బాబుకు మరో ఝలక్ ! జగన్ క్యాంపుకు ఆ టీడీపీ లేడీ లీడర్ ?

Chakravarthi Kalyan
ఆమె పేరు మోసిన మహిళానాయకురాలు.. కొన్నాళ్లు కాంగ్రెస్ లోనూ.. మరికొన్నాళ్లు టీడీపీలోనూ ఉన్న నాయకురాలు. ప్రస్తుతం టీడీపీలోనే ఉన్నారు.  కానీ బాగా సీనియర్ కావడంతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరమై ఓ నామినేటెడ్ పోస్టుతో సరిపెట్టుకున్నారు. ఆవిడే నన్నపనేని రాజకుమారి. 


అలాంటి టీడీపీ లీడర్ ఇప్పుడు జగన్ ను కలిసేందుకు విపరీతంగా ప్రయత్నిస్తున్నారట.  జగన్ ని కలిసేందుకు ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి వెళ్లారు. తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసేందుకు  ఆమె వెళ్లారు. 

అయితే ఆమె అక్కడికి వెళ్లే సరికే జగన్ తన నివాసానికి వెళ్లిపోయారు. దీంతో జగన్ ని కలవకుండానే నన్నపనేని వెనుదిరిగారు.ఇదే సమయంలో కొందరు విలేఖరులు ఆమెను ప్రశ్నిస్తే.. మహిళాకమిషన్ చైర్ పర్సన్ గా జగన్ ను కలుస్తాను తప్పేంటి అంటున్నారు. ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే.. నన్నపనేని రాజకుమారి కూతురు, అల్లుడు వైసీపీలోనే ఉన్నారు.

మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా ఇంకా నన్నపనేనికి రెండేళ్ల సమయం ఉంది. కానీ  ప్రభుత్వాలు మారినప్పుడు ఇలాంటి నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు రాజీనామాలు చేస్తుంటారు. లేదా కొత్త నాయకులను ప్రసన్నం చేసుకుని అదే పదవుల్లో కొనసాగుతారు. ఇప్పుడు నన్నపనేని చేస్తున్నది ఆ ప్రయత్నమే. మరి ఎంత వరకూ ఫలిస్తుందో ఏమో.  

 సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేయనున్న సందర్భంగా ఆయన్ని కలిసేందుకే నన్నపనేని అక్కడకి వెళ్లినట్టు తెలుస్తోంది. రేపు ఇడుపులపాయకు జగన్ వెళ్లనున్నారు. అక్కడి నుంచి తిరిగి తాడేపల్లికి వచ్చిన తర్వాత జగన్ ని ఆమె కలవనున్నట్టు సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: