బ్రేకింగ్‌: ఓటమి బాట‌లో 10 మంది ఏపీ మంత్రులు

VUYYURU SUBHASH
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రులకు ఊహించని షాక్‌ తగిలింది. తొలి రౌండ్‌ కౌంటింగ్ నుంచే 10 మంది మంత్రులు వెనుకంజ‌లో ఉన్నారు. మంత్రులు సోమిరెడ్డి, అచ్చెన్నాయుడు, నారాయణలు వెనుకంజలో పడ్డారు. నెల్లూరు సిటీలో మంత్రి నారాయణపై వైసీపీ అభ్యర్థి అనిల్‌కుమార్‌ యాదవ్‌ 1814 ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. సర్వేపల్లిలో సోమిరెడ్డి వెనుకంజలో ఉన్నారు. సోమిరెడ్డిపై వైసీపీ కాంగ్రెస్‌ అభ్యర్థి కాకాణి గోవర్ధర్‌ రెడ్డి 1750 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక అచ్చెన్నాయుడిపై వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరాడ తిలక్ 4 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.


ఇక ఎచ్చెర్ల‌లో మంత్రి క‌ళా వెంక‌ట్రావుపై వైసీపీ అభ్య‌ర్థి గొర్లె కిర‌ణ్‌కుమార్‌, న‌ర్సీప‌ట్నంలో మ‌రో మంత్రి చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడిపై వైసీపీ అభ్య‌ర్థి పెట్ల ఉమాశంక‌ర్ గ‌ణేష్ లీడ్‌లో ఉన్నారు. ఇక పెద్దాపురంలో హోం మంత్రి నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప ఊగిస‌లాట‌లో ఉన్నారు. మంగ‌ళ‌గిరిలో సాక్షాత్తూ చంద్ర‌బాబు త‌న‌యుడు, మంత్రి నారా లోకేష్ వెయ్యి ఓట్ల వెనుకంజ‌లో ఉన్నారు. గుంటూరు జిల్లాలో వేమూరులో మంత్రి న‌క్కా ఆనంద్‌బాబు వెన‌కే ఉన్నారు.


చిల‌క‌లూరిపేట‌లో మాత్రం మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు వెయ్యి ఓట్ల లీడ్‌లో ఉన్నారు. ఇక నెల్లూరులో ఇద్ద‌రు మంత్రులు సోమిరెడ్డి, నారాయ‌ణ మూడు వేల ఓట్ల వెన‌కంజ‌లో ఉన్నారు. ఇక క‌డ‌ప ఎంపీగా పోటీ చేసిన మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి భారీ ఓట్ల తేడాతో ఓడిపోనున్నారు. ఇక ఆళ్ల‌గ‌డ్డ‌లో మంత్రి అఖిల‌ప్రియ ఓట‌మి బాట‌లోనే ఉన్నారు. మైల‌వ‌రంలో మంత్రి దేవినేని కేవ‌లం 300 ఓట్ల ముందులో ఉన్నా అది కంటిన్యూ అయ్యే ఛాన్స్ లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: