టీటీడీ పాలక మండలి చైర్మన్ గా శారదా పీఠం స్వరూపానంద?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వైయస్ జగన్మోహన్ రెడ్డి దూకుడు పెంచిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఆయన కొత్త కొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు.  రాష్ట్రాభివృద్ది ఎలా సాధించాలి..అన్న విషయంలో ఉన్నతాధికారులు...సహచరులతో అప్పుడే సమీక్షలు నిర్వహించడం..నిర్ణయాలు తీసుకోవడం..ఇంప్లిమెంట్ చేయడం అన్నీ జరిగిపోతున్నాయి. ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ జగన్ మొదటి సారిగా విశాఖపట్నం విచ్చేశారు. 

విమానాశ్రయం నుంచి నేరుగా ఆయన విశాఖ శారదా పీఠం స్వామీజీ స్వరూపానందేంద్ర స్వామి ఆశ్రమానికి వెళ్లారు.  ఈ సందర్భంగా సీఎం జగన్ ఆయనకు కానుకలు ఇచ్చారు..తర్వాత జగన్ ని స్వరూపానంద స్వామి ఆలింగనం చేసుకొని ఎంతో ఆప్యాయత చూపించారు.  తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. 

టీటీడీ పాలక మండలి చైర్మన్ గా స్వరూపానందేంద్ర స్వామిని నియమించే యోచనలో సీఎం జగన్ ఉన్నట్లు సమాచారం అందుతుంది.  నేడు విశాఖ పర్యటన సందర్భంగా ఆయన తో ఈ విషయం పై చర్చలే కూడా జరిపినట్లు టాక్ నడుస్తుంది. అయితే ఇందుకు ఆయన ఒప్పుకుంటారా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది. 

అయితే టీటీడీ పాలక మండల చైర్మన్ పదవి కోసం నటుడు మోహన్ బాబు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లు కొంత కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఐతే టీటీడీని రాజకీచయాలకు అతీతంగా ఉంచాలని జగన్ భావిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: