జగన్‌ గెలుపు నేపథ్యంలో.. లగడపాటి సంచలన ప్రకటన..!

Chakravarthi Kalyan
లగడపాటి రాజగోపాల్‌ ఎక్కడ.. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఈ అంశంపై ఎన్నో జోకులు పేలాయి.. లగడపాటిని బెట్టింగ్ రాయుళ్లు కిడ్నాప్ చేస్తున్నట్టు బొమ్మలు సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. 


ఏపీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ముందు వరుసగా రెండు రోజుల లగడపాటి మీడియాలో హల్ చల్ చేశారు. తెలంగాణలోకారు.. ఏపీలో సైకిల్ జోరు తప్పదన్నారు. తెలుగుదేశానికి కనీసం 100 స్థానాలు వస్తాయని చెప్పారు. 

అయితే.. ఆరు నెలల క్రితం తెలంగాణ ఎన్నికల సమయంలోనూ లగడపాటి ఇలాగే చెప్పారు. కానీ ఆయన జోస్యం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అయినా సరే చాలా మంది ఏపీ ఎన్నికల సమయంలో లగడపాటి వైపు చూశారు. ఈసారేం చెబుతాడో అని ఉత్కంఠగా ఎదురు చూశారు. 

ఏపీలో సైకిల్ వస్తుందన్న లగడపాటి తన సర్వే తప్పయితే ఇక సర్వేలు చేయబోనని తేల్చి చెప్పారు. ఆయన జోస్యం వరుసగా రెండోసారి ఘోరంగా విఫలమైన నేపథ్యంలో ఇప్పుడు ఆయన సర్వేల సన్యాసం ప్రకటించారు. ఇక సర్వేలు చేయబోనంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: