తెదేపా పతనానికి నాడే పడ్డ పునాదులు - ఇక జగన్ జనం నమ్మకం నిలుపుతారనే నమ్ముదాం!

తెలుగుదేశం పార్టీకి 2014 లో ప్రజలు ఓటేసి గెలిపించిన కారణం తమ ప్రాధమిక ఆసలను నెరవేర్చమని. అవే ప్రత్యేక హోదా, పోలవరం ప్రోజెక్ట్ పూర్తి చేయటం, హైదరాబాద్ నగరాన్ని ఉమ్మడి రాజధానిగా ఉపయోగించుకుంటూ ఒక పదేళ్ళ కాలంలో క్రమంగా విశ్వనగరం అమరావతిని నిర్మించటం. దీనికి అనుభవఙ్జుడైన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలని టిడిపిని గెలిపించారు దానికి కేంద్ర సహాకారం ఉండటం అవసరమని, అలగే అలసత్వం ఏర్పడితే దాన్ని నివారించ టానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ అటు కేంద్రాన్ని ఇటు రాష్ట్రాన్ని ప్రశ్నించగలడని ప్రజలు భావించి 'టిడిపి-బిజేపి-జనసేన’ మైత్రిని అంగీకరించారు వారిని గెలిపించారు.


అంతేకాదు మీకు చేతకాకపోతే వైఎస్ జగన్మోహనరెడ్డి నాయకత్వంలోని వైసిపికి కూడా అద్భుతంగా ఓట్లువేసి ఒక్క శాతం ఓట్ల తేడాతో బలమైన ప్రతిపక్షంగా నిలిపారు. ప్రజల దూరదృష్టిని ప్రాప్తకాలఙ్జతను ఎవరూ గుర్తించలేదు. జగన్ ఓడిపోయాడని నేరస్తుడని జైలుకు వెళ్ళాడని ఇలా చెపుతూ వైసిపీ ఎమెల్యేల పై పాపపు చూపుతో వాళ్ళను కబళించే పనిలో పడిన టిడిపి నాయకత్వాన్ని కూడా ప్రజలు గమనించలేదను కోవటాన్ని మించిన దుర్మార్గం మరొకటిలేదు. ప్రత్యేక హోదా సాధన, పోలవరం నిర్మాణం, అమరావతి నిర్మాణం చేయమని టిడిపి-బిజేపిని గెలిపిస్తే చంద్రబాబు చేసిన పని వైసీపి ఎమెల్యేలను ఎంపీ లను కబళించటంలో మునిగిపోయిన టిడిపి తన దురాశ, తొందర పాటు చర్యలయో తెలంగాణాలో టీఅరెస్ శాసనమండలి సభ్యుణ్ణి తస్కరించటానికి చేసిన దురాగతం నయవంచన ఓటుకు నోటు కేసు గా రూపుదిద్దుకోగా ఉన్నది ఉంచుకున్నది పోయినట్టు హైదరాబాద్ ఉమ్మది రాజధాని ప్రయోజనం పోగొట్టేశారు చంద్రబాబు. ఆనాడే ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలు చంద్రబాబులోని అనైతికత, అనైతికత, రాజకీయకుట్రను గుర్తించారు.


అందుకే అవకాశం వచ్చినప్పుడల్లా టిడిపిని ఓడిస్తూ వచ్చారు. అలాగే టిడిపి మిత్రుల్ని చాకిరేవులో కలిపి ఉతికేశారు. తెలంగాణా శాసనసభలో మహాకూటమి పేరుతో పోటీచేసిన అందరిని చంద్రబాబుతో స్నేహం కారణంగా చావ చితగ్గొట్టేశారు. అప్పుడైనా చంద్రబాబు జాగ్రత్త పడి ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమపాలన అన్నారే తప్ప అభివృద్ధి పాలన చేయలేదు. కొత్త రాష్ట్రం కోరేది పొరుగువారితో సమానంగా ఎదగటం. కాని అది జరగలేదు సరికదా సంక్షేమ ఫలాలు తెలుగుదేశం కార్యకర్తలకు జన్మభూమి, డొక్రా మహిళలు, అన్నదాతలు అంటూ మొత్తం సంక్షేమ ఫలాలు టిడిపి వారికే అందజేశారు. అందుకే టిడిపి యేతరులు, తటస్థులు, రాష్ట్ర అభివృద్దిలో పాలు పంచుకున్నా ప్రయోజనాలు అందని ప్రజలు, కేంద్రం ఇచ్చిన పదిశాతం రిజర్వేషణ్లను సగం కాపులకు పంచటంతో అటు అగ్రవర్ణాలు, మాకు మాకు తగాదా పెడతావా? అంటూ అప్పటికే చంద్రబాబు చేతిలో మోస పోయిన కాపులు, వెనుకబడిన తరగతులవారు, ఎవరైనా ఎస్సీలు ఎస్టీలుగా పట్టలని అనుకుంటారా? అన్న నేరానికి వారు ఒకరొక్కరు కులాలవారిన చంద్రబాబుకు దూరం జరిగారు.


దీనికి తోడు శాసనసభ నుండి జగన్ మరియు ఆయనతో కూడిన ప్రతిపక్షాన్ని గెంటేసిన పనిలో చంద్రబాబు కోడెల శివప్రసాదు లు కోల్పోయిన పరువు ప్రతిష్ఠలు గౌరవం తిరిగి సంపాదించు కోలేరు అనేది నూరుపాళ్ళు యధార్ధం. శాసనసభనుండి ఎమెల్యే రోజాను తరిమేసిన తీరు దయనీయం. టిడిపి ఎమెల్యేలు సైతం బూతులు తిట్టటంలో రోజాకు తీసిపోలేదు. వారిలో ఒక్కరిని శాసనసభ నుండి బయటకు పంపిన మహిళాసాధికారతకు గౌరవం దక్కేది.


ఓటుకు నోటు వ్యవహారంలో నేఱం చంద్రబాబుది కాని దానికి ఫలితంగా ఆయన వదిలేసిన పదేళ్ళ ఉమ్మడి  రాజధాని ప్రయో జనం కోల్పోయి ప్రత్యక్షంగా బలైంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. దీంట్లో చంద్రబాబు చేసిన ద్రోహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళ కుండా దాచిపెట్టిన టిడిపి మద్దతు మీడియా ఏనాటికి క్షమార్హం కాదు.


అలాగే అమరావతి శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, రాజధాని ఆకృతులకోసం 'చంద్రబాబు అండ్ కో తిరిగిన దేశాల సంఖ్య అంతా ఇంతాకాదు. ఈ దుబారా విలువతో చత్తీసగడ్ రాజధాని "రాయపూర్" అంత రాజధాని నిర్మించుకొని హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా వాడుతూ పదేళ్లలో అమరావతే కాదు దాని మొగుడంతటి రాజధాని నిర్మించుకోవచ్చు. ఇంకా పోలవరం పబ్లిసిటీ కోసం జనాన్ని తరలించిన ఖర్చు వందల కోట్లు దీనికి కలుపుకోవచ్చు.


పోలవరం జాతీయ ప్రోజెక్టును రాష్ట్రం చేతుల్లోకి గుత్తేదార్ల ప్రయోజనాలు కమీషన్లు దండుకోవటానికి వాడేసు కోవటంతో పోలవరం అవినీతికి ఆలవాలం అయిందని ప్రభుత్వపెద్దలకు ఏటీఎం అయినదని సాక్షాత్తు ప్రధానే చెప్పేశారు. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాన్ పత్తా లేకుండా వైసిపి సుమామీలో ఎక్కడికి కొట్టుకు పోయాడో తెలియదు ఎన్నికల్లో పోటీ చేసి వైసిపికి కీడు చెయ్యబోయి - టిడిపి ఓట్లు చీల్చేసి తాను త్రవ్వుకున్న టిడిపి గోతిలో తానేపడ్దాడు.


ఇకపోతే ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి చంద్రబాబు మాయమాటలు నమ్మి ప్రత్యేక పాకేజీ ఇవ్వటానికి అంగీకరించి - వాళ్ళ మద్య విభేదాలు వచ్చి -అదీ ఇవ్వకపోవటం తో నరేంద్ర మోదీ నాయకత్వంలోని బిజేపీపై చంద్రబాబు చేసిన దుష్ప్రచారంతో వైసిపి సునామిలో బీజేపి కూడా కొట్టుకుపోయింది.


ఇన్నిపాపాల భైరవుడైన టిడిపి అధినేతకు ఉన్న మొదటి పిచ్చి కుటుంబం - అదే లోకెష్ కు ఎమెల్సీ దొడ్ది దారిలో మంత్రిపదవి కోసం చంద్రబాబు తొక్కని అడ్దదారి లేదు. రెండో పిచ్చి బంధువులు - చివరకు వినోదపన్ను రద్ధు కూడా బామ్మర్ది బాలకృష్ణ చిత్రానికే. ఇక కాంట్రాక్టులు, ప్రభుత్వం నుండి లభించే ప్రయోజనాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిశ్రమలు చివరకు రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులన్ని తమ సామాజికవర్గం వారికే. ఈ పాపాలన్ని కప్పెటేసి జనాలకు నిజం దాయటానికి తమ స్వకుల మీడియా ఉండనే ఉంది. అయితే నిజాన్ని దాచటం నివురుకు ఎప్పుడూ సాధ్యం కాదు కదా!


అందుకే శాసనసభ నుండి బయటకు పోయేలా చేసిన వైఎస్ జగన్మోహనరెడ్డి జనంలోకే వెళ్ళిపోయాడు. సర్వం ప్రభుత్వ కిరాతకాలు శాసనసభలో కాకుండా ఆ శాసనసభ ఎవరికోసమో వారికే మనవి చేస్తూ వచ్చాడు. ఇంకేం ఏపి జనం తమకు మేలుచేయగలరన్న నమ్మకంతో జగన్ ను గెలిపించేశారు. అనుభవం కంటే ఆచరిచటం చాలా గొప్పదని వాళ్లు నమ్మారు అదే చేసి చూపారు. ఇక బాల్ జగన్ కోర్టులో పడింది. మరి గరుడ శివాజి, టివి 9 రవిప్రకాష్, ఐటీ గ్రిడ్స్ అశోక్ లాంటి నేరగాళ్ల నివాసం ఎక్కడ? చంద్రబాబు గారు! 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: