తమిళ హీరో సూర్య ఏపీ కాబోయే సీఎం జగన్ కు మంచి స్నేహితుడన్న విషయం తెలిసిందే. హీరో సూర్య గతంలో రాజకీయ సినిమా రక్త చరిత్రలో మద్దెల చెరువు సూరిగా నటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే సూర్య.. ఏపీలోని కాంగ్రెస్, టీడీపీ రాజకీయాలపై అవగాహన పెంచుకున్నారట.
ఇక జగన్ తో స్నేహంగా ఉండే సూర్య.. ఇప్పుడు తన స్నేహితుడు ముఖ్యమంత్రికాబోతుండటంపై స్పందించాడు. ఈ విషయం నాకు చాలా సంతోషంగా ఉంది. జగన్ పదేళ్ల కష్టానికి ఇప్పుడు తగిన ప్రతిఫలం దక్కిందని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు సూర్య.
జగన్ ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూర్య ఆకాంక్షించాడు. జగన్ సీఎం కావడంపై సంతోషం వ్యక్తం చేస్తూనే సుతిమెత్తగా ఆయన బాధ్యతలను కూడా గుర్తు చేశాడు హీరో సూర్య.. ప్రస్తుతం జగన్ పై హిమాలయాలంత బరువు ఉందని తన స్పందనలో తెలిపాడు.
జగన్ ముందు ఎన్నో సవాళ్లున్నాయి. వాటన్నింటినీ జగన్ ధైర్యంగా ఎదుర్కొంటారని తాను ఆశిస్తున్నానని సూర్య అంటున్నాడు. అదే సమయంలో యాత్ర 2 మూవీ గురించి కూడా స్పందించాడు. ఈ సినిమా స్క్రిప్టు తన వద్దకు వస్తే ఆలోచిస్తానంటున్నాడు సూర్య,.