జగన్ సీఎం అయిన వేళ.. విజయమ్మ కంట కన్నీరు - అపురూప దృశ్యం..

Chakravarthi Kalyan
ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఈనాడే ఎదురవుతుంటే.. అంటూ ఓ కవి పాడిన పాట.. వైఎస్ జగన్, విజయమ్మల జీవితంలో ఈరోజు నిజమైంది. జగన్ ను ముఖ్యమంత్రిగా చూడాలన్న విజయమ్మ చిరకాల వాంఛ నెరవేరిన వేళ.. అందుకు కొడుకు పడిన కష్టాలు.. కుటుంబం ఎదుర్కొన్న అవమానాలు గుర్తు కొచ్చాయో.. లేక.. ఇలాంటి సందర్భంలో చెట్టంత కొడుకుని చూసుకుని మురవాల్సిన తండ్రి లేడన్న ఆవేదన కలిగిందో కానీ.. విజయమ్మ భావోద్వేగం అందరినీ కదిలించింది. 


జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆమె జగన్ ను గుండెలకు హత్తుకుని కన్నీరు మున్నీరైంది. తల్లి హృదయాన్ని అర్థం చేసుకున్న జగన్.. అపురూపంగా ఆమెను ఆలింగనం చేసుకున్నాడు.. తల్లీ కన్నీరు తుడిచాడు.. వేదికపై ఉన్నవారు.. సభలో ఉన్నవారు ఈ దృశ్యం చూసి కరిగిపోయారు. 

ఇక వైఎస్ అభిమానులకైతే ఈ దృశ్యం చూసి కన్నీరాగలేదు.. ఓవైపు కొండంత ఆనందం..మరో వైపు హృదయాన్ని కదిలించిన గతం.. వైఎస్ ప్రమాణ స్వీకారానికి వైఎస్ కుటుంబ మంతా తరలివచ్చింది. అందరిలోనూ ఒకటే ఉద్వేగం.. ఉత్సాహం.. ఆనందం కలగలసిపోయాయి. 

గతంలో ఎదుర్కొన్న అవమానాలు.. పార్టీని గెలిపించుకునేందుకు వారు పడిన కష్టం.. దాదాపు పదేళ్ల పాటు సాగిన పోరాటం.. అన్నీ లీలగా కళ్ల ముందు కదిలిన క్షణాలు.. ఈ భావోద్వేగానికి కారణమయ్యాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: