గెలిస్తే మా నాన్న మహిమ...ఓడితే కార్యకర్తల చేతగాని తనం...అనే లోకేశుని రాజకీయ అఙ్జానం

తొలి నుంచీ ఎన్నికల ఘోర పరిచయ భారం ఎవరిపై నెట్టాలనే విషయంలో మాట్లాడిన మాతలు చేసిన వ్యాఖ్యలు ఏపి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుణ్ణి ఒకరకంగా ప్రజల్లో పలుచన చేసింది. మొత్తం మీద ఎన్నివేషాలు వేసినా 1000% గెలుపు మాదేనని ఊహకందని ప్రచారం చేసుకున్నా, తాజా ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్న టీడీపీ, ఆ తరవాత ఆ పార్టీ నాయకులు ఓటమి బాధ్యతను తాము తీసుకోకుండా, వేరే వారిపై, లేకపోతే ఈవీఎంలపై తోసేయకుండా పునరాలోచన చేయాలని వైసీపి అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి హితవు పలికారు. 

2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కార్యకర్తలు, క్రింది స్థాయి నేతలదే బాధ్యత అని మాజీ ముఖ్యమంత్రి తనయుడు మాజీ మంత్రి లోకేశ్‌ నారా వ్యాఖ్యానించడంపై ఆయన విమర్శల వర్షం కురిపించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తే అది నారా చంద్రబాబు నాయుడి గెలుపు అని చెప్పుకున్న వాళ్ళు 2019లో ఓడిపోతే కార్యకర్తలు, క్రింది స్థాయి నేతలే కారణమని చెప్పడం లోకేశ్‌ కే చెల్లిందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా వారికి ఙ్జానోదయం కాకపోవటం వారి మరింత పతనానికే నాంది పలికింది. 2009 ఎన్నికల సందర్భంగా విజయమైనా, ఓటమైనా తనదే బాధ్యతని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రకటించారని గుర్తుచేశారు. లోకేశ్‌, చంద్రబాబు పిరికిపంద లని అన్నారు. వైసీపి రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

విశ్వనగరం అంటూ అద్భుతమైన రాజధాని నిర్మిస్తున్నామని ప్రకటించిన అదే అమరావతి నడిబొడ్డున టిడిపికి, చంద్రబాబుకు, లోకెషుకు ప్రజలు తమ ఓట్లతో తగిన బుద్ధి చెప్పారని అన్నారు. 

*ఏం పని చేసినా, చివరికి ప్రజల సౌకర్యార్థం రోడ్డువేసినా తామే చేశామని, 
*పెన్షన్‌ ఇచ్చినా తామే ఇచ్చామని  
*విద్యుత్  సౌకర్యం ఏర్పాటు చేసినా అదనతా తమ సొమ్ముతో చేసిన అహంకారపూరిత ధోరణితో మాట్లాడిన టీడీపీ నేతలకు ప్రజలు తగినశాస్తి చేశారని పేర్కొన్నారు. 
*ఎన్టీఆర్‌ యుగపురుషుడు అని చెప్పిన చంద్రబాబు చివరకి ఆయనకే వెన్నుపోటు పొడిచారని

ఇవన్నీ ప్రజలు మరచిపోతారనకుంటే అది వారి పొరపాటే అవుతుందని పార్థసారథి వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా హైద్రాబాద్‌ లోని ఎన్టీఆర్‌ సమాధిని అలంకరించలేని దయనీయ పరిస్దితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

"వైసీపికి అఖండ విజయం అదించిన రాష్ట్రప్రజలకు కృతజ్ఞతలు అంటూ 50 శాతం పైగా ఓట్లతో విజయం ఆషామాషిగా వచ్చింది కాదు. వైఎస్‌ జగన్‌ ప్రజలతో మమేకం అయ్యారు. ప్రజల పక్షాన నిలబడి అనేక పోరాటాలు చేశారు. 14 నెలల పాటు మూడువేల ఆరు వందల కిలోమీటర్లకు పైగా ప్రజల మద్యలో పాదయాత్ర చేశారు. ఇద్దరితో ప్రారంభమైన వైసీపి నేడు వెల్లివిరిసిన కోట్లాది ప్రజాభిమానంతో అధికారంలోకి చేరి అందలం ఎక్కబోతోంది"

"టీడీపీ ఐదేళ్లపాలనలో రాష్ట్రంలో జరిగిన అవినీతి, బంధుప్రీతి, చీకటి వ్యాపారాలు, ఇసుక, కల్తీ, కాల్-మని మాఫియాల ముప్పేటదాడితో జరుగుతున్న అరాచకాలు, దుష్పరిపాలనను గురించి ఆమూలాగ్రం తెలిసినా టిడిపి మనది - చంద్రబాబు మనవాడు అంటూ గుర్తించనట్లు ప్రవర్తించిన ఎల్లోమీడియా నేడు వైఎస్‌ జగన్‌ మోహన రెడ్డి వ్యాఖ్యల్ని వక్రీకరించాలని చూస్తోంది. గెలిచిన మరుక్షణం రాష్ట్రానికి మేలు చేయాలనే ఉధ్దేశంతో తెలంగాణ సీఎం కేసిఆర్‌తో నదీజలాల గురించి మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసి రాష్ట్ర ఆర్థికపరిస్దితిని గురించి వివరించారు. సహాయం కోరారు"

"కొన్ని మీడియా సంస్థలు కేంద్రంతో యుద్ధం ప్రకటించాలని జగన్ కోరినట్లుగా ప్రచారం చేస్తున్నాయి. ముందు మేం రిక్వెస్ట్‌ చేస్తాం, అని ప్రకటిస్తే, అడుక్కోవడం అని దాన్ని  వక్రీకరించారు. వైఎస్‌ జగన్‌ పోరాట పటిమ ప్రజలకు పూర్తిగా తెలుసు. రాష్ట్ర ప్రయోజనాలు సాధించే విషయంలో ఆయన చిత్తశుద్దితో ఉంటారని అందరికీ తెలుసు. కేవలం రాజకీయ శక్తిగా ఎదగాలనే కాదు, ప్రజలకు మేలైన సుపరిపాలన అందించి వారి హృదయాల్లో స్థానం సంపాదించాలన్నది వైఎస్‌ జగన్‌ ఆకాంక్ష"  

"అవినీతికి అడ్డుకట్టవేసి రాష్ట్రాన్ని అభివృద్దివైపుకు తీసుకువెళ్లే బృహత్తర బాధ్యతను ఆయన తలకెత్తుకున్నారు. ప్రతి పైసా సద్వినియోగం చేయాలనే ఆలోచనతో ఉన్నారు. చంద్రబాబు ప్రజల సొమ్ముతో శఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, ధర్మపోరాట దీక్షలు నిర్వహించి ప్రజా ధనాన్ని వేల కోట్లలో దుర్వినియోగం చేశారు. కానీ, ప్రజలకు అసౌకర్యం కలగకుండా, ప్రభుత్వంపై ఆర్థికభారం పడకుండా వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి ఈ నెల 30 (గురువారం)న మధ్యాహ్నం 12.23 గంటలకు విజయవాడ లోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు" అని పార్థసారథి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: