ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో తెలుగుదేశం పార్టీ తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఎన్నికల్లో అధికారం కోల్పోవడం సహజమే కానీ.. మరీ ఇంత దారుణంగా ఓడిపోవడం ఆ పార్టీకి భవిష్యత్ లేకుండా చేస్తోంది. అందులోనూ ఏకంగా ఆ పార్టీ యువరాజుగా పేరున్న లోకేశ్ కూడా ఓడిపోవడం పార్టీ దశ, దిశను ప్రభావితం చేస్తోంది.
ఇప్పుడు లోకేశ్ కూడా ఓడిపోవడంతో మళ్లీ 2014 వరకూ చంద్రబాబే పార్టీని లీడ్ చేయాల్సిన పరిస్థితి అనివార్యమవుతోంది. దీంతో మరి లోకేశ్ ఇంకెప్పుడు నాయకుడవుతారు.. పార్టీని విజయవంతంగా నడిపిస్తారన్నది అంతుబట్టకుండా ఉంది. ఒకందుకు ఇదంతా చంద్రబాబు బొమ్మరిల్లు ఫాదర్ మెంటాలిటీ కారణమనే విమర్శలు వస్తున్నాయి.
లోకేశ్ కాస్త ముందుగానే ఫ్రీడమ్ ఇచ్చి.. పార్టీ నడిపించే బాధ్యత అప్పగించి ఉంటే మరీ ఇంత దారుణమైన ఓటమి వచ్చేది కాదన్న మాట టీడీపీ నేతల అంతర్గత సంభాషణల్లో వినిపిస్తోంది. అన్నీ నేనే చేయాలి.. అంతా నేనే నడపించాలి అన్న చంద్రబాబు మనస్తత్వం కారణంగానే టీడీపీ పరిస్థితి బొమ్మరిల్లు సినిమాలా తయారైందన్నటాక్ వినిపిస్తోంది.
చంద్రబాబు బొమ్మరిల్లు ఫాదర్ ప్రకాశ్ రాజ్ తరహా మెంటాలిటీ వల్ల ఇప్పుడు టీడీపీకి నాయకత్వ సమస్య వచ్చింది. ఓవైపు చంద్రబాబుకు వయస్సయిపోతోంది. మరోవైపు లోకేశ్ కు ఉన్న క్రేజ్ పోయింది. ఇప్పుడు టీడీపీని లీడ్ చేసేదెవరు.. ఈ పరిస్థితులను నుంచి మరో విజయం దిశగా నడిపించేదెవరన్న ప్రశ్నకు సమాధానం లభించడం లేదు.