ఉద్యమాలు నడిపారు. అంతేకాక, వివిపాట్ స్లిప్పులలను ఓటర్ చేతికి ఇవ్వాలని కొత్త ప్రచారం ఆరంబించారు.

చంద్రబాబు వాదన ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఉంటే ఎవరికీ అభ్యంతరం లేదు. కాని ఆయన అదికారంలో ఉంటే ఒక రకం, ఆయన అదికారంలో లేకుంటే మరో రకం అన్న విధంగా వ్యవహరించడమే ప్రజలకు అనునిత్యం చికాకు కలిగిస్తోంది.కాంగ్రెస్ ను అత్యంత అసహ్యంగా దాని చైర్-పర్సన్ సోనియాని అభ్యంతరకరంగా అధ్యక్షుడు రాహుల్ గాంధిని హీనాతిహీన పదజాలంతో బండబూతులు తిట్టిన చంద్రబాబు, ఇప్పుడు వారి చరణమే తరుణోపాయం అన్న చందంగా వారి వద్దకు వెళ్లడానికి నానాపాట్లు పడుతుననారు. ఉత్తరాది,దక్షిణాది రాష్ట్రాలు అంటూ గతంలో ఎన్నో గొడవలు చేసిన చంద్రబాబు ఇప్పుడు డిల్లీలోను, లక్నోలోను ఉత్తరాది నేతలతో మంతనాలు జరుపుతూ వారి మద్దతు కోసం అర్రులు చాస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని 2014 ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన ఏమన్నారో తెలుసా? ఎక్జిట్-పోల్స్ దేశం మూడ్ ను తెలియ చేస్తాయని, కాంగ్రెస్ ను క్విట్ ఇండియా అని వ్యాఖ్యానించారు. 

ఇటలీలో పుట్టిన సోనియా గాందీని ఆయన పరోక్షంగా భారత్ వదలిపొమ్మని, ఆమె విదేశీయురాలు అని కూడా చెప్పారు. అంతేకాదు రాష్ట్రవిభజన సమయంలో ఆయన కూడా దానికి అంగీకరిస్తూ లేఖ ఇచ్చినా, పార్లమెంటులో తెలంగాణ టిడిపి ఎంపీలు మద్దతు ఇచ్చినా, సోనియా గాంధీ ఆంద్రుల పొట్టకొట్టిందని, ఆమెను ఇటలీ మాఫియా అని కూడా విమర్శించారు. ఇప్పుడు సోనియా గాందీ అప్పాయింట్మెంట్ ఇస్తే చాలు వాళ్ల తరపున సేవ చేసుకోవడానికి సిద్దం అన్నట్లుగా ఆయన మాట్లాడితే డిల్లీ వెళ్లి రాహుల్ గాందీని కలుస్తున్నారు.

ఎక్జిట్-పోల్స్ లో కాంగ్రెస్ నాయకత్వంలోని యుపిఎకి 'అంత దృశ్యం' లేదని ఫలితాలు రావడంతో చంద్రబాబు దాదాపు జావకారిపోయారు. కాకుంటే ఆయన ఇంకా చాలా హడావుడి చేసి ఉండేవారని పలువురు ఆయన స్వభావం తెలిసిన వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఎక్జిట్-పోల్ పలితాలతో నిస్తేజానికి గురైన బీఎస్ పి అదినేత్రి మాయావతి కూడా సోనియా గాందీని కలిసి ఇప్పుడు లాభంలేదని ఎన్నికల ఫలితాల తర్వాతనే ఆవిషయాలు చూద్దామని అంటూ చంద్రబాబు సోనియాతో ఏర్పాటు చేసిన భేటీని రద్ధు చేసుకున్నారు. డిఎమ్ కే అదినేత స్టాలిన్ అసలు 23న ప్రతిపక్షాల సమావేశం అవసరమే లేదని కొత్త ట్విస్ట్ ఇచ్చారు.

ఇవన్ని జాతీయ రాజకీయాలలో శరవేగంగా మారుతున్న పరిణామాలు. చంద్రబాబు కాస్త ఒక పది లోక్-సభ సీట్లు రాబట్తుకుంటే తప్ప ఆయనకు కూసింత విలువ కూడా ఉండదు. పది లోపు సీట్లలో గెలిస్తే ఆయనను డిల్లీలో కూడా ఏవరూ పట్టించుకునే వారు ఉండరు.అందుకే ఎన్నికల ఫలితాలు రావడానికి ముందే యుపిఎ లో ఏదో కన్వీనర్ పదవి అన్నా తీసుకోవడానికి ఆయన తీవ్ర రాజకీయ ప్రయత్నాలు కొనసాగించినట్లు తెలుస్తుంది. 

అయితే తాడిని తన్నే వాడి తల తన్నగలిగే ఉత్తర భారత రాజనీతిఙ్జుల వద్ద చంద్రబాబు శకుని రాజకీయాలు కుదిరేలా కనిపించక పోవడంతో మళ్లీ ఈవిఎమ్ లు, వివిపాట్ స్లిప్పులు అంటూ మొదటి గొడవకే తన ఓటేశారు. ఇప్పుడు ఆయన అనుకున్నట్లు రాజకీయాలు జరగవని తెలిసినా చంద్రబాబు ఎందుకు ఇంత రభస  చేస్తున్నారంటే-రేపు ఓటమి ఎదురైతే ఆనెపం అంతా ఈవిఎంస్, వివిపాట్స్ మీదకు నెట్టే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది. అంతకు మించి వేరేకారణం కనిపించడం లేదు. 

తాజెడ్డ కోతి వనమెల్ల చెరచు అన్నట్లు చంద్రబాబు దేబ్బకు ఎఐసిసి అదినేత రాహుల్ గాందీ కూడా ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు చేస్తూ ఈవిఎంస్ మానిప్యులేట్ అవుతున్నాయని అనుమానం వ్యక్తంచేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కూడా ఎక్జిట్-పోల్స్ అన్నీ ఈవిఎంస్ టాంపరింగ్ కోసమేనని ఆరోపించారు. మరి అదే జరిగితే ఆమె శాసనసభ ఎన్నికలలో రెండోసారి కూడా ఎలా గెలిచారో చెప్పవలసి ఉంటుంది కదా!

అలాగే మద్యప్రదేశ్, రాజస్తాన్, పంజాబ్,చత్తీసుగడ్ వంటి రాష్ట్రాలలో బీజేపిని ఓడించి కాంగ్రెస్ ఎలా అదికారంలోకి వచ్చిందో రాహుల్ గాంధి వివరించాలి కదా! మరిక్కడ కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలను టాంపరింగ్ చేసే అక్కడ గెలిచిందా? బాబు ఏది మాట్లాడితే దానికి మద్దతు ఇచ్చి, ఇతర పక్షాలనేతలు ప్రస్తుతం పరువు పోగొట్టుకుంటున్నారు.  ఇలా తన అవసరం కోసం నానా గడ్డి తినే రాజకీయ నాయకుడైన చంద్రబాబుపై శివసేన పత్రిక "సామ్నా"  విరుచుకుపడింది.

ఎక్జిట్-పోల్స్ తనకు అనుకూలంగా వచ్చిన 2014 లో చంద్రబాబు ఎక్జిట్-పోల్స్ ను పబ్లిక్ పల్స్ అని అన్నారు. 2019 లో అంటే ఇప్పుడు తనకు వ్యతిరేకంగా ఎక్జిట్-పోల్స్ ఫలితాలను  నమ్మవద్దని ప్రజలకు కబుర్ల కాకరకాయలు వల్లిస్తున్నారు. ఈ డబుల్ స్టాండర్డ్ టాక్ ను ఆయన ఎప్పటికీ మానుకోరని ఆయనకు ప్రజలు ఎప్పటికి పిచ్చివాళ్లు గా, వెర్రి వెంగళప్పలుగా కనిపిస్తూ ఉంటారని ఆయన భావనగా విశ్లేషకులు చెపుతూ ఉంటారు. కాని ప్రజలకు తెలివితేటలు ఉండి సమయం వచ్చాక మాత్రమే తెలివి ఉపయోగించి సరిగ్గా సరైన తరుణంలో ఓటేసి వేటేస్తారని ఆయన గమనించాలని ఏపి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: